మంచి నీరనుకుని.. | Mill Worker Died While Drinking Acid | Sakshi

మంచి నీరనుకుని..

Published Tue, Mar 20 2018 11:17 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

Mill Worker Died While Drinking Acid - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

ఇంకొల్లు: స్థానిక ఓ ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ వి.రాంబాబు కథనం ప్రకారం.. చినగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన నల్లమల శ్యాంసన్‌ (58) స్థానిక స్పిన్నింగ్‌ మిల్లులో కొంతకాలంగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మిల్లుకు వచ్చిన శ్యాంసన్‌ అన్నం తినే సమయంలో మంచినీరనుకుని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ తాగాడు. బాధితుడిని వెంటనే స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శ్యాంసన్‌ మృతి చెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement