ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి
వరంగల్: నగరంలోని నాగమయ్య పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.