mains
-
AP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం(నవంబర్ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 మెయిన్స్‌పై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన అన్నీ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి. -
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్ష వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. -
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
-
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షలను గత సెపె్టంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు. 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది. -
AP: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ సారి కొత్త విధానం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. పకడ్బందీ చర్యలు.. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి -
డిసెంబర్ 12 నుంచి గ్రూప్-1 మెయిన్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం ఏడు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. డిసెంబర్ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకిగాను మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా... వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59,697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. -
‘టీఎస్పీఎస్సీ’ మాకు క్లారిటీ ఇవ్వదా?
హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయ నియామకాల మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ లాంగ్వేజ్ పరీక్షల విషయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్స్ ఎప్పుడు నిర్వహించేది క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ మాతృభాష అయిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం మెయిన్స్ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియక గందరగోళంగా ఉందని అంటున్నారు. అలాగే, ఇతర సబ్జెక్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన రెండు రోజుల్లోనే ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ లాంగ్వేజెస్‌కు స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయి వారం గడుస్తున్నా ‘కీ’ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఫైనల్ కీని కూడా ఆ సబ్జెక్టులకు ప్రకటించారని, నేడు గానీ, రేపు గానీ వాటి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు తెలిపిందని, కానీ, ఇప్పటి వరకు తమకు ప్రాథమిక కీని ప్రకటించకపోవడం అన్యాయం అని వాపోతున్నారు. నేడు, రేపో ఫలితాలు రానుండటంతో ఇప్పటికే మెయిన్స్ ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఉన్నందున మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, పిజికల్ డైరెక్టర్ పోస్టుల వారు చదువుకుంటారని, కానీ, తమ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ ఇటీవల లాంగ్వెజెస్‌కు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ‘కీ’ని విడుదల చేయడంతోపాటు తమకు మెయిన్స్ పరీక్షల షెడ్యూలు కూడా ప్రకటించాలని వారు ముక్తకంఠంగా డిమాండ్ చేస్తున్నారు. ముందు చెప్పినట్లుగా కాకుండా పాత షెడ్యూల్ స్థానంలో సవరణ చేసిన మెయిన్స్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్ర్కీనింగ్ టెస్టు ఫలితాలు వెల్లడి కాకపోవటం, ఈ నెల 29 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో చదువుకునేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పరీక్షలను 15 నుంచి 20 రోజులు వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, లాంగ్వెజెస్ పరీక్షలకు సంబంధించిన కీ విడుదల కాకపోవడం, మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో వారు తాజాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేయాలి
ఎస్కేయూ: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు . జాతీయ రహదారిపై సోమవారం మోకాళ్లపై కూర్చొని మూడు గంటలపాటు నిరసన తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రూప్–2 ప్రిలిమనరీ ఫలితాలు , మెయిన్స్ పరీక్షకు కేవలం 40 రోజుల వ్యత్యాసం ఉండడంతో పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. మెయిన్స్‌కు నూతన సిలబస్ ఎక్కువగా నిర్ధేశించడంతో కాల వ్యవధి సరిపోలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. వెంటనే పరీక్షను వాయిదా వేయాలన్నారు. ఎంఎస్ఎఫ్ నాయకులు జగదీష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరు యాదవ్, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల పరీక్ష
– 13638 మంది హాజరు – పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : పటిష్ట బందోబస్తు మధ్య పోలీసు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల మెయిన్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి సుమారు 14762 మంది అభ్యర్థులు మెయిన్ సరీక్షకు అర్హత సాధించారు. అయితే 13638 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలులో ఇందుకోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పెద్ద మార్కెట్టు దగ్గర ఉన్న వాసవీ మహిళా కళాశాలను పరిశీలించారు. కళాశాల యాజమాన్యం పరీక్ష నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి తలెత్తిన ఇబ్బందుల గురించి అక్కడి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తుతో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ బీఆర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం వరకు జిరాక్స్ షాపులు, హోటళ్లు, టైప్ ఇన్సిట్యూట్‌లు, నెట్ సెంటర్లను మూసి వేయించారు. -
ప్రిలిమినరీకి పగడ్బందీ ఏర్పాట్లు
నగరంలో 28 పరీక్షా కేంద్రాలు ఇక నుంచి విజయవాడలోనే మెయిన్స్ పరీక్ష సమీక్షించిన కలెక్టర్ విజయవాడ : యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు విజయవాడలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ చెప్పారు. శనివారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 7న జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు నియమితులైన సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వరాదని చెప్పారు. ఏవిధమైన సందేహాలున్నా, వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరీక్షను పర్యవేక్షించటానికి ఐదుగురు ఐఏఎస్‌లతో తనిఖీ ఆఫీసర్స్‌ను నియమించినట్లు చెప్పారు. విజయవాడలో 28 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 1400 మంది ఇన్విజలేటర్స్‌తోపాటు, 94 మంది అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా సెంటర్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులను ఆదేశించామన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి విజయవాడలో మెయిన్ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ సబ్‌సెంటర్ల సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లు అభ్యర్థులతో ఫ్రెండ్లీ నేచర్‌తో మెలగాలన్నారు. చూపులేని అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పటమట కృష్ణవేణి ఇంగ్లీషు మీడియం స్కూలులో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వీరికి సహాయకులుగా ఉండే సబ్‌స్రై్కబర్స్‌తో జెసీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో యూపీఎస్సీ రాష్ట్ర కన్వినర్ నరేష్ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, డీఆర్వో సీహెచ్ రంగయ్య, డీఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మీ సాయంతో విద్యార్థులు విజయకేతనం!
కాశ్మీర్ః ఎప్పుడూ సమస్యలతో సతమతమయ్యే కాశ్మీర్ లోయలో విద్యాకుసుమాలు విరబూశాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆర్మీ ఉచిత కోచింగ్ ఇవ్వడంతో శిక్షణ తీసుకున్న పదిహేనుమంది విద్యార్థుల్లో పదకొండుమంది ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఓ రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహించడం ద్వారా ఆర్మీ.. సూపర్ 30 స్టూడెంట్స్ ను ఐఐటీ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసుకుంది. వీరిలో కాశ్మీర్ వ్యాలీనుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరైన పదిహేను మందిలో పదకొండు మంది విద్యార్థులు ఐఐటీ అడ్బాన్స్ పరీక్షకు అర్హత సంపాదించి ప్రత్యేకతను చాటారు. కాశ్మీరీ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్మీ అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీర్ లలో జరిగే జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు పంపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక పరీక్షను నిర్వహించి, మొత్తం 30 మంది సూపర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణిత శాస్త్రాల్లో నుభవజ్ఞులైన అధ్యాపకులతో పదకొండు నెలల పాటు వారికి డాగర్ డివిజన్ కు చెందిన చినార్ కార్స్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో అవకాశం కల్పించింది. ఇక్కడ శిక్షణ పొంది, ఎంట్రన్స్ పరీక్ష రాసిన 15 మందిలో 11 మంది అర్హతను సాధించారని... చినార్ కార్స్ ఈ సంవత్సరం నుంచి సూపర్ 30 ప్రోగ్రామ్ ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందని మేజర్ జనరల్ జెఎస్ నైన్ తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన మేజర్... కాశ్మీర్ లోని యువకులంతా తమ ప్రతిభను వెలికి తీసి, చినార్ 9 జవాన్ క్లబ్స్ ద్వారా సరైన ఉద్యోగావకాశాలను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. జాయింట్ ఎంట్రన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది హాజరౌతారని, జమ్మూ, కాశ్మీర్ లలో నిర్వహించిన సూపర్ 30 పరీక్ష ద్వారా శిక్షణ తీసుకున్న మొత్తం 15 మంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి, అందులో 11 మంది ఐఐటీ పరీక్షకు అర్హత సాధించారని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తాజా ఫలితాలు ఇప్పుడు కాశ్మీర్ లోని విద్యారంగానికే ఆశను కల్పిస్తున్నాయి.