disapper
-
కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం
కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హమ్ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్‌కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. అయితే గేమ్స్ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది. -
మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం ఫోటో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ చాట్‌లో మీరు అనుకుంటే మెసేజ్‌లు కన్పించకుండా చేయవచ్చును. ఔను మీరు విన్నది నిజమే..! వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లను నిర్ధిష్ట చాట్‌లో కన్పించకుండా ఆయా సందేశాల కాలాన్ని మీరు నిర్ణయించవచ్చును. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) వాట్సాప్ తన డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ కోసం కొత్త ఆప్షన్ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లో భాగంగా 90 రోజుల తర్వాత ఒక నిర్దిష్ట చాట్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. అంతేకాకుండా 24 గంటల్లో మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా కనుమరుగయ్యే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టగా ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు పంపిన మెసేజ్‌లు ఏడు రోజుల వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మెసేజ్‌లను అదృశ్యమయ్యేలా చేయడానికి వాట్సాప్ యాప్ వీలు కల్సిస్తుంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం బీటా వెర్షన్ 2.21.17.16 ద్వారా 90 రోజుల తర్వాత చాట్‌లో మెసేజ్‌లు కన్పించకుండా ఉండే ఫీచర్‌ను WABetaInfo స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. 90 డేస్‌తో పాటు 24గంటల్లో వాట్సాప్‌లో మెసేజ్‌లు కన్పించకుండా చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను గత కొన్ని నెలలుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్లో ఒక చిన్న మెలిక ఉంది. వాట్సాప్ యూజర్ ఇతర రెసిపెంట్లకు పంపిన మెసేజ్‌లకు డిస్ఆప్పియర్ ఫీచర్‌తో మెసేజ్‌లు పంపినా...,రెసిపెంట్ ఆయా మెసేజ్‌ను వేరే ఇతర వాట్సాప్ యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే మాత్రం యూజర్ పంపిన మెసేజ్ ఎప్పటికి రెసిపెంట్తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్తగా వ్యూ వన్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!
మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్ హాలీడే స్పాట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్ లవ్ కపుల్స్‌కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్ ట్రిప్ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్ అయ్యి వస్తారు. అయితే మాల్దీవ్స్ లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం 40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్బర్గ్ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిజీ కూడా ముప్పు అందమైన బీచ్‌లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది. ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్ -
సైకిల్ కోసం తమ్ముడితో గొడవపడి..
బంజారాహిల్స్: సైకిల్ కోసం ఇంట్లో తమ్ముడితో గొడవపడిన ఓ బాలుడు అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని దుర్గా ఎన్‌క్లేవ్‌కు చెందిన అశోక్‌దాస్ స్థానిక సెయింట్ అగస్టీన్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తన సోదరుడు అభినాకాంత్తో సైకిల్ విషయమై గొడవపడుతున్నాడు. తల్లిదండ్రులు తమ్ముడికే మద్దతు ఇస్తున్నారంటూ అలిగి బుధవారం ఉదయం చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో తండ్రి ఆనంద్ కిషోర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8106216163 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
మామిడికాయల రేవులో యువకుడి గల్లంతు
త్యాజంపూడి(దేవరపల్లి) : దేవరపల్లి మండలం త్యాజంపూడిలోని మామిడికాయలరేవులో ఓ యువకుడు గురువారం గల్లంతయ్యాడు. యువకుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిటికిన కృష్ణ(25) గురువారం ఉదయం పశువులకు గడ్డికోసం రేవు దాటి పొలానికి వెళ్లాడు. గడ్డిమోపుతో తిరిగి ఇంటికి రావడానికి రేవు దాటుతుండగా.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ సమయంలో రేవు వద్ద ఉన్న కొంత మంది కృష్ణను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న తమసీల్దార్ ఎం.అక్బర్‌హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది, ఎస్సై సి.హెచ్.ఆంజనేయులు రేవు వద్దకు చేరుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరకలేదు. చీకటì æపడడంతో గాలింపు నిలిపివేశారు. నిడదవోలు నుంచి సాయంత్రం అగ్నిమాపక సిబ్బంది రేవు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సిబ్బంది రేవులోకి దిగలేదు. రేవు వద్ద పోలీస్, రెవన్యూ సిబ్బందిని రాత్రికి గస్తీకి నియమించినట్టు తహసీల్దార్ ఎం.అక్బర్‌హుస్సేన్ తెలిపారు. శుక్రవారం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని వివరించారు. కృష్ణ మంగళవారం భవానీమాల వేసుకున్నాడు, కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణ గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.