
హైడ్రో బైక్..
ఎలాగుంది.. అదిరిపోలే.. పెడల్స్‌తో చూడ్డానికి సైకిల్‌లా కనిపిస్తున్నా.. ఇది బైక్.. హైడ్రో బైక్.. అంటే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేస్తుందన్నమాట. ఇమ్రాన్ ఓథ్‌మాన్ అనే డిజైనర్ దీని రూపకర్త. ఇందులోని హైడ్రోజన్ ఇంధనం గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించి.. రసాయన చర్య జరిపి.. విద్యుత్‌ను పుట్టిస్తుంది. దాంతో ఇందులోని మోటారు నడిచి.. బైక్ దూసుకెళ్తుంది. ఇంతకీ ఈ పెడల్స్ ఎందుకనేగా.. ఇవి చూడ్డానికే తప్ప వాడ్డానికి పనికిరావు. పెడల్స్ ఉండటం వల్ల చాలా దేశాల చట్టాల ప్రకారం ఇది సైకిల్ విభాగం కిందకు వస్తుంది. దీని వల్ల లెసైన్స్, రోడ్ ట్యాక్స్ వంటి ఇబ్బందులుండవ ట.