
సైకిల్ తోడుగా... !
30ఏళ్లుగా సైకిల్ పైనే ప్రయాణం
వీపనగండ్ల మండలం అమ్మాయిపల్లికి చెందిన వెంకటేశ్వర్లుగౌడ్ ఫొటోగ్రాఫర్. తన పొలంలో వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాడు. 30ఏళ్లుగా సైకిల్‌పైనే ప్రయాణం చేస్తున్నాడు. ఏచిన్న అవసరం ఉన్నా, ఎంత దూరం వెళ్లాలన్నా సైకిల్‌పైనే వెళ్లివస్తున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల హెల్మెట్ పెట్టుకున్నానని తెలిపారు. హెల్మెట్‌ను కర్నూలులో కొనుగోలు చేశానని, సైకిల్‌పైనే అక్కడికి (70కిలోమీటర్లు) వెళ్లివచ్చానని చెప్పారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో వడగాల్పుల నుంచి రక్షణ కోసం హెల్మెట్‌ను వాడుతున్నానని అన్నారు.
పోలీసులు వాహనదారులను ఆపి హెల్మెట్ తప్పకుండా ధరించాలని చెబుతున్నా, కొందరు పట్టించుకోవడం లేదు. కనీసం ఇతన్ని ఆదర్శంగా తీసుకుని హెల్మెట్‌ను తప్పకుండా వాడాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఎస్ సూచిస్తున్నారు. తలకు రక్షణతోపాటు ఇతర ఉపయోగాల గురించి వాహనచోదకులకు పోలీసులు ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు. - వీపనగండ్ల