
దక్షిణ చైనాలోని షెంజన్ నగరంలోని చోటుచేసుకున్న ఓ ఘటన.. అక్కడి పాదచారులతో పాటుగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వేగంగా వచ్చిన ఓ సైకిల్ కారును ఢీకొనడంతో.. కారు బంపర్ ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో... ఇలా ఎలా జరిగిందబ్బా అని కొంతమంది నెటిజన్లు సందేహపడుతుంటే... మరికొంత మంది మాత్రం సైకిల్ ఢీకొడితే కారు ఇలా అయిపోతుందా.. ఇదో ఫేక్ ఫొటో అని కొట్టిపారేస్తున్నారు.
అయితే ఇది నిజమే అనుంటున్నారు షెంజన్ పోలీసులు. రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ సైక్లిస్ట్ కారును ఢీకొట్టగా ఈ ప్రమాదం సంభవించిందని క్లారిటీ ఇచ్చారు. సైక్లిస్ట్‌కు చిన్నపాటి గాయాలు కాగా కారులో ఉన్న వారు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో... సైకిల్‌ను దేనితో తయారు చేశార్రా బాబూ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారట ఈ ఫొటో చూసినవాళ్లు.
Comments
Please login to add a commentAdd a comment