బీజింగ్: ఇంట్లో బొద్దింక కనబడితేనే ఒకింత కలవరానికి గురవుతాం. ముఖ్యంగా అమ్మాయిలు వాటిని చూసి చెవులు చిల్లులు పడేలా గోల చేస్తారు. కానీ, చెన్ అమ్మాయి చెవిలో మాత్రం ఓ బొద్దింక ఏకంగా గూడే కట్టేసుకుంది. చెవిలోకి ఎప్పుడు చొరబడిందో ఏమోగానీ, రోజూ వింత శబ్దాలతో ఆ యువతిని బొద్దింక హడలు కొట్టించేది. దాని చర్యలతో ఆమెకు అప్పుడప్పుడు నొప్పిగా అనిపించేది. దాంతో చెవిలో దుమ్మూధూళీ ఉండొచ్చని ఆమె ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేసేది. అయినా, చెన్‌కు ఉపశమనం లభించకపోగా నొప్పి మరింత ఎక్కువైంది. చివరకు ఆమె డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. చెన్ చెవిలో బొద్దింక ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆ బొద్దింక బతికే ఉందని తెలియడంతో డాక్టర్లు ఒకింత ఆశ్చర్యం, ఆందోళనకు గురయ్యారు. (ఆ యువకుడి చెవిలో 26 బొద్దింకలు)
ఒటోస్కోప్ విధానం ద్వారా ఎట్టకేలకు యువతి చెవిలో నుంచి బొద్దింకను డాక్టర్లు బయటకు తీశారు. బొద్దింక ఇంకొన్ని రోజులు చెవిలోనే ఉండి ఉంటే.. కర్ణభేరీకి రంధ్రం చేసి తలలోకి ప్రవేశించేదని డాక్టర్లు పేర్కొన్నారు. చెన్ నిద్రించే సమయంలోనే బొద్దింక చెవిలో దూరి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా! పురుగులు, పాములు, బళ్లుల్ని సైతం వేయించుకు తినే చైనాలో. ఇదిలాఉండగా.. ఇళ్లల్లో తరచుగా క్రిమివినాశకాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చెవిలో ఏదైనా ఉందనే సందేహం కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు. (చదవండి: డబ్ల్యూటీవోకు చైనా: భారత్‌కు అనుకూలించే విషయాలివే!)
Comments
Please login to add a commentAdd a comment