ప్రశాంతంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల పరీక్ష
ప్రశాంతంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల పరీక్ష
Published Sun, Jan 29 2017 9:37 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
– 13638 మంది హాజరు
– పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన
ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు : పటిష్ట బందోబస్తు మధ్య పోలీసు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల మెయిన్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి సుమారు 14762 మంది అభ్యర్థులు మెయిన్ సరీక్షకు అర్హత సాధించారు. అయితే 13638 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలులో ఇందుకోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పెద్ద మార్కెట్టు దగ్గర ఉన్న వాసవీ మహిళా కళాశాలను పరిశీలించారు. కళాశాల యాజమాన్యం పరీక్ష నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి తలెత్తిన ఇబ్బందుల గురించి అక్కడి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తుతో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ బీఆర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం వరకు జిరాక్స్ షాపులు, హోటళ్లు, టైప్ ఇన్సిట్యూట్‌లు, నెట్ సెంటర్లను మూసి వేయించారు.
Advertisement