జిల్లాలో ఫ్యాన్ జోరుకు సైకిల్‌కు బలంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల తీరు ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తోంది.
బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఫ్యాన్ జోరుకు సైకిల్‌కు బలంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆదివారం జరి గిన మున్సిపల్ ఎన్నికల తీరు ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తోంది. ఉదయం నుంచి ఓటింగు సరళిని పరి శీలించిన రాజకీయ మేధావులు, విశ్లేషకులు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గాలి వీసిందని చెబుతున్నారు. బొబ్బిలి రాజులు వైఎస్‌ఆర్ సీపీలో చేరిన నాటి నుంచి పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వీరితో పాటు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, తాజాగా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిలు పార్టీలో చేరడంతో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది.
ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రావడంతో పట్టణ ఓటర్లంతా వైఎస్‌ఆర్ సీపీ వైపే మొగ్గు చూపించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ఈ ఎన్నికలు ద్వారా ఓటర్లు సరైన తీర్పును ఇవ్వనున్నారని పలువురు చెబుతున్నారు.
అయితే విజయనగరం పురపాలక సంఘంలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మిగి లిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడగా, ఒకటో రెండు స్థానాలు కైవసం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను ప్రజలు ఎలాగూ కాదంటున్నారని వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేశాయి.
అయినా ఆ రెండు పార్టీల కుట్రలు, కుతంత్రాలు, చీకటి ఒప్పందాలను పట్టణ ప్రజలు గ్రహించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వైపే నిలబడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వార్డుల్లో మంచి అభ్యర్థులను బరిలోనికి దించడానికి వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ నాయకులు పెద్ద కసరత్తే చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేసే తత్వమున్న వారికే టిక్కెట్టు ఇచ్చారు.
ఆ తరువాత బొబ్బిలిలో సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు అన్ని వార్డుల్లోనూ ఇంటింటా ప్రచారం, భారీ ర్యాలీలు నిర్వహించారు. అలాగే సాలూరులో రాజన్నదొర, పార్వతీపురంలో ఆ పార్టీ అరుకు పార్లమెంటు సమన్వయకర్త కొత్తపల్లి గీత, అసెంబ్లీ కో ఆర్డినేటరు జమ్మాన ప్రసన్నకుమార్, మాజీ ఎమ్మెల్యే జయమణిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఇవి ఆదివారం జరిగిన ఓటింగుకు ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం కనిపిస్తుండంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.