సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 మెయిన్స్‌పై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.
కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన అన్నీ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment