డిసెంబర్‌ 12 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ | Andhra Pradesh Group 1 Mains Exam Schedule Released By APPSC | Sakshi
Sakshi News home page

మొత్తం 7 పేపర్లుగా పరీక్ష నిర్వహణ : ఏపీపీఎస్సీ

Published Thu, Jul 4 2019 5:55 PM | Last Updated on Thu, Jul 4 2019 6:07 PM

Andhra Pradesh Group 1 Mains Exam Schedule Released By APPSC - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం ఏడు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. డిసెంబర్ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకిగాను మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా... వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59,697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement