వరంగల్: అపరిచిత వ్యక్తిని పనిలో పెట్టుకుంటే చివరికి గోదాంనే లూఠీ చేశాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరిమళ కాలనీలో జరిగింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన చక్రవర్తి హనుమకొండ టైలర్ స్ట్రీట్‌లో ఓ గార్మెంట్ (బట్టల)షాపు నిర్వహిస్తున్నాడు. అందుకు సంబంధించిన గోదాం పరిమళ కాలనీలో ఉంది. బట్టల షాపులో పనిచేయడానికి ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపల్లి గూడేనికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని పనిలో కుదుర్చుకున్నాడు. రోజూ ఉదయం షాపుకు వెళ్లి రాత్రి గోదాం ముందు రూంలో వచ్చి నిద్రించేవాడు.
రోజు మాదిరిగా సుబ్రహ్మణ్యాన్ని యజమాని రాత్రి గోదాం వద్ద వదిలి పెట్టాడు. శుక్రవారం ఉదయం గోదాం వద్దకు వచ్చిచూసే సరికి పని మనిషి కనిపించలేదు. ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్. గోదాంలో సుమారు రూ.2.50లక్షల స్టాక్ మాయమైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment