'కోర్టు ఇచ్చిన నోటీసులను తీసుకున్నాం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు అందినట్లు తెలంగాణ హెంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలిపారు. తాము ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ వద్ద ఉన్న వివరాలను భద్రపరుస్తామన్నారు.ఎప్పుడు కోరితే అప్పడు.. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచుతామని రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. ఆ వివరాలు ఏమిటి అనేది బహిర్గతమైనప్పుడే తెలుస్తుందని ఆయన తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ్ చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసులు తెలంగాణ హెం సెక్రటరీ రాజీవ్ త్రివేదికి అందించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఆ నోటీసులను త్రివేది తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సచివాలయంలో సిట్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆ అధికారులు గో బ్యాక్ అంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. రాజీవ్ త్రివేది కార్యాలయానికి చేరుకున్న క్రమంలో తెలంగాణ ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. చాలాసేపు త్రివేది వేరే సమావేశంలో ఉండటంతో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ అధికారులు చాలాసేపు బయట నిరీక్షించారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతూ ఏపీ పోలీసులతో నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు.