సైకిల్‌పైనే తిరుగుతా | Additional TSSP DG Rajiv Trivedi | Sakshi
Sakshi News home page

సైకిల్‌పైనే తిరుగుతా

Published Mon, Jan 19 2015 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

సైకిల్‌పైనే తిరుగుతా

సైకిల్‌పైనే తిరుగుతా

ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్లకు అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించవచ్చు. వెంట భద్రతా సిబ్బంది ఉంటారు. దాదాపు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడికైనా వెళితే తమ దర్పాన్ని చాటుకుంటుంటారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌త్రివేది మాత్రం అలా కాదు. దర్పాన్ని పక్కన బెట్టి సాధారణంగా ఉండటం, కింది స్థాయి అధికారులు, సిబ్బందితో కలుపుగోలుగా ఉండటం ఆయన నైజం. దూర ప్రయాణాలకు సైకిల్‌ను వాడడమే ఆయనకు ఇష్టం.
 
డిచ్‌పల్లి/నిజామాబాద్ సిటీ: టీఎస్‌ఎస్‌పీ అడిషనల్ డీజీగా ఉన్న రాజీవ్‌త్రివేది తొలిసారిగా డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ను ఆదివారం సందర్శించారు. తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి సైకిల్‌పై బ యలుదేరిన ఆయన 11.45కు బెటాలియన్‌కు చేరుకున్నారు. కమాండెంట్ శ్రీనివాసరావు నేతృత్వంలో అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు గులాబీలను అందజేశారు. అక్కడి నుంచి ఆయన బెటాలి  యన్‌లోని నడుచుకుంటూ వెళ్లి విశ్రాంతి గృహంలో అరగంట సేదదీరారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
 
అన్ని బెటాలియన్లనూ సైకిల్‌పై తిరుగుతా
రాష్ట్రంలోని బెటాలియన్లను సైకిల్‌పై తిరగాలని నిర్ణయించుకున్నానని రాజీవ్ త్రివేది తెలి పారు. అడిషనల్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. బెటాలియన్లలో పరిస్థితులు, సమస్య  ల గురించి చాలా వరకు తె లిసినా,ప్రత్యక్షంగా పరిశీలించాలని బెటాలియన్‌కు వచ్చినట్లు తెలి పారు. తెలంగాణ ప్రాంతం అందమైనదని పేర్కొన్నారు.

హైదరాబాద్-నిజామాబాద్ రహదారి అన్నింటి కన్నా బాగుంటుందన్నా రు. వాహనానికి, సైకిల్‌కు ఎంతో తేడా ఉం టుందన్నారు. దారిలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయని, అక్కడి పిల్లలు తనకు బైబై చెప్ప డం ఆనందంగా  ఉందన్నారు. సైకిల్‌పై వ స్తుం    టే అటవీ ప్రాంతంలో కోతులు, నెమళ్లు కన్పిం చాయన్నారు. రహదారి పక్కన వరి నాట్లు వేస్తున్న కూలీలు, రైతులు, అందమైన పూల చెట్లు మనసుకు ప్రశాంతత నిచ్చాయని ఆయన చెప్పారు.
 
చక్కగా పని చేస్తున్నారు
తెలంగాణలోని బెటాలియన్ల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారని రాజీవ్‌త్రివేది ప్రశంసించారు. కొన్ని బెటాలియన్లలో సిబ్బంది నివాసాలు శిథిలావస్థ కు చేరుకున్నాయని, వాటి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డీజీపీని కోరుతామన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మకు బెటాలియన్స్ అంటే ఎంతో ఇష్టమని,ఇటీవల జార్ఖండ్‌లో ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించి వచ్చిన టీఎస్‌ఎస్‌పీ సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో పోలీసులకు కొత్త వాహనాలను సమకూర్చిం దని, ప్రత్యేక పోలీసుల సంక్షేమంపైనా దృష్టి సారిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.
 
ఫిట్‌నెస్ ఒక్కటే సరిపోదు
పోలీసు ఉద్యోగం కష్టంతో కూడుకున్నదని, పోలీసు సిబ్బంది ఫిట్‌నెస్‌తో ఉంటేనే సరిపోదన్నారు. వారి కుటుంబసభ్యులు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం కుటుంబసభ్యులందరూ కలిసి సమయం దొరికినప్పుడల్లా  శారీరక దా రుఢ్యాన్ని, మానసికోల్లాసాన్ని పెంచే వ్యాయామాలు చేయాలని సూచించారు. బెటాలియన్‌లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వ  యం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ప్రసిద్ధి పొందిన శిక్షణ సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకున్నామన్నారు.
 
కుటుంబం వెంట రాగా
అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు సైకిల్‌పై వచ్చారు. ఆయన ఇద్దరు కుమారులు ప్ర సూన్ త్రివేది, ప్రశాంత్ త్రివేది  రెండు సైకిళ్లపై వచ్చారు. భార్య ఉదయ వాహనంలో తరలి వ చ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క మాం డెంట్ ప్రసన్నకుమార్, బీడబ్ల్యుఓ మహేందర్ పాల్గొన్నారు. అనంతరం రాజీవ్‌త్రివేది నగరా నికి బయలుదేరి వెళ్లారు.
 
ఆయనో విలక్షణ అధికారి
పోలీస్ శాఖలో ఆయన ఓ విలక్షణమైన అధికారి. అత్యున్నత హోదాలో ఉంటూనే, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండియా శ్రీలంక, భీమిలీ విశాఖపట్నం మధ్య సముద్రాన్ని ఈదారు. ఇండియా, శ్రీలంక మధ్య సముద్రం లో 30 కిలోమీటర్లు 12.31 గంటలలో ఈదటం ఇప్పటికి వర్డల్ రికార్డుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ‘సాక్షి’తో ఆయన అనుభవాలను ఇలా పంచుఉన్నారు. గతంలో అనేకసార్లు, అనేక ప్రదేశాల లో సైకిల్‌పై పర్యటించాను.

గతంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌పై పర్యటించాను. ఆదివారాలలో ఉదయం సైకిల్‌పై బయలుదేరి మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి చేరుకునేవాడిని. ఇపుడు తొలిసారిగా సైకిల్‌పై హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చాను. తెలంగాణ పోలీసులలో చాలా ప్రతిభ ఉంది. వ్యక్తిగత ప్రతిభను బట్టి మంచి క్రీడా జట్లను రూపొందిస్తాం. దేశం లో ప్రస్తుతానికి తెలంగాణ పోలీస్ బ్యాండ్ రెండవ స్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయం.

హాకీ, కబడ్డీ,ఫుట్‌బాల్ టీములు బాగున్నాయి. వాలీబాల్, బాస్కెట్‌బాల్ జట్ల తయారీకి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ బెటాలియన్లకు దేశంలో మంచి గుర్తింపు ఉంది. దీనిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతాం. బెటాలియన్లలో అవి నీతిని సహించేది లేదు. ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకోవ డానికీ వెనుకాడం. భార్య ఉదయ గృహిణి, పెద్ద కుమారుడు ప్రసూ న్ సివిల్ ఇంజీనీర్ ఫైనల్, రెండవ కుమారుడు ప్రశాంత్ సివిల్ ఇంజి  నీర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ లాంగ్ సైకిల్ డ్రెవ్, లాంగ్ స్విమ్మింగ్ చేయటం ఇష్టపడుతారు. ఉదయ కూడా చాలా దూరంగా సైకిల్ తొక్కుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement