Rajiv Trivedi
-
రెండేళ్లలో మోడ్రన్ జైలును నిర్మిస్తాం: రాజీవ్ త్రివేది
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని సెంట్రల్ జైలుని మంగళవారం జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. కాగా గతంలో కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా సెంట్రల్ జైలు స్థానంలో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వరంగల్ సెంట్రల్ జైలును వేరే చోటికి తరలిస్తున్నారు. దీనిలో భాగంగా ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నట్లు రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' ప్రస్తుతం ఈ జైలులో 956 మంది ఖైదీలు, 2,667 మంది సిబ్బంది ఉన్నారు. ఇవాళ మొత్తం 119 మంది ఖైదీలను తరలిస్తున్నారం. 15 రోజుల్లోగా ఖైదీల తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలును వేరొకచోట మోడ్రన్ జైల్‌గా నిర్మిస్తాం. కొత్త జైలు నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్లలోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైలును మోడ్రన్ జైలుగా నిర్మాణం చేపడతాం. ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.'' అని రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. -
మరో కేసు డ్రాప్
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ సరైన ఆధారాలు సేకరించకపోవడంతో మరో కేసును డ్రాప్ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్ వై.వెంకటేశ్వర్రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ 2009లో కేసు నమోదు చేసింది. దీంతో 11 నెలలపాటు పోలీస్ శాఖ సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన్ను నగర కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా నియమించింది. అయితే కేసు నమోదు తర్వాత అవినీతి నిరోధక శాఖ సరైన సాక్ష్యాలు సేకరించలేదు. దీంతో తనపై నమోదైన కేసులో అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని, తనకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్రావు హోంశాఖకు అప్పీల్ చేసుకున్నారు. ఆయన అప్పీల్‌ను పరిశీలించిన ప్రభుత్వం అవినీతి ఆరోపణలు రుజువు కాకపోవడంతో 11 నెలల సస్పెన్షన్ సమయాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సూచిస్తూ.. ఆ 11 నెలల కాలానికి వెంకటేశ్వర్రావుకు దక్కాల్సిన జీతభత్యాలతో పాటు తదుపరి ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. 2016లో ఆధారాల్లేని 125 కేసులు ఏసీబీ మూసివేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
‘పరుగు’న రానున్న రాజీవ్ త్రివేది
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు రాజీవ్ త్రివేది... సీనియర్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పేట్లబురుజులోని నగర సాయుధ విభాగం కార్యాలయంలో జరగనున్న ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు పరుగు, ఈత, సైక్లింగ్, మారథాన్ల ద్వారా సుదూరాలను చేరుకుని రికార్డులు నెలకొల్పిన ఆయన.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనిలో పాల్గొనేందుకు నేటి ఉదయం 6 గంటలకు జూబ్లీహిల్స్ పరిధిలోని ప్లజెంట్ వ్యాలీలో తన క్వార్టర్స్ నుంచి బయలుదేరతారు. మొత్తం 16 కిలోమీటర్ల దూరాన్ని తన పరిగెడుతూ రానున్నారు. రోజూ ఉదయం రన్నింగ్ చేసే అలవాటున్న ఆయన బుధవారం నాటి రన్నింగ్‌ను ఇలా పూర్తి చేయనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, మదీనా చౌరస్తా మీదుగా ఆయన పరుగు సాగనుంది. -
పెరిగిన హోంగార్డుల వేతనం
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా వివిధ రకాల విధుల్ని నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వీరి రోజువారీ వేతనాన్ని పెంచుతూ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డులకు కానిస్టేబుళ్లకు ఉన్నట్లే అనేక సౌలభ్యాలు కల్పించారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 14 విభాగాల్లో పనిచేస్తున్న 18,800 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. గతేడాది డిసెంబర్ 13న ప్రగతి భవన్లో జరిగిన హోంగార్డుల సమావేశంలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం విదితమే. వీటిని అమలులోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు వేతనంగా లభిస్తోంది. ఇకపై రోజుకు రూ.675 చొప్పున నెలకు రూ.20,250 లభించనుంది. ప్రతి ఏడాదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి రూ.వెయ్యి చొప్పున ఈ వేతనం పెరగనుంది. ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి ప్రస్తుతం జీతానికి 30 శాతం అదనంగా పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇకపై ఆ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులకూఈ అలవెన్స్ లభించనుంది. కానిస్టేబుళ్లకు ఇస్తున్నట్లు యూనిఫాం అలవెన్స్, ఇద్దరు పిల్లల వరకు మహిళా హోంగార్డులకు ఆరు నెలల మాతృత్వ సెలవు(మెటర్నిటీ లీవ్), పురుష హోంగార్డులకు 15 రోజుల పితృత్వ సెలవు(పెటర్నిటీ లీవ్) అమలులోకి తీసుకువచ్చారు. భారీ బందోబస్తు విధుల్లో పాల్గొన్నప్పుడు హోంగార్డులకూ కానిస్టేబుళ్ల మాదిరిగా డైట్ చార్జీలుగా పిలిచే బత్తా మంజూరు చేస్తారు. పోలీసు ఆస్పత్రుల్లో హోంగార్డులకూ అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో ఉండగా మరణించే హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే తక్షణం సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి హోంగార్డుకీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పోలీసుల మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాజీవ్ త్రివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయుధాలు డిపాజిట్ చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హోంశాఖ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈనెల 9వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లైసెన్స్ ఉన్న ఆయుధాలు కలెక్టర్, ఎస్పీ కార్యాలయం . లేదంటే సంబంధిత పోలీస్‌స్టేషన్, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డులు సైతం తుపాకులు సరెండర్ చేయాలని ఉత్తర్వుల్లో రాజీవ్‌త్రివేదీ స్పష్టంచేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు వెంట ఉండకూడదని పేర్కొన్నారు. -
హైదరాబాద్ టు కరీంనగర్
సిద్దిపేటకు చేరుకున్న అదనపు డీజీ రాజీవ్ త్రివేదీ సైకిల్ యాత్ర హైదరాబాద్/సిద్దిపేట రూరల్: ఎప్పుడూ ఏదో ఒక సాహసానికి, సాహసయాత్రకు అంకురార్పణ చేసే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. ఈసారి ఆయన వెంట∙ఇద్దరు కుమారులు ప్రసూన్, ప్రశాంత్ సైతం బయలుదేరారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర సిద్దిపేట మీదుగా కరీంనగర్ వరకు 165 కిలోమీటర్లు సాగనుంది. ఈ యాత్ర దారిలోని పలు ప్రాంతాల్లో పోలీసు, విజిలెన్స్ అధికారులతో కలసి వ్యాపార, వాణిజ్య వర్గాలు, బ్యాంకర్లు ఇతర ఆఫీసర్లతో రాజీవ్ త్రివేది సమావేశాలు ఏర్పాటు చేశారు. డిజిటల్ తెలంగాణ కావాలి: రాజీవ్ త్రివేదీ రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపే యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డీజీ రాజీవ్ త్రివేది అన్నారు. హైదరాబాద్ నుంచి తమ కుమారులతో కలసి సైకిల్ తొక్కుతూ 100 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు చేరుకున్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ మొదట సిద్దిపేటను క్యాష్‌లెస్ నియోజకవర్గంగా మారుస్తున్నారనీ, ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. -
తాత్కాలిక డీజీపీగా సుదీప్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులను అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ బాధ్యతలను తాత్కాలికంగా సుదీప్ లక్టాకియాకు అప్పగించనున్నారు. అలాగే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది బాధ్యతలను అధర్ సిన్హాకు అప్పగిస్తారు. శివశంకర్‌కు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బాధ్యతలను అప్పగిస్తారు. జితేందర్‌కు సీటి పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థపై అధ్యయనానికి యూఎస్, యూకేలో పర్యటించనున్నారు. -
ఇంటెలిజెన్స్ పోలీసులకు సర్కారు కానుక
25 శాతం అదనపు అలవెన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. ఇంటెలిజెన్స్‌లో పనిచేసే పోలీసులు, నేర విచారణ విభాగం (సీఐడీ)లో పనిచేసే సిబ్బందికి మూలవేతనంతో పాటు 25 శాతం అదనపు అలవెన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఎస్ఐబీలో పనిచేసే వారికి 50 శాతం అదనపు అలవెన్స్, సీఎస్ఎల్, అక్టోపస్లలో పనిచేసే వారికి 60 శాతం, ఏసీబీలో పనిచేసే వారికి 30 శాతం అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి ఇంటెలిజెన్స్, సీఐడీలలో పనిచేసే వారికీ అదనపు అలవెన్స్ లభించనుంది. -
110 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన రాజీవ్ త్రివేది
ధారూరు (రంగారెడ్డి) : రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తన ఇద్దరు కుమారులతో కలసి చేపట్టిన 110 కిలోమీటర్ల సైక్లింగ్ ఆదివారం హైదరాబాద్ నుంచి ధారూరు మీదుగా తాండూర్ వరకు కొనసాగింది. ఈ సైక్లింగ్‌లో రాజీవ్త్రివేదితో పాటు ఆయన కుమారులు ప్రసూన్, ప్రశాంత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం సైక్లింగ్ నడక, పరుగు, శారీరక వ్యాయామాలు అలవాటుగా చేసుకున్నందున ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఆరోగ్యమే సంపదగా భావించాలనీ, ఆరోగ్యం ఉంటే కోట్లు సంపాదించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మాంసం, మద్యం వలన వివిధ రకాల రోగాలు వచ్చి ప్రజలు ఆనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, వీటికి దూరంగా ఉండాలనీ ఆయన సూచించారు. రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లో రోడ్లు బాగున్నాయని, రంగారెడ్డి జిల్లాలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ధారూరు నుంచి అడవి మీదుగా తాండేర్ వైపు వెళుతున్న ఆయనకు రోడ్డు పక్కనే పేపర్ ప్లేట్లు, పాలిథిన్ కవర్లు గమనించిన ఆయన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయరాదని అన్నారు. తాను 1982లో ఉద్యోగంలో వచ్చానని, చిన్ననాటి నుంచి ఇలాంటి నడక, పరుగు, సైక్లింగ్ చేయడం అలవాటుగా వస్తుందని, దీని వలన తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌కు పోలీసుశాఖ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల సామాజిక సేవలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫోటోలు, షార్ట్ఫిల్మ్లలో ఉత్తమమైన వాటికి పోలీసుశాఖ బహుమతులను ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్ బజరంగ్ ప్రసాద్‌కు మూడో బహుమతి (రూ.25వేలు), కన్సోలేషన్ బహుమతులను ప్రకటించారు. ఈ పోటీకి రాష్ట్రవ్యాప్తంగా 563 ఫోటోలు, 103 షార్ట్‌ఫిల్మ్‌లు వచ్చాయి. జాతీయ పోలీస్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ ఉమేష్ ష్రాఫ్ అధ్యక్షతన 8 మంది సభ్యుల కమిటీ ఉత్తమ ఫొటోల్ని ఎంపిక చేసింది. ఇందులో మొదటి బహుమతి (రూ.లక్ష నగదు)ని వరంగల్ జిల్లాకు చెందిన వెంకన్న (నమస్తే తెలంగాణ)కు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన ఎస్.రవికుమార్‌కు రెండో బహుమతి (రూ.50 వేలు), మరో నలుగురికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. వీరికి ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బహుమతులను అందజేస్తారు. షార్ట్‌ఫిల్మ్ ఎంట్రీలను హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. వీటి ఎంపిక పూర్తికానందున పేర్లు వెల్లడి కాలేదు. -
హైకోర్టును ఆశ్రయించిన రాజీవ్ త్రివేది
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ కేసుపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
'కోర్టు ఇచ్చిన నోటీసులను తీసుకున్నాం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు అందినట్లు తెలంగాణ హెంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలిపారు. తాము ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ వద్ద ఉన్న వివరాలను భద్రపరుస్తామన్నారు.ఎప్పుడు కోరితే అప్పడు.. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచుతామని రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. ఆ వివరాలు ఏమిటి అనేది బహిర్గతమైనప్పుడే తెలుస్తుందని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ్ చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసులు తెలంగాణ హెం సెక్రటరీ రాజీవ్ త్రివేదికి అందించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఆ నోటీసులను త్రివేది తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సచివాలయంలో సిట్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆ అధికారులు గో బ్యాక్ అంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. రాజీవ్ త్రివేది కార్యాలయానికి చేరుకున్న క్రమంలో తెలంగాణ ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. చాలాసేపు త్రివేది వేరే సమావేశంలో ఉండటంతో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ అధికారులు చాలాసేపు బయట నిరీక్షించారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతూ ఏపీ పోలీసులతో నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు. -
హైదరాబాద్ టు నల్లగొండ
రాష్ట్ర పోలీస్ బెటాలియన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) రాజీవ్ త్రివేది సోమవారం సైకిల్‌పై హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరిన ఆయన 9 గంటలకు బెటాలియన్‌కు చేరుకున్నారు. నల్లగొండక్రైం: రాష్ట్రానికి నాలుగు పోలీస్ బెటాలియన్లు మంజూరైనట్లు తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) రాజీవ్ త్రివేది తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి స్థానిక అన్నెపర్తి 12వ బెటాలియన్ వరకు సైకిల్‌పై వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 9 బెటాలియన్లు ఉన్నాయని అదనంగా మరో నాలుగు బెటాలియన్లు మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్‌లోని బెటాలియన్‌ను కూడా సైకిల్‌పై వెళ్లి పరిశీలించినట్లు వివరించారు. పోలీస్ అంటేనే ఫిట్నెస్ అని, ప్రతి వ్యక్తి సైకిల్ సులభంగా తొక్కుతాడని వివరించారు. పోలీసులు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. త్రివేదికి ఎస్పీ డాక్టర్ ప్రభాకర్ రావు, బెటాలియన్ కమాండెంట్ బాబూజీరావులు ఘన స్వాగతం పలికారు. -
సైకిల్‌పైనే తిరుగుతా
ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్లకు అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించవచ్చు. వెంట భద్రతా సిబ్బంది ఉంటారు. దాదాపు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడికైనా వెళితే తమ దర్పాన్ని చాటుకుంటుంటారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌త్రివేది మాత్రం అలా కాదు. దర్పాన్ని పక్కన బెట్టి సాధారణంగా ఉండటం, కింది స్థాయి అధికారులు, సిబ్బందితో కలుపుగోలుగా ఉండటం ఆయన నైజం. దూర ప్రయాణాలకు సైకిల్‌ను వాడడమే ఆయనకు ఇష్టం. డిచ్పల్లి/నిజామాబాద్ సిటీ: టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీగా ఉన్న రాజీవ్‌త్రివేది తొలిసారిగా డిచ్పల్లి ఏడో బెటాలియన్‌ను ఆదివారం సందర్శించారు. తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి సైకిల్‌పై బ యలుదేరిన ఆయన 11.45కు బెటాలియన్‌కు చేరుకున్నారు. కమాండెంట్ శ్రీనివాసరావు నేతృత్వంలో అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్ఐ లు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు గులాబీలను అందజేశారు. అక్కడి నుంచి ఆయన బెటాలి యన్‌లోని నడుచుకుంటూ వెళ్లి విశ్రాంతి గృహంలో అరగంట సేదదీరారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్ని బెటాలియన్లనూ సైకిల్‌పై తిరుగుతా రాష్ట్రంలోని బెటాలియన్లను సైకిల్‌పై తిరగాలని నిర్ణయించుకున్నానని రాజీవ్ త్రివేది తెలి పారు. అడిషనల్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి డిచ్పల్లి ఏడో బెటాలియన్‌ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. బెటాలియన్లలో పరిస్థితులు, సమస్య ల గురించి చాలా వరకు తె లిసినా,ప్రత్యక్షంగా పరిశీలించాలని బెటాలియన్‌కు వచ్చినట్లు తెలి పారు. తెలంగాణ ప్రాంతం అందమైనదని పేర్కొన్నారు. హైదరాబాద్-నిజామాబాద్ రహదారి అన్నింటి కన్నా బాగుంటుందన్నా రు. వాహనానికి, సైకిల్‌కు ఎంతో తేడా ఉం టుందన్నారు. దారిలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయని, అక్కడి పిల్లలు తనకు బైబై చెప్ప డం ఆనందంగా ఉందన్నారు. సైకిల్‌పై వ స్తుం టే అటవీ ప్రాంతంలో కోతులు, నెమళ్లు కన్పిం చాయన్నారు. రహదారి పక్కన వరి నాట్లు వేస్తున్న కూలీలు, రైతులు, అందమైన పూల చెట్లు మనసుకు ప్రశాంతత నిచ్చాయని ఆయన చెప్పారు. చక్కగా పని చేస్తున్నారు తెలంగాణలోని బెటాలియన్ల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారని రాజీవ్‌త్రివేది ప్రశంసించారు. కొన్ని బెటాలియన్లలో సిబ్బంది నివాసాలు శిథిలావస్థ కు చేరుకున్నాయని, వాటి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డీజీపీని కోరుతామన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మకు బెటాలియన్స్ అంటే ఎంతో ఇష్టమని,ఇటీవల జార్ఖండ్‌లో ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించి వచ్చిన టీఎస్ఎస్పీ సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో పోలీసులకు కొత్త వాహనాలను సమకూర్చిం దని, ప్రత్యేక పోలీసుల సంక్షేమంపైనా దృష్టి సారిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు పోలీసు ఉద్యోగం కష్టంతో కూడుకున్నదని, పోలీసు సిబ్బంది ఫిట్నెస్తో ఉంటేనే సరిపోదన్నారు. వారి కుటుంబసభ్యులు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం కుటుంబసభ్యులందరూ కలిసి సమయం దొరికినప్పుడల్లా శారీరక దా రుఢ్యాన్ని, మానసికోల్లాసాన్ని పెంచే వ్యాయామాలు చేయాలని సూచించారు. బెటాలియన్‌లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వ యం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ప్రసిద్ధి పొందిన శిక్షణ సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకున్నామన్నారు. కుటుంబం వెంట రాగా అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు సైకిల్‌పై వచ్చారు. ఆయన ఇద్దరు కుమారులు ప్ర సూన్ త్రివేది, ప్రశాంత్ త్రివేది రెండు సైకిళ్లపై వచ్చారు. భార్య ఉదయ వాహనంలో తరలి వ చ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క మాం డెంట్ ప్రసన్నకుమార్, బీడబ్ల్యుఓ మహేందర్ పాల్గొన్నారు. అనంతరం రాజీవ్‌త్రివేది నగరా నికి బయలుదేరి వెళ్లారు. ఆయనో విలక్షణ అధికారి పోలీస్ శాఖలో ఆయన ఓ విలక్షణమైన అధికారి. అత్యున్నత హోదాలో ఉంటూనే, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండియా శ్రీలంక, భీమిలీ విశాఖపట్నం మధ్య సముద్రాన్ని ఈదారు. ఇండియా, శ్రీలంక మధ్య సముద్రం లో 30 కిలోమీటర్లు 12.31 గంటలలో ఈదటం ఇప్పటికి వర్డల్ రికార్డుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ‘సాక్షి’తో ఆయన అనుభవాలను ఇలా పంచుఉన్నారు. గతంలో అనేకసార్లు, అనేక ప్రదేశాల లో సైకిల్‌పై పర్యటించాను. గతంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు సైకిల్‌పై పర్యటించాను. ఆదివారాలలో ఉదయం సైకిల్‌పై బయలుదేరి మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి చేరుకునేవాడిని. ఇపుడు తొలిసారిగా సైకిల్‌పై హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చాను. తెలంగాణ పోలీసులలో చాలా ప్రతిభ ఉంది. వ్యక్తిగత ప్రతిభను బట్టి మంచి క్రీడా జట్లను రూపొందిస్తాం. దేశం లో ప్రస్తుతానికి తెలంగాణ పోలీస్ బ్యాండ్ రెండవ స్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయం. హాకీ, కబడ్డీ,ఫుట్‌బాల్ టీములు బాగున్నాయి. వాలీబాల్, బాస్కెట్‌బాల్ జట్ల తయారీకి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ బెటాలియన్లకు దేశంలో మంచి గుర్తింపు ఉంది. దీనిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతాం. బెటాలియన్లలో అవి నీతిని సహించేది లేదు. ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకోవ డానికీ వెనుకాడం. భార్య ఉదయ గృహిణి, పెద్ద కుమారుడు ప్రసూ న్ సివిల్ ఇంజీనీర్ ఫైనల్, రెండవ కుమారుడు ప్రశాంత్ సివిల్ ఇంజి నీర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ లాంగ్ సైకిల్ డ్రెవ్, లాంగ్ స్విమ్మింగ్ చేయటం ఇష్టపడుతారు. ఉదయ కూడా చాలా దూరంగా సైకిల్ తొక్కుతారు. -
తెలంగాణలో మరో ఆరు బెటాలియన్లు
ప్రతిపాదనలు పంపామన్న అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు సైకిల్‌యాత్ర డిచ్పల్లి/నిజామాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న తొమ్మిది ప్రత్యేక పోలీస్ బెటాలియన్లకు తోడుగా మరో ఆరు కొత్త బెటాలియన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు. బెటాలియన్లలో రెండువేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి సైకిల్‌యాత్రగా వచ్చారు. ఉదయం 4.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం నిజామాబాద్‌కు చేరుకున్నారు. వారికి నిజామాబాద్‌లో ఎస్పీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్‌త్రివేది విలేకరులతో మాట్లాడుతూ ఐపీఎస్‌ల విభజనలో తనను తెలంగాణకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది బెటాలియన్లకు ఇలాగే సైకిల్‌యాత్ర చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
బియాస్.. జాడేది?
స్కానర్కూ అందని విద్యార్థుల ఆచూకీ ఫలితమివ్వని పదోరోజు సెర్చింగ్ గాలింపు చర్యల్లో తెలంగాణ పోలీస్ బృందం పర్యవేక్షిస్తున్న ఇక్కడి డీజీపీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం చేపట్టిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నావికా దళానికి చెందిన అత్యాధునిక పరికరం సైడ్ స్కాన్ సోనార్‌ను వినియోగిస్తున్నారు. లార్జీ డ్యామ్-పండో డ్యామ్‌ల మధ్య ఉన్న ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ స్పెషల్ పోలీసు అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కార్తికేయ నేతృత్వంలోని 15 మంది తెలంగాణ రాష్ట్ర పోలీసు వాటర్ స్పోర్ట్స్ టీమ్ సిబ్బంది స్థానిక అధికారుల సాయంతో జల్లెడపట్టారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సైతం మంగళవారం అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. లార్జీ డ్యామ్‌కు ఎగువన ఆదివారం భారీ వర్షం కురవడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లార్జీ డ్యామ్ నుంచి దిగువకు వస్తున్న నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిపోవడం, బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆపరేషన్ జరగట్లేదని రాజీవ్ త్రివేది ‘సాక్షి’కి తెలిపారు. - సాక్షి, హైదరాబాద్. -
హిమాచల్‌కు రాజీవ్ త్రివేది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పెషల్ పోలీసు అదనపు డీజీగా ఉన్న ఐపీఎస్ సీనియర్ అధికారి రాజీవ్ త్రివేది గురువారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్ వెళ్తున్నారు. అక్కడి మండి జిల్లాలోని బియాస్ నదిలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఆయన నేరుగా పాలుపంచుకుంటారు. కిలోమీటర్ల మేర సైక్లింగ్, మారథాన్లు, సుదీర్ఘ ఈతలకు త్రివేదీ ప్రసిద్ధి. ఇప్పటికే అనేకసార్లు భారత్-శ్రీలంక మధ్య ఉన్న జలసంధితో పాటు రాజమండ్రి వద్ద గోదావరి నదిలో నిర్విరామంగా ఈదారు. 2012 జనవరిలో ముంబైలో జరిగిన 42 కి.మీ. మారథాన్‌ను 3.20 గంటల్లో పూర్తి చేశారు. రాజీవ్ త్రివేదీ కృష్ణాజిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో కృష్ణా-గుంటూరు సరిహద్దుల్లో ఉన్న ఓ కాల్వలో బస్సు బోల్తాపడిన ఘటనలో స్వయంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 2008లో బలిమెల ఉదంతం జరిగినప్పుడు నేరుగా అక్కడకు వెళ్లి గ్రేహౌండ్స్ సిబ్బంది మృతదేహాల కోసం నదిలో గాలించారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ గల్లంతైన సందర్భంలోనూ త్రివేదీ ల్యాండ్ సెర్చ్ ఆపరేషన్‌కు ఇన్చార్జ్గా వ్యవహరించి కాలినడకన నల్లమలలో కిలోమీటర్లమేర ప్రాంతాన్ని జల్లెడపట్టారు.రాజీవ్ త్రివేది గతంలో నిర్వహించిన రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆయనను హిమాచల్‌ప్రదేశ్ పంపుతోంది. -
రాష్ట్రాలు విడిపోయినా కలసి పనిచేయాలి : డీజీపీ
సిబ్బందికి డీజీపీ ప్రసాదరావు పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది మరికొన్ని రోజుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పని చేయాల్సి ఉంటుందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా సిబ్బంది మాత్రం దూరం కాకుండా కలసిమెలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జోరందుకోవడం, అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలసి డీజీపీ సోమవారం తన కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వేరైనా సిబ్బంది పరస్పర సహకారంతో పని చేస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలు పక్కపక్కనే ఉండనున్న నేపథ్యంలో పరస్పర సహకారం కూడా సముచిత స్థాయిలో ఉండాలన్నారు. ఎవరెక్కడ పని చేస్తున్నా అందరూ పోలీసు శాఖకు చెందిన వారే అన్నది మరువద్దని కోరారు. ఫైళ్ల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. సిబ్బంది సైతం ఫైళ్లు రాసే విధానంలో నూతనత్వాన్ని అలవర్చుకోవడంతో పాటు పాతవాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, చెక్ లిస్ట్ తయారు చేసుకోవడం వంటివి చేసి త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ పని చేయబోయే ప్రస్తుత సిబ్బంది త్వరలోనే పదోన్నతులతోపాటు ఇతర లాభాలు పొందే అవకాశం ఉందని క్రీడల విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది తెలిపారు. డిస్పోజల్ ఫైళ్లను సైతం రాష్ట్రాల వారీగా భద్రపరచాలని అదనపు డీజీ ఉమేష్ షరాఫ్ కోరారు.