తాత్కాలిక డీజీపీగా సుదీప్ | telangana incharge dgp sudeep lakhtakia | Sakshi
Sakshi News home page

తాత్కాలిక డీజీపీగా సుదీప్

Published Tue, May 17 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

telangana incharge dgp sudeep lakhtakia

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులను అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ బాధ్యతలను తాత్కాలికంగా సుదీప్ లక్టాకియాకు అప్పగించనున్నారు. అలాగే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది బాధ్యతలను అధర్ సిన్హాకు అప్పగిస్తారు.

శివశంకర్కు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బాధ్యతలను అప్పగిస్తారు. జితేందర్కు సీటి పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి బాధ్యతలు  అప్పగిస్తారు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థపై అధ్యయనానికి యూఎస్, యూకేలో పర్యటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement