సైకిల్‌ కోసం తమ్ముడితో గొడవపడి.. | A boy disapper after fight with his brother for bicycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌ కోసం తమ్ముడితో గొడవపడి..

Published Thu, Jul 6 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

సైకిల్‌ కోసం ఇంట్లో తమ్ముడితో గొడవపడిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బంజారాహిల్స్‌: సైకిల్‌ కోసం ఇంట్లో తమ్ముడితో గొడవపడిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని దుర్గా ఎన్‌క్లేవ్‌కు చెందిన అశోక్‌దాస్‌ స్థానిక సెయింట్‌ అగస్టీన్‌ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు.

కొద్ది రోజులుగా తన సోదరుడు అభినాకాంత్‌తో సైకిల్‌ విషయమై గొడవపడుతున్నాడు. తల్లిదండ్రులు తమ్ముడికే మద్దతు ఇస్తున్నారంటూ అలిగి బుధవారం ఉదయం చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో తండ్రి ఆనంద్‌ కిషోర్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8106216163 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement