హైదరాబాద్ టు నల్లగొండ | Hyderabad to Nalgonda Rajiv Trivedi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ టు నల్లగొండ

Published Tue, Feb 17 2015 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 6:13 PM

హైదరాబాద్  టు నల్లగొండ - Sakshi

హైదరాబాద్ టు నల్లగొండ

 రాష్ట్ర పోలీస్ బెటాలియన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) రాజీవ్ త్రివేది సోమవారం సైకిల్‌పై హైదరాబాద్ నుంచి నల్లగొండకు చేరుకున్నారు.  హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరిన ఆయన 9 గంటలకు బెటాలియన్‌కు చేరుకున్నారు.
 
 నల్లగొండక్రైం: రాష్ట్రానికి నాలుగు పోలీస్ బెటాలియన్లు మంజూరైనట్లు తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) రాజీవ్ త్రివేది తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి స్థానిక అన్నెపర్తి 12వ బెటాలియన్ వరకు సైకిల్‌పై వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 9 బెటాలియన్‌లు ఉన్నాయని అదనంగా మరో నాలుగు బెటాలియన్‌లు మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్‌లోని బెటాలియన్‌ను కూడా సైకిల్‌పై వెళ్లి పరిశీలించినట్లు వివరించారు. పోలీస్ అంటేనే ఫిట్‌నెస్ అని, ప్రతి వ్యక్తి సైకిల్ సులభంగా తొక్కుతాడని వివరించారు. పోలీసులు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. త్రివేదికి ఎస్పీ డాక్టర్ ప్రభాకర్ రావు, బెటాలియన్ కమాండెంట్ బాబూజీరావులు ఘన స్వాగతం పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement