25 శాతం అదనపు అలవెన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. ఇంటెలిజెన్స్‌లో పనిచేసే పోలీసులు, నేర విచారణ విభాగం (సీఐడీ)లో పనిచేసే సిబ్బందికి మూలవేతనంతో పాటు 25 శాతం అదనపు అలవెన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఎస్‌ఐబీలో పనిచేసే వారికి 50 శాతం అదనపు అలవెన్స్, సీఎస్‌ఎల్, అక్టోపస్‌లలో పనిచేసే వారికి 60 శాతం, ఏసీబీలో పనిచేసే వారికి 30 శాతం అదనపు అలవెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి ఇంటెలిజెన్స్, సీఐడీలలో పనిచేసే వారికీ అదనపు అలవెన్స్ లభించనుంది.