దేవనకొండ (కర్నూలు) : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు. ఆయన ఆదివారం ఉదయం కొమరాడ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వరకు ఇతర పోలీసు అధికారులతో కలసి సైకిల్ తొక్కారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.