కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.
సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను అందించింది.
చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment