బైక్‌ను పట్టాలు దాటిస్తూ.. ప్రాణాలొదిలిన రైతు | Bike to cross the rails .... | Sakshi
Sakshi News home page

బైక్‌ను పట్టాలు దాటిస్తూ.. ప్రాణాలొదిలిన రైతు

Published Wed, Dec 3 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

బైక్‌ను పట్టాలు దాటిస్తూ.. ప్రాణాలొదిలిన రైతు

బైక్‌ను పట్టాలు దాటిస్తూ.. ప్రాణాలొదిలిన రైతు

పుష్‌పుల్ రైలు ఢీకొని ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయూలు
ఛాగల్లు సమీపంలో ఘటన

 
ఛాగల్లు(స్టేషన్‌ఘన్‌పూర్) : పొలం నుంచి వస్తూ తన ద్విచక్ర వాహనాన్ని రైలు పట్టాలు దాటిస్తుండగా.. రైలు ఢీకొని ఓ రైతు దుర్మరణం పాలవ్వగా.. మరొకరు తీవ్రగాయూలపాలైన సంఘటన మండలంలోని ఛాగల్లు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని విశ్వనాథపురం పంచాయతీ పరిధిలోని మాన్‌సింగ్ తండాకు చెందిన భూక్య శక్రు(45), ఇదే మండలం ఇప్పగూడెంకు చెందిన పిట్టల మొగిళికి తానేదార్‌పల్లి- కుర్చపల్లి గ్రామాల మధ్య వ్యవసాయ భూములున్నాయి. నిత్యం మొగిళి తన ద్విచక్ర వాహనంపై శక్రును ఎక్కించుకుని పొలానికి వెళుతుండేవాడు.

రోజులాగే వ్యవసాయ భూముల వద్దకు వచ్చారు. మధ్యాహ్నం ఛాగల్లులో మొగిళికి పని ఉండడంతో శక్రును బైక్‌పై ఎక్కించుకుని పిల్లబాటపై రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు గూడ్సు రైలు వెళ్లగానే బైక్‌ను ఇద్దరు కలిసి దాటిస్తుండగా సికింద్రాబాద్ నుంచి వరంగల్ ైవె పు వెళుతున్న పుష్‌పుల్ ఒక్కసారిగా ఢీకొనడంతో శక్రు ఎగిరి పక్కనే ఉన్న స్థంభానికి తగిలి ముళ్లపొదల్లో శరీరమంతా చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. మొగిళి ఎగిరి కిందపడగా రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడు శక్రుకు బార్య, కుమారుడు ఉన్నారు. కాజీపేట ఆర్‌పీఎఫ్ ఏఎస్సై చంద్రమౌళి కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement