ఇదో పొడవా...టి సైకిల్! | A large Bicycle | Sakshi
Sakshi News home page

ఇదో పొడవా...టి సైకిల్!

Published Tue, Nov 17 2015 11:50 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

ఇదో పొడవా...టి  సైకిల్! - Sakshi

ఇదో పొడవా...టి సైకిల్!

లోకో భిన్న రుచి అనే నానుడికి ఇది అచ్చంగా సరిపోతుంది. ఫొటోలో ఉన్న సైకిల్ చూశారా.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్. దీని పొడవెంతో తెలుసా ఏకంగా 117 అడుగులు. నెదర్లాండ్స్‌లోని మిజిల్ వాన్ మారెస్ వెర్క్‌ప్లాగ్ అనే సంస్థ ఈ సైకిల్‌ను తయారుచేసింది. అంతేకాదు ఈ సైకిల్ గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించుకుంది. దీన్ని నడిపేందుకు ఎందరు కావాలో అని అనుమానపడకండి. ఎందుకంటే కేవలం ఇద్దరు ఎంచక్కా జాం జాం అంటూ నడిపేయొచ్చు.

ఒకరు పూర్తిగా వెనక కూర్చుని సైకిల్ తొక్కుతుంటే, ముందు ఉన్న మరొకరు హ్యాండిల్ నియంత్రిస్తారు. అయితే ఈ సైకిల్‌ను తయారు చేసిన వెంటనే ఆస్ట్రేలియాలోని ఓ బృందం 135 అడుగుల పొడవైన సైకిల్ తయారు చేసి రికార్డును తిరగరాయడం కొసమెరుపు. కాకపోతే దీన్ని నడిపేందుకు 20 మంది కావాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement