
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం సైకిల్ బ్రాండ్ స్ట్రయిడర్ సైకిల్స్ అర్బన్ కమ్యూటర్ విభాగంలో కొత్త ఈ–బైక్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.29,995 ధరలో వోల్టిక్ 1.7, రూ.37,999 ధరలో కాంటినో ఈటీబీ 100 మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది.
గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ వీటిలో పొందుపరిచారు. వోల్టిక్ 1.7 ఒకసారి చార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కాంటినో ఈటీబీ 100 మోడల్‌కు బయటకు తీయగలిగే బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టాటా ఇంటర్నేషనల్ అనుబంధ కంపెనీయే స్ట్రయిడర్ సైకిల్స్.
చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి..
Comments
Please login to add a commentAdd a comment