
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు రాజీవ్ త్రివేది... సీనియర్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పేట్లబురుజులోని నగర సాయుధ విభాగం కార్యాలయంలో జరగనున్న ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు పరుగు, ఈత, సైక్లింగ్, మారథాన్‌ల ద్వారా సుదూరాలను చేరుకుని రికార్డులు నెలకొల్పిన ఆయన.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనిలో పాల్గొనేందుకు నేటి ఉదయం 6 గంటలకు జూబ్లీహిల్స్ పరిధిలోని ప్లజెంట్ వ్యాలీలో తన క్వార్టర్స్ నుంచి బయలుదేరతారు.
మొత్తం 16 కిలోమీటర్ల దూరాన్ని తన పరిగెడుతూ రానున్నారు. రోజూ ఉదయం రన్నింగ్ చేసే అలవాటున్న ఆయన బుధవారం నాటి రన్నింగ్‌ను ఇలా పూర్తి చేయనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, మదీనా చౌరస్తా మీదుగా ఆయన పరుగు సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment