మెడిక్షనరీ
చెవిలో జోరీగ చేసే శబ్దం ఎంత చిరాగ్గా అనిపిస్తుంది! అకస్మాత్తుగా ఎవరైనా ఈల వేసినా, టీ వంటి ద్రవపదార్థాలను జుర్రుకునే శబ్దాలు చేసినా, గట్టిగా బ్రేవుమంటూ తేన్చినా, కాళ్లు టపటపా కొడుతూ నడిచినా, ఎవరైనా గురకపెడుతున్నా ... ఆ చప్పుళ్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది అందరికీ ఉండే చాలా సాధారణమైన సహజాతం (ఇన్‌స్టింక్ట్). కానీ కొందరికి చిన్న చిన్న చప్పుళ్లే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తాయి. దాన్నే వైద్య పరిభాషలో ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు.
అమెరికాకు చెందిన నరాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు (న్యూరోసైంటిస్టులు) పావెల్ జెస్టర్‌ఫాబ్, మార్గరెట్ జస్టర్‌ఫాబ్ ఆ జబ్బుకు ఈ పేరు పెట్టారు. దీన్నే సాధారణంగా ‘మీసోఫోనియా’ అంటారు. అంటే శబ్దాలను అసహ్యించుకోవడం అని అర్థం. ఇలాంటి జబ్బు ఉన్నవాళ్లు టూత్ బ్రష్ చేసే చప్పుళ్లనూ, తుమ్ములనూ, దగ్గునూ, టైపింగ్ శబ్దాలనూ, ఆవలింతలనూ, పెద్దగా నవ్వడాన్ని, చివరకు మింగుతున్నప్పుడు వచ్చే శబ్దాలనూ తట్టుకోలేరు. ఈ జబ్బు ఉన్నవాళ్లకు శబ్దాలు వినగానే ఒళ్లంతా చెమటలు పెట్టడం, గుండెవేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివాళ్లకు ముందుగా ఫ్యాన్ శబ్దంతో మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా శబ్దాలను తట్టుకునేలా వారికి రకరకాల శబ్దాలు అలవాటు చేస్తారు. కొందరికి 6-12 వారాల పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) చేస్తారు.
శబ్దంతో ఇబ్బంది పెట్టే జబ్బు!
Published Wed, Nov 4 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM
Advertisement
Advertisement