sp ravi krishna
-
ఏకే–47తో ఎస్పీ భార్య కాల్పులా?
ఎస్పీ రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా భార్యకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిపించిన కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది. రవికృష్ణపై ఆలిండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి పంపిన లేఖ ఆధారంగా అతనిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా రవికృష్ణపై చర్యల నిమిత్తం న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి ఇచ్చిన వినతిపత్రంపై కూడా ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు(అర్బన్) ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో రవికృష్ణ, ఆయన భార్య పార్వతీదేవితో కలసి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లి ఆమెకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి, కాల్పులు జరిపించారని, ఇది ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రవికృష్ణపై ఆయుధాల చట్టం కింద తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రశాంతంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల పరీక్ష
– 13638 మంది హాజరు – పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : పటిష్ట బందోబస్తు మధ్య పోలీసు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల మెయిన్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి సుమారు 14762 మంది అభ్యర్థులు మెయిన్ సరీక్షకు అర్హత సాధించారు. అయితే 13638 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలులో ఇందుకోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పెద్ద మార్కెట్టు దగ్గర ఉన్న వాసవీ మహిళా కళాశాలను పరిశీలించారు. కళాశాల యాజమాన్యం పరీక్ష నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి తలెత్తిన ఇబ్బందుల గురించి అక్కడి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తుతో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ బీఆర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం వరకు జిరాక్స్ షాపులు, హోటళ్లు, టైప్ ఇన్సిట్యూట్‌లు, నెట్ సెంటర్లను మూసి వేయించారు. -
పట్టుదలతోనే లక్ష్యసాధన సాధ్యం
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కల్లూరు: పట్టుదలతోనే లక్ష్య సాధన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ కాలేజ్‌లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా అవార్డ్స్డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, క్విజ్ తదితర అంశాల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు. కళాశాల కోశాధికారి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఉత్తమ మార్గాలను అన్వేషించి అవసరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. గాయకులు సాయిశిల్ప, సుమంత్ ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ రెడ్డి, ఈడీలు రమేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ టీఎస్ఎస్ బాలాజీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గిరీష్ రెడ్డి, వివిధ శాఖాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో రెడ్ అలర్ట్
► రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ► రంగంలోకి దిగిన బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు ► ఎస్పీ నగరంలో విస్తృత పర్యటన కర్నూలు: ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా అంతటా సోదాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఐసిస్ సానుభూతి పరులు అనుమానిత ఉగ్రవాదులు, పొరుగు జిల్లా అనంతపురంలోని ఓ లాడ్జీలో మూడు రోజుల పాటు విడిది చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించి అన్ని సబ్‌డివిజన్ అధికారులను అప్రమత్తం చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ కొత్త వ్యక్తులపై నిఘాను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే కర్నూలు ముఖద్వారం అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, విజయవాడకు కర్నూలు నుంచి రహదారులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీస్ సానుభూతిపరులు జిల్లాలో కూడా ప్రవేశించే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. కర్నూలును జల్లెడ పట్టిన పోలీసులు: ఎస్పీ ఆకె రవికృష్ణ నాయకత్వంలో పోలీసులు కర్నూలును జల్లెడ పట్టారు. నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బందీ నిర్వహించారు. ఎస్పీ, ఆకె రవికృష్ణతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, వందలాది మంది సాయుధ బలగాలను వెంటబెట్టుకొని దాదాపు రెండు గంటల పాటు ఎస్పీ నగరమంతా కలియదిరిగి సోదాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర తదితరులు ఎస్పీవెంట ఉన్నారు. రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, కొత్తబస్టాండు, జ్యోతిమాల్, గుత్తి పెట్రోల్‌బంకు, జొహరాపురం, సుంకేసుల రోడ్డు, కోడుమూరు రోడ్డులోని వైజంక్షన్, వెంకటరమణ కాలనీ, నంద్యాల చెక్‌పోస్టు, కలెక్టరేట్, పాతబస్తీలోని రసూల్ ఖాన్ బజారు, చౌక్ బజారు, పెద్దమార్కెట్ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాలు, వ్యాపార దుకాణాలు సోదాలు నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ బృందాలు వెంటబెట్టుకొని పోలీసులు సోదాలు నిర్వహించడంతో ఏమి జరిగిందోనని నగర ప్రజలు ఆదోళనకు గురయ్యారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఏకకాలంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. లాడ్జీల్లో ముమ్మర సోదాలు నగరంలోని ప్రధాన లాడ్జీలతో పాటు వ్యాపార దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్‌కు ఎదురుగా ఉన్న జ్యోతి మాల్లో అడుగడుగునా తనిఖీలు నిర్వహించి నిర్వాహకులను అప్రమత్తం చేశారు. లాడ్జీలో గది కేటాయించే క్రమంలో విడిది చేసే వ్యక్తి గుర్తింపు కార్డు నకలు తప్పని సరిగా తీసుకోవాలని, రిసెప్షన్ కౌంటర్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు. అపరిచిత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వరాదని, కొత్తగా అద్దెకు వచ్చిన వారి గుర్తింపు కార్డులు, పూర్తి సమాచారం ఇంటి యజమానులు తప్పనిసరిగా సేకరించి ఉండాలని, కాలనీ వాసులను హెచ్చరించారు. -
కర్నూలులో ప్రభుత్వ పాఠశాలల దత్తత: ఎస్పీ రవికృష్ణ
ఆలూరు : కర్నూలు జిల్లాలోని 141 ప్రభుత్వ పాఠశాలలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఆలూరు సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను పోలీసు సిబ్బంది దత్తత తీసుకుని వాటిల్లో కనీస వసతుల కల్పన, విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. -
స్వచ్ఛ భారత్ కోసం సైకిలెక్కిన ఎస్పీ
దేవనకొండ (కర్నూలు) : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు. ఆయన ఆదివారం ఉదయం కొమరాడ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వరకు ఇతర పోలీసు అధికారులతో కలసి సైకిల్ తొక్కారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కక్షలు మానండి.. కలం పట్టండి
- దత్తత గ్రామం కప్పట్రాళ్లను సందర్శించిన ఎస్పీ ఆకే రవికృష్ణ - ‘మార్పు కోసం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సు - రెండు నెలల్లో గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల ఏర్పాటుకు కృషి కర్నూలు : కక్షలు మాని కలం పట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కప్పట్రాళ్ల ప్రజలు, విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఎస్పీ శుక్రవారం కప్పట్రాళ్లను సందర్శించారు. గ్రామంలో పర్యటించి ప్రజలు, విద్యార్థులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు దశాబ్దాలుగా గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల వల్ల వైరి వర్గాల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్షన్ గొడవల్లో మృతి చెందిన కుటుంబాలకు, జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల కుటుంబాల పిల్లల చదువుల పట్ల సహాయ, సహకారాలు అందిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన సరస్వతీ పూజకు హాజరై విద్యార్థులకు, గ్రామ ప్రజలకు డయల్ 100 గురించి అవగాహన కల్పించారు. డయల్ 100 పేరుతో ముద్రించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. గ్రామంలో ఏవైనా సమస్య ఉంటే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. మార్పు కోసం పేరుతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా ఓపెన్ చేసి అందులో ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి మహిళలు యువతీ యువకులు, విద్యార్థులు, వృద్ధులతో వేరు వేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కక్షలు వీడి గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉంటూ స్మార్ట్ గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది మహిళలు మరుగుదొడ్ల విషయం, విద్యార్థులు పాఠశాల గదుల విషయం ఎస్పీ దృష్టికి తీసుకురాగా కప్పట్రాళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించడానికి తనవంతు కృషి చేస్తానని, అలాగే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని మే నెలలోపు ఏర్పాటు చేసుకునేలా పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఫ్యాక్షన్ ప్రభావం వల్ల హైస్కూల్‌కు భవనం లేని గ్రామంగా కప్పట్రాళ్లను గుర్తించామని పై అధికారులతో చర్చించి భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు విడుదల చేసినప్పటికీ ఫ్యాక్షన్ కక్షల వల్ల ఆ నిధులు గ్రామానికి చేరువ కాలేదని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకురాగా హైస్కూల్ భవన నిర్మాణానికి తిరిగి నిధులు రాబట్టేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ‘ మార్పు కోసం’ పేరుతో కప్పట్రాళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పా కక్షలు పెంచుకుని నష్టపోకూడదని మహిళలకు సూచించారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. డోన్ డీఎస్పీ పీఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, కప్పట్రాళ్ల గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఐ మోహన్ కిశోర్, పోలీస్ సిబ్బంది ఎస్పీ వెంట గ్రామంలో పర్యటించారు. -
ఎస్పి ఫిర్యాదుని పట్టించుకోని పోలీసులు