గొడవ చేయొద్దన్నందుకు.. చెవి కొరికి మింగాడు | Drunken Man Bites Another Man Ear | Sakshi
Sakshi News home page

గొడవ చేయొద్దన్నందుకు.. చెవి కొరికి మింగాడు

Published Wed, May 23 2018 10:55 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Drunken Man Eaten Another Man Ear - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : 28 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చెవి కొరికి మింగేశాడో తాగుబోతు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పరిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుమార్‌(28) ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో నివాసముంటున్నాడు. మంగళవారం  రాత్రి అదే ప్రాంతానికి చెందిన దీపక్‌, సంతోష్‌ అనే ఇద్దరు వ్యక్తులు తప్పతాగి కుమార్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. కుమార్‌ను గమనించిన ఆ ఇద్దరు అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. కుమార్‌ వారిని గొడవ చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బతిమాలాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగి ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ఆరంభించారు.

దెబ్బలకు తాళలేకపోయిన అతడు సహాయం కోసం బిగ్గరగా అరవటం మొదలు పెట్టాడు. విచక్షణ కోల్పోయిన సంతోష్‌ దాదాపు సెంటీమీటర్‌ మేర కుమార్‌ చెవి భాగాన్ని కొరికి దాన్ని నమిలి మింగేశాడు. విషయం తెలుసుకున్న అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే ముందే కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి వారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. కుమార్‌కు ఆ ఇద‍్దరు వ్యక్తులతో ఎటువంటి గొడవలు లేవని దర్యాప్తులో తేలింది. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement