మామిడికాయల రేవులో యువకుడి గల్లంతు
Published Fri, Sep 30 2016 1:36 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
త్యాజంపూడి(దేవరపల్లి) : దేవరపల్లి మండలం త్యాజంపూడిలోని మామిడికాయలరేవులో ఓ యువకుడు గురువారం గల్లంతయ్యాడు. యువకుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిటికిన కృష్ణ(25) గురువారం ఉదయం పశువులకు గడ్డికోసం రేవు దాటి పొలానికి వెళ్లాడు. గడ్డిమోపుతో తిరిగి ఇంటికి రావడానికి రేవు దాటుతుండగా.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ సమయంలో రేవు వద్ద ఉన్న కొంత మంది కృష్ణను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న తమసీల్దార్ ఎం.అక్బర్‌హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది, ఎస్సై సి.హెచ్.ఆంజనేయులు రేవు వద్దకు చేరుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరకలేదు. చీకటì æపడడంతో గాలింపు నిలిపివేశారు. నిడదవోలు నుంచి సాయంత్రం అగ్నిమాపక సిబ్బంది రేవు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సిబ్బంది రేవులోకి దిగలేదు. రేవు వద్ద పోలీస్, రెవన్యూ సిబ్బందిని రాత్రికి గస్తీకి నియమించినట్టు తహసీల్దార్ ఎం.అక్బర్‌హుస్సేన్ తెలిపారు. శుక్రవారం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని వివరించారు. కృష్ణ మంగళవారం భవానీమాల వేసుకున్నాడు, కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణ గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement