Sandals
-
దొంగల పరువుతీసిన చీప్ దొంగ
-
స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు వేలం: రికార్డు ధర
న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్ కంపెనీ ఆదివారం నిర్వహించిన వేలంలో స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండల్స్ అత్యధిక ధరను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు) ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) 1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్‌కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్‌స్టాక్ సాండిల్స్ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్ పేర్కొంది. వేలంలో వీటికి 60 వేల డాలర్ల ధర వస్తుందని భావించారు. ఈ సాండల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధర 2,18.750 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల డాలర్లు వచ్చాయి. అయితే ఈ సాండల్స్‌ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్లడించ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ కలిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్ యాపిల్ ఉత్పత్తులతో ఆధునిక టెక్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్ జాబ్స్ క్యాన్సర్‌తో 2011లో కన్నుమూశారు. ఇదీ చదవండి: ElonMusk బ్లూటిక్ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్ -
అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన పాత, అరిగిపోయిన చెప్పులు ఆన్లైన్లో వేలానికి ఉంచారు. 1970, 80ల కాలంలో ఆయన వేసుకున్న బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్ నిర్వాహకుడు వెల్లడించారు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! ఈ వేలం నవంబర్ 11న మొదలు కాగా, నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్‌స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది. బిడ్ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్ఎఫ్టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్"ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్" ను కూడా దక్కించుకోవచ్చు. (క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!) ఆయనకి ప్రత్యేకంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు, సాధారణంగా ఉంటూనే, అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టేవారని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ మాజీ భార్య క్రిస్సన్ బ్రెన్నాన్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ వార్డ్రోబ్ లో చెప్పులు కూడా ఉండేవి. అవి ఆయన యూనిఫాంలో భాగం. ఒక బిజినెస్ మేన్‌గా స్పెషల్‌గా కంటే కూడా సింపుల్ డిజైన్, చెప్పులు కంఫర్ట్‌గా ఉన్నాయో లేదో మాత్రమే ఆలోచించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. యాపిల్ చరిత్రలో అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట. మరోవైపు ఈ సాండిల్స్‌ను ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ హెడ్‌క్వార్టర్స్, న్యూయార్క్‌లోని సోహోలో, జర్మనీలోని కొలోన్‌లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో వీటిని ఉంచారు. అలాగే 2018లో Die Zeit మ్యాగజైన్ కోసం Zeit ఈవెంట్ బెర్లిన్,ఇటీవల, జర్మనీ స్టట్‌గార్ట్‌లోని ది హిస్టరీ మ్యూజియం వుర్టెంబర్గ్‌లో ఉంచడం విశేషం. (హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్) కాగా ఫాదర్ ఆఫ్ డిజిటల్ రివల్యూషన్, స్టీవ్‌జాబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1976లో యాపిల్ సంస్థను నెలకొల్పి కోట్లాదిమంది అభిమానులతో యాపిల్ మ్యాక్స్, ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచెస్..ఇలా యాపిల్ అనే బ్రాండ్‌ను విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. అందుకే రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్ టెక్ లీడర్‌గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకం. గతంలో చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేసిన స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు సుమారు రూ.1.6 కోట్లకు విక్రయించబడింది. ఇదే ఉద్యోగ దరఖాస్తు 2018 ఏడాది నిర్వహించిన ఆక్షన్‌లో సుమారు రూ.1.2 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. -
Fashion: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్!
చూపులను ఇట్టే చుట్టేసుకునే పాదరక్షల్లో బోలెడన్ని డిజైన్లు ఇప్పుడు మన మదిని పట్టేస్తున్నాయి. పాము కుబుసంలాంటి స్ట్రాప్స్‌తో పువ్వులు, సీతాకోకచిలుకలు అల్లుకునే తీరుతో లెదర్, ఫైబర్, ఫ్యాబ్రిక్ మెటీరియల్ లెక్కింపు లేకుండా క్రిస్టల్స్, స్వరోస్కి, కుందన్స్, మువ్వలు.. పాదం నుంచి మోకాలి వరకు డ్రెస్ డిజైన్‌ను మరింత పెంచేలా నడకలో రాజసం కదిలేలా పార్టీవేర్ ఫుట్‌వేర్ కొత్తగా మెరిసిపోతుంది. నడకలోనే కాదు కాలికి ధరించే పాదరక్షల్లోనూ అందం ఉండాలనుకుంటారు. స్టైలిష్‌గా కనిపించడంతో పాటు నడక కూడా అంతే దీటుగా ఉండాలనుకునేవారికి సరైన సమాధానంలా ఉంటున్నాయి ఈ ఈవెనింగ్ శాండల్స్. స్ప్రింగ్‌లా ఉండే స్ట్రాప్స్ కాలిని చుట్టుకుపోతూ, చివరి భాగం పాము తలను పోలిన డిజైన్‌తో ఉంటుంది. ఈవెనింగ్ శాండల్స్ అని పేరున్న ఇవి పార్టీవేర్‌గా వెలిగిపోతున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ లేదా జీన్స్ ధరించినప్పుడు ప్లెయిన్ స్పైరల్ స్ట్రాప్స్ శాండల్స్ క్యాజువల్ వేర్‌గా నప్పుతాయి. రిసెప్షన్ వంటి సాయంకాలపు వేడుకలలో ధరించే డ్రెస్సులకు షాండ్లియర్ రోప్ స్ట్రాప్ ఫుట్‌వేర్ స్టైలిష్ లుక్‌ని పెంచుతుంది. వీటిలో స్టోన్స్‌తో తీర్చిన పువ్వులు, లతలు ఉన్న డిజైన్స్‌ని ఎంచుకోవచ్చు. చదవండి: Fashion: ఈ హీరోయిన్ ధరించిన చీర ధరెంతో తెలుసా? Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు! -
టో బాలెట్ ఫ్లాట్స్ .. ప్లాస్టిక్ శాండల్స్.. వానాకాలంలో ఏ చెప్పులు బెస్ట్!
పాదాలకు అనువుగా ఉండాలి. పారుతున్న నీళ్లలో జారకుండా ఉండాలి. తడిసినా పాడవకుండా ఉండాలి. పాదాలకు వేసే చెప్పులే అయినా కాలానుగుణంగా ఉండాలి. ఎటు తిరిగినా అందంగానూ ఉండాలి. ఆ ఎంపిక ఎప్పుడూ బెస్ట్ అనిపించాలి. వర్షాకాలంలో రెయిన్కోట్లు, గొడుగు ఎంత ముఖ్యమో ఈ కాలం వేసుకోదగిన చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఏవి ఈ సీజన్‌కి సరైనవో ఎంపిక చేసుకోవడం మరీ ముఖ్యం. రబ్బర్ షూస్, పీవీసీ షూస్ ఈ కాలానికి అనువుగానే కాదు ఫ్యాషనబుల్‌గా పర్ఫెక్ట్గా అమరుతున్నాయి. వాటిలో .. ఫ్లిప్ ఫ్లాప్స్, స్లిప్–ఆన్ క్రాస్లైట్ శాండల్స్ వర్షాకాలానికి అనువైనవి. స్లిప్–ఆన్‌లో హీల్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈ సీజన్లో స్టైలిష్ కన్నా సౌకర్యవంతంగా అమరేవే చూడాలి. పాదాలను పట్టినట్టుగా ఉంటూనే వదలడానికి అనువుగా, ప్లాట్ నమూనాతో ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. టో బాలెట్ ఫ్లాట్స్ కాలి మునివేళ్లను దగ్గరగా ఉంచుతూ పాదాలను రక్షణ కలిగిస్తాయి. రంధ్రాలు ఉండే ఈ ఫ్లాట్స్ స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇండియన్, వెస్ట్రన్.. ఏ స్టైల్ దుస్తులకైనా బాగా నప్పుతాయి. కాలేజీ, ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్.. అన్నివేళలా ధరించడానికి అనువైనవి. బురద అంటినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. రబ్బరు లేదా ప్లాస్టిక్ శాండల్స్ లెదర్ వాటిలా కనిపించే షూస్, శాండల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇవి రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి. హై టాప్ రెయిన్ షూస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, ట్రావెలర్స్‌కు సూట్ అవుతాయి. స్ట్రాప్ శాండల్స్ పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పలు, ఫ్లిప్–ఫ్లాప్స్ జారిపోతాయి అనుకునేవారు స్ట్రాప్ ఉన్న శాండల్స్ లేదా స్ట్రాప్ చెప్పులు ఎంచుకోవచ్చు. బాలెరినా షూస్ రబ్బరు లేదా లైక్రా బాలెరినా బూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పాదాలను బురద నుంచి కాపాడతాయి. హీల్స్ లేనివే ఎంపిక నీళ్లు, బురదతో నిండిన రోడ్ల మీద నడిచేటప్పుడు జారకుండా ఉండాలంటే పట్టీలు ఉన్నప్పటికీ హీల్స్‌ని మాత్రం ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. పేస్టెల్, నియాన్ షేడ్స్ గల శాండల్స్ ఈ సీజన్‌కి మరింత అందాన్ని తీసుకువస్తాయి. చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? -
నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్ ఛైర్మన్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. • 1985లో 20 ఏళ్ళ వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీతో వివాహం • ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు • ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు • నీతా అంబానీకి లగ్జరీ కార్లంటే మోజు • ఆడి ఏ9 కమేలియన్ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ • ఈ ప్రత్యేక ఎడిషన్ కారు ఖరీదు సుమారు 100 కోట్ల రూపాయలు • ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ. 24 లక్షలు. • నీతా అంబానీ కార్ల లిస్ట్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. • నీతా అంబానీ డిజైన్స్ , స్టైల్స్ విషయంలో చాలా అప్డేట్గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వేసింది మళ్లీ వేసేదే లే.. సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన చెప్పులు, షూ కలెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్ తదితర విలాసవంతమైన బ్రాండ్లను ఆమె వాడతారు. రూ.40 లక్షల చీర నీతా అంబానీ సారీ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్ డైమండ్స్, రూబీ, పుఖ్రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్ రోబ్‌లో కొలువు దీరాయి. కళ్లు చెదిరే లిప్‌స్టిక్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్‌స్టిక్‌లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్‌ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్ ప్యాకేజ్లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట. కార్పొరేట్ జెట్ 2007లో, ముఖేశ్ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్ జెట్‌ను పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు. కస్టమ్-ఫిట్ చేసిన ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్లు, వైర్లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్రూమ్, విలాస వంతమైన బాత్రూమ్లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు. కోట్ల విలువచేసే జపనీస్ టీ సెట్ పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్‌లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్ టీ సెట్ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు. లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాషన్ ఐకాన్‌గా డేన్సర్గా, డిజైనర్‌గా ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్ నుండి ఫ్యామిలీ ఈవెంట్ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్ బ్రాండ్ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ ఫిట్‌గా ఉండేందుకు డైట్, వర్క్అవుట్స్ కఠినమైన డైట్ ప్లాన్ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్ వైట్ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు. రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అంతేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్ సెషన్‌ను అస్సలు మిస్ కారు. స్విమ్మింగ్, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు. తనను తాను హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్‌తోపాటు, బీట్రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్‌గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్రూట్ జ్యూస్ శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ అయిన నీతా అడ్మిషన్ సీజన్లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడాకారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష
అహ్మదాబాద్: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్‌లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ హైకోర్టులో చోటుచేసుకుంది.వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన బావాజీ అనే వ్యక్తి భయావదర్ మున్సిపాలిటీలో పరిధిలో రోడ్డుపై టీస్టాల్ నడుపుకునేవాడు. అయితే 2012లో రోడ్డు విస్తరణలో భాగంగా బావాజీని టీస్టాల్‌ను తీసేయాలంటూ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై బావాజీ గోండల్ సెషన్స్ కోర్టు నుంచి టీస్టాల్ పడగొట్టకుండా స్టే ఆర్డర్‌ను తెచ్చుకున్నాడు. దీంతో భయావదర్ మున్సిపాలిటీ అధికారులు బావాజీ స్టే ఆర్డర్‌పై అహ్మదాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసింది. కాగా హైకోర్టు బావాజీ స్టే ఆర్డర్‌ను రద్దు చేసి అతని టీస్టాల్‌ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బావాజీ టీ స్టాల్‌ను తొలగించారు. తనకు ఆదాయం వచ్చేదానిని కోల్పోయిన అతను మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి తనకు న్యాయం జరగాలంటూ తెలిసినవారి నుంచి అప్పులు తీసుకుంటూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా మరోసారి కోర్టుకు వచ్చిన బావాజీ.. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తన కేసును హియరింగ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డి స్థానంలో ఉన్న మిర్జాపూర్ గ్రామీణ కోర్టు చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ వి.ఏ ధాదళ్పై చెప్పులు విసిరాడు. ఈ పరిణామాన్ని ఊహించని జడ్డి షాక్‌కు గురయ్యాడు.. కానీ అదృష్టవశాత్తు ఆ చెప్పులు ఆయనకు తగల్లేదు. అక్కడే ఉన్న పోలీసులు బావాజీని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షా స్మృతి కింద సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడికి దిగినందుకుగాను అతనికి 18 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఇది సాధారణ శిక్ష మాత్రమే అని.. శిక్షాకాలంలో సత్ఫప్రవర్తనతో మెలిగితే విడుదల చేసే నిబంధన అతనికి వర్తింస్తుందని తీర్పునిచ్చారు. కాగా ప్రస్తుతం బావాజీని సోలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ చేశాడట..! -
ఒడిశా అసెంబ్లీలో స్పీకర్ పైకి చెప్పులు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ శనివారం రణరంగంగా మారింది. చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని స్పీకర్ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్లను విసిరారు. దాంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను, షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, మైనింగ్ కార్యకలాపాల్లో అవినీతిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో జత కలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియం వైపు విసిరారు. చివరకు స్లిప్పర్లను కూడా విసిరారు. అవి స్పీకర్ పోడియం దగ్గరలో పడ్డాయి. గందరగోళం నెలకొని, సభ అదుపు తప్పిన పరిస్థితులో స్పీకర్ పాత్రో సభను వాయిదా వేశారు. లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన తరువాత, అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం, వారు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్ పేర్కొన్నారు. -
ఒక్క మాత్రతో వారం మందులు!
పూటపూటకూ మాత్రలు మింగాలంటే ఎవరికైనా చిరాకే. అందుకే చాలామంది మాత్రలేసుకోవడం మరచిపోతూంటారు కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మాత్రను సిద్ధం చేశారు. వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలు. ఈ క్యాప్సూల్‌లోని ఆరు అరలు రోజుకొకటి చొప్పున విచ్చుకుని అవసరమైన మందులు అందిస్తాయి. ఈ మాత్రలపై జరిగిన క్లినికల్ పరీక్షలు కూడా విజయవంతం కావడంతో త్వరలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయని అంచనా. నక్షత్రపు ఆకారంలో ఉండే అరలు.. వాటిలో మందులు.. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒక అర విచ్చుకుని మందులు విడుదల కావడం.. ఖాళీ అరలు సహజసిద్ధంగా నాశనం కావడం. ఇదీ స్థూలంగా ఈ క్యాప్సూల్ పని చేసే తీరు. రెండేళ్ల క్రితమే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ క్యాప్సూల్‌ను పందులకు మలేరియా మందుల రూపంలో అందించడం ద్వారా పరీక్షించారు. తాజాగా ఎనిమిది మంది మనుషులకు అటై్జమర్స్ వ్యాధికి ఇచ్చే మందు 50 మిల్లీగ్రాములను అందించారు. వారం తరువాత జరిపిన పరీక్షల్లో మందు శరీరంలోకి శోషించుకోబడిందని, అవసరమైన మేరకు మందు విడుదలైందని స్పష్టమైంది. ఆక్సిజన్ అందించే చెప్పులు మధుమేహుల కాలి అల్సర్లను వేగంగా మానేలా చేసేందుకు పర్డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆయుధాన్ని అందుబాటులోకి తెచ్చారు. అల్సర్ ఉన్న ప్రాంతానికి నేరుగా ఆక్సిజన్‌ను అందించే చెప్పుల అడుగుభాగం (సోల్) ను వీరు తయారుచేశారు. పాలిడైమిథైల్సైలోక్సేన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ రెండు పొరల సోల్.. అడుగు పొరలో ఆక్సిజన్ అర ఉంటుంది. పై పొరను ఆక్సిజన్‌ను మాత్రమే ప్రసారం చేసేలా లేజర్ కిరణాల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ సోల్‌తో కూడిన కాలిజోళ్లు వేసుకుని నడిచినప్పుడు కింది పొరపై ఒత్తిడి కారణంగా అరలోని ఆక్సిజన్ విడుదల, అల్సర్ ఉన్న ప్రాంతాన్ని నేరుగా తాకుతుంది. దీనివల్ల గాయం వేగంగా మానేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాడే హైపర్బేరిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్లో రోగి కదలికల్లేకుండా ఒకచోట కూర్చోవాల్సి వస్తే.. తాజా ఆవిష్కరణతో రోజువారి పనులు సులువుగా చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిని రోగి కాలి ఆకారం, సైజులకు అనుగుణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చు. కేన్సర్ నిర్ధారణకు కొత్త రక్తపరీక్ష కేన్సర్ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ కూడా సమస్యలతో కూడుకుంది. కణితి భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం, పరీక్షించడం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో కేవలం రక్త పరీక్షలతోనే కేన్సర్‌ను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ప్రిన్సెస్ మార్గరెట్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న లిక్విడ్ బయాప్సీ పద్ధతులకు ఎపిజెనిటిక్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను జోడించి అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతి కేన్సర్‌ను గుర్తించడం తో పాటు ఏ దశలో ఉన్నది కూడా తెలియజేస్తుంది. కేన్సర్ తాలూకు లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ కార్వాలో తెలిపారు. ప్రస్తుత పద్ధతులు, జన్యు క్రమంలో వచ్చిన మార్పులు.. డీఎన్ఏ ముక్కల ఆధారంగా నిర్ధారణ జరుగుతూంటే, కొత్త పద్ధతిలో ఎపిజెనిటిక్స్ ఆధారంగా జరుగుతోంది. ఒక్కో రకమైన కేన్సర్‌కు ఈ మార్పులు వేర్వేరుగా ఉంటాయని, తగు స్థాయిలో ఉన్న ఈ మార్పులను మెషీన్ లెర్నింగ్ ద్వారా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత అని వివరించారు. -
చెప్పు కట్టు
సిల్క్ దారాలతో గాజులను చుట్టి అందంగా అలంకరించడం తెలిసిందే కదా! అలాగే పాత శాండల్స్ని, చెప్పులను ముఖ్యంగా స్లిప్పర్స్‌ని కొత్తగా మార్చేయవచ్చు. వేసవి కాలం పాదాలకు చెమట, రబ్బర్ మూలంగా దురద వంటి సమస్యల నుంచి కూడా ఈ పద్ధతి వల్ల తప్పించుకోవచ్చు. అంతెందుకు ఇంటికి మాత్రమే పరిమితమైన స్లిప్పర్స్‌ని ఇలా దారాలతో చుట్టేసి బయటకు కూడా వేసుకెళ్లవచ్చు. కావల్సినవి ∙రబ్బర్ శాండల్స్ స్వెటర్ అల్లికకు ఉపయోగించే రంగు రంగు నూలు దారాలు గ్లూ (చివర్లను అతికించడానికి) ఇలా మొదలెట్టాలి.. శాండల్స్ (0 ఫొటో) స్టెప్ 1: నచ్చిన రంగు దారాన్ని తీసుకోవాలి. స్టెప్ 2: చెప్పుల స్ట్రాప్ పైన, కింది భాగాల్లో గ్లూని పూయాలి. (కొద్ది కొద్దిగా గ్లూ వాడుతూ, దారాన్ని ఉపయోగించాలి) స్టెప్ 3: దారాన్ని ముందుగా స్ట్రాప్ కిందిభాగంలో అతికిస్తూ పైనుంచి తీయాలి. గ్లూ ని ఉపయోగిస్తూ దారాన్ని స్ట్రాప్ చుట్టూ తిప్పుతూ సెట్ చేయాలి. ఎంపిక చేసుకున్న మరో రంగు దారంతో ఇలాగే చుట్టాలి. రెండో వైపు స్ట్రాప్‌ని కూడా పై విధంగా చుట్టి, గ్లూతో చివరలను అతికించాలి. దారాలన్నీ సెట్ అయ్యాయా లేదా సరిచూసుకోవాలి. స్లిప్పర్ స్ట్రాప్స్, బ్యాగ్ హ్యాండిల్స్‌ని ఇలా రంగు రంగు నూలు దారాలతో చుట్టేసి కొత్తగా మార్చేయవచ్చు. వేసవికి సౌకర్యంతో పాటు స్టైల్‌గానూ ఉంటాయి. ప్లాస్టిక్ పువ్వులను కుట్టి మరింత అందాన్ని తీసుకురావచ్చు. -
ఈ చెప్పులకు కాళ్లున్నాయి!
డ్రైవర్లు లేకుండా నడిచే కార్ల గురించి విన్నాం. లారీలూ వచ్చేస్తున్నాయి. విమానాలనూ ఇలాగే నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చెప్పుల మాటేంటి? నో ప్రాబ్లెమ్ వాటినీ మనిషి లేకుండానే నడిపించేస్తాం అంటున్నది అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్. అనగా మనిషి లేకపోయినా ఈ చెప్పులు నడుస్తాయన్నమాట. కార్లలో వాడే హైటెక్ ప్రో పైలెట్ టెక్నాలజీని ఈ చెప్పుల్లో వాడటం వల్ల అవి మనిషి లేకపోయినా చెప్పినట్టుగా నడిచి ఒక మూల చేరుకుంటాయి. మనిషి లేకపోయినా ఎలాగైతే పార్కింగ్ స్థలాల్లో కార్లు చక్కగా వాటంతట అవే ఎలా పార్క్ అవుతాయో అలాగే ఈ చెప్పులు కూడా బుద్ధిగా కొలువు తీరుతాయి. సాధారణంగా మీటింగుల సమయాల్లో, ప్రార్థనా స్థలాల బయట చెప్పులు చిందరవందరగా పడి ఉండటం ఆనవాయితీ. ఈ టెక్నాలజీని వాడిన చెప్పులు ఉంటే ఆ చిందరవందర ఉండదు. అవి వరుసగా ఒక పద్ధతిలో సర్దుకుంటాయన్న మాట. చెప్పులకే కాదు గదుల్లో వాడే చిన్న చిన్న వస్తువులకు కూడా ఈ టెక్నాలజీని జోడించడం ద్వారా గదులను సర్దడం చాలా సులువైపోతుందని చెబుతోంది నిస్సాన్ సంస్థ. ర్యోకాన్ అనే సంప్రదాయ జపనీస్ లాడ్జీల్లో ఈ హైటెక్ చెప్పులను ఇప్పటికే వాడేస్తున్నారు. చిన్న చిన్న బల్లలు, వాటి చుట్టూ కూర్చునేందుకు కుషన్లతో ఉండే ఈ రెస్టారెంట్లో అతిథులు భోజనం చేస్తూండగానే బయట వదిలేసిన చెప్పులు జతలవారీగా ఒక పద్ధతి ప్రకారం అమరిపోతూంటాయి. భోజనం ముగించుకుని అతిథులు బయటికి రావడం ఆలస్యం.. కుషన్లు, ఇతర పరికరాలు కూడా తమ తమ స్థానాల్లో పొందికగా అమరిపోతాయి. -
నిన్ను నువ్వు పట్టించుకో
ఒక గ్రామంలో చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడు. ఆయన్ని ‘పాదరక్షకుడు’ అందాం. ఆ గ్రామం మొత్తానికి ఆయనే పాదరక్షకుడు. చెప్పులు మరమ్మతు చేయించుకోడానికి, కొత్త చెప్పులు చేయించుకోడానికి ఊరివాళ్లంతా ఆయన దగ్గరికే వస్తారు కాబట్టి ఎప్పుడూ తీరిక లేకుండా పని చేస్తుండేవాడు. ఓసారి ఆయన చెప్పులే పాడైపోయాయి. తన చెప్పులు బాగు చేసుకునే ఆ కొద్ది సమయంలో బయటి వారి చెప్పుల్ని బాగు చేయొచ్చు కదా అని, తన చెప్పుల గురించి ఆలోచించడం మానేశాడు. చివరికి అవి శిథిల దశకు వచ్చాయి. పాదరక్షకుడి పాదంలో ఆనెలు వచ్చాయి. ఆ నొప్పిని భరించలేకపోయినా అలానే నడిచేవాడు కానీ, తన చెప్పుల గురించి పట్టించుకునేవాడు కాదు. వాళ్లూ వీళ్లూ చూసి, ‘అదేం పనయ్యా! నీ గురించి నువ్వు శ్రద్ధ వహించాలి కదా’ అనేవారు. అయినా ఆయన పట్టించుకోలేదు. చివరికి పాదం నొప్పి ఎక్కువై, పరిస్థితి ప్రాణాంతకమై మంచాన పడ్డాడు. దాంతో ఆ గ్రామంలో చెప్పులు కుట్టేవాళ్లే లేకుండా పోయారు. పర్యవసానంగా గ్రామస్థులు కూడా చాలాకాలం ఇబ్బందులు పడ్డారు. మొత్తం ఊరే నడవలేనట్లుగా అయిపోయింది! మనం ఏదైనా బాధ్యతాయుతమైన పనిలో ఉన్నప్పుడు, మధ్యమధ్య మనల్ని కూడా పట్టించుకుంటుండాలి. నాయకులు, సామాజిక కార్యకర్తలు, టీచర్లు, ఇంటిపెద్ద, గృహిణి.. వీళ్లంతా తమ ఆరోగ్యం గురించి, తమ క్షేమం గురించి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే కుటుంబాలు, సమాజం సజావుగా ఉంటాయి. (గమనిక : నిన్నటి ‘చెట్టు నీడ’లో ‘జీవితం సంతోషాల పూదోట’ అని వచ్చిన సందేశం పోప్ ఫ్రాన్సిస్ పేరిట సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ప్రసంగ భాగం అని పాఠకులు గమనించగలరు) -
చెప్పు వెనుక చరిత్ర.. ‘చెప్పు’కుందామా!
నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా.. మీ రుణం తీర్చుకోలేం బాబుగారూ ఈ డైలాగు మనం చాలా సినిమాల్లో విన్నాం.. అయితే.. ఎప్పుడైనా చూశారా? చర్మం వలిచి చెప్పులు కుట్టించడాన్ని!! ఓసారి పక్కనున్న షూపైన లుక్కేసుకోండి.. పై ప్రశ్నకు సమాధానం ఈ ఫొటోనే .. ఎందుకంటే.. ఇది చర్మం వలిచి కుట్టించిన చెప్పే!! అసలు ఇది సాధ్యమా? నిజమా? నిజమైతే.. అసలు ఎవరి చర్మాన్ని వలిచారు? ఎవరికి చెప్పులు కుట్టించారు? జవాబు దొరకాలంటే.. ఓసారి రింగులు తిప్పండి.. ఎందుకంటే.. మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నాం మరి.. 1878 సంవత్సరంలో ఒకానొక రోజు.. అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రం బిగ్ నోస్ జార్జ్ గ్యాంగ్ అలియాస్ జార్జ్ ప్యారెట్ గ్యాంగ్ ఓ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది. జార్జ్ ప్యారెట్ అంటే అప్పట్లో పేరొందిన బందిపోటు.. అతడికి పొడుగాటి ముక్కు ఉండటంతో అందరూ బిగ్ నోస్ జార్జ్ అని కూడా పిలిచేవారు.. అలాంటి జార్జ్ రైలు దోపిడీకి ప్లాన్ వేశాడు.. ఇప్పట్లో అంటే అంతా మొబైల్ పేమెంట్.. అప్పట్లో కాగితపు కరెన్సీనే.. ముఖ్యంగా జీతాల రోజున ఉద్యోగులకు చెల్లించడానికి బాక్సుల్లో డబ్బును రైళ్ల ద్వారా పంపేవారు.. జార్జ్ టార్గెట్ చేసింది కూడా అలాంటి రైలునే.. అప్పటికే అతడి గ్యాంగు సభ్యులు బోగీల మధ్య ఉన్న లంకెలను లూజ్ చేసి పెట్టారు.. బోగీలు విడిపోతే.. వాటిని దోచుకోవచ్చన్నది వీరి ప్లాన్.. అయితే.. రైలులో వేరే సీన్ నడుస్తోంది.. అప్పటికే దీన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది.. లింక్‌లు లూజ్ కాకుండా బిగించి.. పోలీసులకు సమాచారమిచ్చారు.. ఇక్కడ విషయం తెలియని జార్జ్.. రైలు కోసం ఎదురుచూస్తున్నాడు.. పోలీసులు వచ్చేశారు.. కాల్పులు.. గ్యాంగ్ సభ్యులు పారిపోయారు.. అయితే.. డిటెక్టివ్ టిప్ విన్సెంట్.. వయోమింగ్ డిప్యూటీ పోలీసు అధికారి రాబర్ట్‌లు బిగ్ నోస్ జార్జ్‌ను వెంటాడుతూ వెళ్లారు.. కానీ.. అంతలోనే.. ధన్.. ధన్ అంటూ శబ్దం.. జార్జ్ తుపాకీ గురి తప్పలేదు.. ఈ రాబర్ట్.. విన్సెంట్ మరణం పెద్ద సంచలనమైంది.. జార్జ్ తలపై వెలను 20 వేల డాలర్లుగా ప్రకటించారు.. రెండేళ్లు.. బిగ్ నోస్ హవా కొనసాగింది.. ఒకరోజు మోంటానాలోని బార్లో జార్జ్ తాగి వాగాడు.. పోలీసులను తానెలా చంపిం దీ గొప్పలు పోయాడు.. ఎవరో విషయం అధికారులకు చేరవేశారు.. వారొచ్చి.. తాగి పడున్న జార్జ్‌ను అరెస్టు చేసి తీసుకు పోయారు.. కోర్టులో విచారణ జరిగింది.. జార్జ్‌కు ఉరిశిక్ష పడింది.. సీన్ కట్ చేస్తే.. 1881 మార్చి 21 అర్ధరాత్రి.. జార్జ్‌కి ఉరి వేయడానికి 10 రోజుల ముందు... జైలు నుంచి తప్పించుకోవడానికి బిగ్ నోస్ ప్లాన్ వేశాడు.. బయట పడేవాడే.. కానీ చివరి నిమిషంలో దొరికిపోయాడు.. విషయం జనానికి తెలిసింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జైల్లోకి దూసుకెళ్లారు.. జార్జ్‌ను బయటికి లాగి.. టెలిఫోన్ స్తంభానికి కట్టేసి.. ఉరేశారు.. అతడి శవాన్ని తీసుకెళ్లడానికి సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో థామస్, జాన్ ఓస్బర్న్ అనే వైద్యులు తమ ప్రయోగాల నిమిత్తం వాడుకోవడానికి తీసుకెళ్లారు. అతడి క్రిమినల్ మనస్తత్వాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా అతడి మెదడులో ఏమైనా తేడా ఉందేమో పరిశీలించిడానికి జార్జ్ పుర్రె భాగాన్ని రెండుగా కోశారు. తర్వాత తర్వాత జాన్ చాలా చిత్రవిచిత్ర పనులకు పాల్పడ్డాడు. తాను ధరించడానికి వీలుగా జార్జ్ చర్మాన్ని వలిపించి.. డెన్వర్‌లోని ఓ ఫ్యాక్టరీలో షూ తయారుచేయించాడు. మిగతా బాడీని ఉప్పు నీటి మిశ్రమం కలిగిన పీపాలో ఉంచాడు.. పలు ప్రయోగాల తర్వాత ఆ పీపాను భూమిలో పాతించాడు. ఇంకో విషయం తెలుసా? 1893లో వయోమింగ్ గవర్నర్‌గా కూడా ఎన్నికైన జాన్.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జార్జ్ చర్మంతో తయారుచేసిన షూనే ధరించాడని చెబుతారు. తర్వాత చాన్నాళ్ల వరకూ బిగ్ నోస్ పేరు ఎక్కడా వినిపించలేదు.. 1950ల్లో మళ్లీ జార్జ్ పేరు వార్తల్లోకెక్కింది. ఓ చోట భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా.. ఆ పీపా బయటపడింది. అంతటి మహాబందిపోటు చెప్పుగా మారిన చరిత్ర బయటికొచ్చింది.. ఇప్పుడా చెప్పులు, జార్జ్ పుర్రె వంటివి వయోమింగ్‌లోని కార్బన్ కౌంటీ మ్యూజియంలో ఉన్నాయి. జార్జ్ చర్మంతోనే ఓ మెడిసిన్ బ్యాగ్‌ను కూడా తయారు చేయించారని చెబుతారు. అది మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అదీ దొరికితే.. ఆ కథను పార్ట్–2గా చెప్పుకుందాం.. ప్రస్తుతానికి ఇదండీ.. చెప్పు తాలూకు చరిత్ర! – సాక్షి, తెలంగాణ డెస్క్ -
‘ఎలక్ట్రో షూ’తో ఆకతాయిలకు చెక్!
దేశంలో మహిళల కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ వారిపట్ల లైంగిక వేధింపులు ఆగడం లేదు.. ఎంతో మంది నిర్భయలను అక్కడక్కడ మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.. ఈ పరిస్థితుల్లో ఆకతాయిల నుంచి మహిళలు వారిని వారే కాపాడుకోగలగాలి.. ఈ క్రమంలో పెప్పర్ స్ప్రే వంటి వాటిని కొందరు మహిళలు తమ పర్సుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. అదే కోవలోకి వస్తుంది ఈ చెప్పు. ఈ చెప్పు కూడా మహిళలను ఆకతాయిల నుంచి కాపాడుతుంది. అదెలాగంటే... ఆకతాయిలు వేధిస్తున్నప్పుడు వారిని ఈ చెప్పు కాలితో తన్నితే సరిపోతుంది. ఆ చెప్పు ద్వారా కరెంట్ షాక్ తగిలి వారికి తగిన శాస్తి జరుగుతుంది. ఆకతాయిల అకృత్యాలను చూసి కలతచెందిన తెలంగాణ వాసి సిద్ధార్థ్ మందాలా మహిళల భద్రత కోసం ఏదన్నా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎలక్ట్రోషూపై కొన్ని ఏళ్లుగా శ్రమించి వాటికి తుదిరూపు తీసుకొచ్చాడు. మహిళను ఎవరైనా ఆకతాయి వేధింపులకు గురిచేసినపుడు ఆ సమయంలో సదరు మహిళ వాడిని ఒక తన్ను తన్నితే చాలు.. వాడి శరీరంలోకి 0.1 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తుంది. అంతేకాకుండా తాను ప్రమాదంలో ఉన్నాననే సమాచారాన్ని పోలీసులకు చేరవేసి, వారిని, కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. ఈ చెప్పులను వేసుకుని నడుస్తూ వెళితే అందులోని సర్క్యూట్ బోర్డు ద్వారా దానంతట అదే చార్జ్ అవుతుంది. మహిళ ఎంత నడిస్తే అంత శక్తి ఉత్పత్తి జనిస్తుంది. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ రీచార్జబుల్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఎంతో మంది ప్రొఫెసర్లు, ఇంజనీర్ల సహాయంతో చాలా ఏళ్లు కృషి చేసి ఈ ఎలక్ట్రోషూను సిద్ధార్థ్ తయారుచేశాడు. ప్రస్తుతం ఈ షూ కొందామని మాత్రం ప్రయత్నించకండి.. ఎందుకంటే ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలోనే ఉంది. అంతేకాకుండా చెప్పు రూపంలోనే కాకుండా బూట్ల రూపంలోనూ దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. -
స్లిప్పర్స్‌కి నగలు
న్యూలుక్ ఎండలు మండుతున్నాయి. అంటే, వేసవి వచ్చేసినట్టే! సాయంకాలాలు షికార్లు షరా మామూలే! కంఫర్ట్‌గా ఉండే స్లిపర్స్ వేసుకొని అలా కాలి నడకన సాయంకాలపు పిల్లగాలులను ఆస్వాదించాలని వెళ్లాలనుకుంటున్నారా! అయితే, పాదాలకు అందమైన డిజైనర్ స్లిప్పర్స్ ఉండాల్సిందే! ఈవెనింగ్ వాక్‌కి ఖరీదైన చెప్పులు ఎందుకు అని ఆలోచించేవారు సొంతంగా ఇలాంటి డిజైనర్ చెప్పులను తయారుచేసుకోవచ్చు. డ్రెస్సులకు మ్యాచింగ్‌గా ధరించవచ్చు. డ్రెస్సులకు ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ చేయడానికి బోలెడన్ని డిజైన్స్ మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. వాటిలో కావల్సిన రంగు, డిజైన్స్ ఎంచుకొని తెచ్చుకోవాలి. మరికాస్త తీరిక, ఆసక్తి, సృజన ఉన్నవారు పూసలు, స్టోన్స్ ఉపయో గించి, క్లాత్ పువ్వులు, లేసులు తయారు చేసుకోవచ్చు. ఈ డిజైన్స్‌ని చెప్పులకు దారంతో కుట్టేయడం లేదా ప్లాస్టిక్ వైర్‌తో అల్లడం చేస్తే ఇలా ముచ్చటైన డిజైనర్ స్లిప్పర్స్ రెడీ. డిజైనర్ డ్రెస్సుల మీదకూ ఇలాంటి డిజైనర్ చెప్పులు ధరించవచ్చు. -
లెదర్‌తో లవ్లీ ఐటమ్స్
నెలకు రెండు, మూడు జతల చెప్పులను వాడిపడేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. అలాంటప్పుడు ఇంట్లోనే చెప్పులు తయారు చేసుకుంటే బాగుండని అందరికీ అనిపిస్తుంది. కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఇక తెలిస్తే ఆగుతామా చెప్పండి. షాపుల్లో దొరికే లెదర్ తెచ్చుకొని ఇంట్లోనే చెప్పుల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, నెక్లేస్లు, లాకెట్లు, బ్రేస్లెట్లు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో... కావలసినవి: రంగురంగుల లెదర్ షీట్స్ (షాపుల్లో దొరుకుతాయి), గ్లూ, కత్తెర, హుక్స్ (ఇయర్ రింగ్స్ తయారీకి) తయారీ విధానం: చెప్పుల తయారీకి.. ముందుగా లెదర్ షీట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెర సాయంతో కట్ చేసుకోవాలి (ఎవరి కాలి సైజుకు తగ్గట్టుగా). తర్వాత సైడ్లకు ఉన్న ముక్కలను ఒకదానికొకటి అతికించాలి. గట్టిగా ఉండాలనుకుంటే దారంతో కుట్టుకోవచ్చు కూడా. ఆపైన దానిపై ఓ పెద్ద బటన్ లేదా ఏదైనా కుందన్‌ను గ్లూతో అతికించుకుంటే అందంగా కనిపిస్తాయి. అలాగే ఇయర్ రింగ్స్ తయారీ కోసం వాటికి అనుగుణంగా లెదర్‌ను ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకొని, వాటికి చిన్న రంధ్రం పెట్టి హుక్‌ను బిగిస్తే సరి. కేవలం కాలిజోళ్లు, రకరకాల ఇయర్ రింగ్సే కాక నెక్లేస్, లాకెట్స్‌ను కూడా ఈ లెదర్‌తో సులువుగా తయారుచేసుకోవచ్చు. -
చెప్పులరిగాయి కానీ..!
పాపం ప్రియాంకా చోప్రా న్యూయార్క్‌లో రోడ్లు మీద కాళ్లు కందేలా, చెప్పులు అరిగేలా తిరుగుతున్నారట. ఉన్న చెప్పులు అరిగిపోవడంతో రెండు జతల చెప్పులు కూడా కొనుక్కోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఈ బ్యూటీకి అంత కష్టం ఏమొచ్చింది? మరేం లేదు.. న్యూయార్క్‌లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారట. అందుకే ఇళ్ల వేటలో బిజీగా ఉన్నారు. అక్కడ ఎందుకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారంటే..అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో పాటు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక నటిస్తున్నారు. ఈ షూటింగ్స్ నిమిత్తం న్యూయార్క్ వెళ్లినప్పుడల్లా హోటల్లో బస చేయాల్సి వస్తోందట. ఖర్చు నిర్మాతదే అయినా.. సేఫ్టీ మాటేంటి? రహస్య కెమెరాలున్నాయేమో అన్నది ఆమె భయం. అందుకే ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందని అనుకున్నారట. మరి.. ఇల్లు దొరికేదెప్పుడో? ప్రియాంక ఓ ఇంటిది అయ్యేదెప్పుడో? -
పాదాలకు కొత్త అందాలు...
న్యూలుక్ డ్రెస్ డిజైన్‌లో సొంత ప్రయోగాలు చేస్తాం. అదే పాదాలకు ధరించే చెప్పుల గురించైతే ఆలోచించడానికేమీ ఉండదు. షాప్‌కెళ్లి నచ్చినవి పట్టుకొచ్చేస్తాం. అలా కాకుండా ఎండాకాలం ఈ వేడి వాతావరణానికి తగ్గట్టు మన పాదరక్షలను మనమే డిజైన్ చేసుకుంటే ... అదెలాగో చూద్దాం.. ఇప్పటికే మీ వద్ద ఉన్న చెప్పుల జతలను బయటకు తీయండి. అందులో ఉపయోగంలో ఉన్నవీ, లేనివీ వేరు చేయండి. పాతబడిన, అంతగా ఉపయోగించని వాటిని తీసుకొని కొత్తగా ఈ విధంగా ప్రయోగించవచ్చు.రంగురంగుల కాటన్, సిల్క్ క్లాతలను తీసుకోవాలి. ఇందుకోసం మళ్లీ క్లాత్ కొనక్కర్లేదు. ఉపయోగంలో లేని డ్రెస్సులు, దుపట్టాలను ఇందుకు వాడచ్చు. జనపనార మెత్తటి తాళ్లను కూడా వాడచ్చు. క్లాత్ ముక్కలను పొడవైన పీలికలుగా కత్తిరించాలి. వీటిని జడలుగా అల్లి పక్కనుంచాలి. చెప్పు పైభాగంలో ఉండే నాడలను తొలగించాలి. ఈ నాడల ప్లేస్‌లో అదే విధంగా అల్లిన ఫ్యాబ్రిక్ జడలను సెట్ చేయాలి. చెప్పు నాడలు ఎలాంటి సమస్య లేకుం డా ఉంటే వాటికే మల్టీకలర్ ఫ్యాబ్రిక్‌తో పువ్వులను చేసి, కుట్టాలి. అప్పుడు స్లిపర్స్ కూడా స్టైల్ ఫుట్‌వేర్‌గా మారిపోతాయి. రకరకాల మోడల్స్‌లో క్లాత్స్, రిబ్బన్స్, లెదర్ బెల్ట్‌లు, క్లాత్ బెల్టులను ఉపయోగిస్తూ ప్లాట్ చెప్పులను ఇలా అందంగా సింగారించవచ్చు. {yెస్కు మ్యాచింగ్ చెప్పులు ధరించి మరింత అందంగా మెరిసిపోవచ్చు. -
కాళ్లు కాలుతున్నాయ్..
♦ వెక్కిరిస్తున్న పేదరికం.. చెప్పులకు నోచుకోని వైనం ♦ మండుటెండలో కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ♦ దాతలు కరుణిస్తే వేసవి గండం నుంచి ఉపశమనం బాలాజీ అనే విద్యార్థి ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి మరణించడంతో తల్లి వెంట్రుకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పేదరికం కారణంగా చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. గోపవరం పంచాయతీ పరిధిలోని కాలువకట్ట నుంచి రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వచ్చి వెళుతున్నాడు. మండు వేసవిలో తలపై టోపీ/గొడుగు లేనిదే బయటకు రాలేని స్థితిలో ఈ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా వస్తుండటం దయనీయం. ‘ఎండాకాం వచ్చింది.. కాళ్లు కాలుతున్నాయి.. కొంచెం దూరం పరుగెత్తి నీడలో ఆగుతా.. మళ్లీ పరుగెత్తి.. మళ్లీ ఆగుతా.. ఇది నాకు అలవాటే’ అంటున్నాడు బాలాజీ. మరో విద్యార్థి పేరు రామాంజనేయులు. ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రి మరణించగా తల్లి నాగలక్ష్మి సున్నపు బట్టీలో పనికి వెళుతోంది. రామాంజనేయులు సోదరుడు శివరామయ్య మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా చెల్లెలు అరుణకుమారి వైవీఎస్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆర్థిక లేమి కారణంగా రామాంజనేయులకు తల్లి చెప్పులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో మండుటెండలకు పాఠశాలకు కాలువకట్ట నుంచి నడిచి వస్తున్నాడు. ప్రొద్దుటూరు :జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అత్యధికులకు కాళ్లకు చెప్పులు లేవంటే నమ్మితీరాల్సిన నిజం. పేదరికం కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులు చెప్పులు లేకుండానే సమీప గ్రామాల నుంచి పాఠశాలలకు రోజూ వచ్చి వెళుతున్నారు. చలి, వర్షాకాలంలో చెప్పులు లేకపోయినా పరవాలేదు కానీ వేసవిలో మాత్రం తప్పనిసరి. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా చాలా మంది పిల్లలకు చెప్పులు కొనిపెట్టే స్తోమత తల్లిదండ్రులకు లేదు. ఉదాహరణకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మొత్తం 348 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 250 మంది కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు వస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఉదయం పాఠశాలకు వచ్చేందుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, తిరిగి ఇంటికెళ్లేప్పుడు చెప్పులు లేకపోవడంతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం పూట ఉన్నందున మధ్యాహ్నం నుంచి పాఠశాలలు నడిచే పరిస్థితి ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క ప్రొద్దుటూరు మండలంలోనే సుమారు 20కిపైగా ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఈ సమస్యతో సతమతమవుతున్నారు. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లాలోని 3,269 ప్రభుత్వ పాఠశాలల్లో సగం వాటిలో ఈ సమస్య కనిపిస్తోంది. తమ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల్లో పాతిక శాతం మందికి చెప్పులుండటం లేదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ దాతలు స్పందిస్తే విద్యార్థులు వేసవి గండం నుంచి గట్టెక్కుతారు. -
ఇకపై చెప్పులు లేకుండా కోర్టుకు ఖైదీలు!
తిరువళ్లూరు: నిందితుడు న్యాయమూర్తిపై చెప్పులు విసిరిన ఘటన తమిళనాడు జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం న్యాయమూర్తి...ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్లితే....తిరువళ్లూరు జిల్లా ఆవడి ప్రాంతానికి చెందిన ఏలుమలై(38)పై పలు కేసులు ఉన్నాయి. ఇతన్ని ఆరు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. పూందమల్లిలోని జ్యుడీషియల్ కోర్టు-1లో కేసు విచారణ కొనసాగుతోంది. మహిళా న్యాయమూర్తి నిషా కేసును విచారిస్తున్నారు. నిందితుడిని జనవరి 7న కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసు బందోబస్తు నడుమ పుళల్ జైలు నుంచి ఏలుమలైను గురువారం కోర్టుకు తీసుకొచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి నిషా విచారణ చేస్తుండగానే ఆవేశానికి లోనైన అతను కోర్టులో వీరంగం సృష్టించాడు. ఎన్ని సార్లు కోర్టుల చుట్టూ తిరగాలంటూ ఏలుమలై గట్టిగా కేకలు వేశాడు. తీవ్ర దుర్భాషలాడిన అతడు చెప్పులు తీసుకుని మహిళా న్యాయమూర్తిపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితుడికి న్యాయమూర్తి మరో 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. -
చెప్పులు కరుస్తుంటే..!
ఇంటిప్స్ ఇల్లు తుడవడానికి వాడే నీళ్లలో కాస్త ఉప్పు వేస్తే... ఇంట్లో ఈగలు, దోమలు చేరకుండా ఉంటాయి. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే... కరుస్తున్నచోట పెరుగు రాసి రాత్రంతా ఉంచి, పొద్దున్న తొడుక్కోవాలి. స్క్రూలు తుప్పు పట్టి బిగిసిపోతే... వాటి మీద కాస్త వెనిగర్ వేస్తే తేలికగా ఊడి వస్తాయి. టాల్కం పౌడర్ సువాసనను కోల్పోయినట్టు అనిపిస్తే... డబ్బాను కాసేపు ఎండలో ఉంచాలి. ప్లాస్టిక్ కంటెయినర్లకు అంటిన పసుపు మరకలు వదలాలంటే శెనగపిండితో తోమాలి. -
కాళ్లకు చెప్పులు లేకుండా నడిచారా?
స్వప్నలిపి కలలో... చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడుస్తుంటాం. కాళ్లకు చెప్పులు లేవనే విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్లే లోపే....మెలకువ వస్తుంది! గుడి నుంచి బయటికిరాగానే...చెప్పులు కనిపించవు. ఫంక్షన్లో భోజనం చేసి బయటికి రాగానే...చెప్పులు కనిపించవు. చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడుస్తుంటాం. అర్థం ఏమిటి? చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడవడం...అనే కలకు ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ‘ఉంది’ అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారు చెప్పే దాని ప్రకారం... స్వాతంత్య్రం, జీవిక కోల్పోవడం, దివాళా తీయడం... మొదలైన వాటిని ఈ కల ప్రతిబింబిస్తుంది. మీలో మొదటి నుంచి స్వతంత్ర దృక్పథం ఎక్కువ. తప్పనిసరి పరిస్థితులలో ఆ స్వేచ్ఛను కోల్పోవలసి రావచ్చు. పైకి బాగానే ఉన్నప్పటికీ, అంతరాంతరాలలో అసంతృప్తి. ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా సంపద కోల్పోయినప్పుడు జీవితాన్నే కోల్పోయినట్లుగా విషాదంలో కూరుకుపోతారు కొందరు. ‘ఏమీ మిగల్లేదు’ అనుకుంటారు... ఈ స్థితిని చెప్పులు లేని నడక లేదా ‘అసౌకర్యమైన నడక’ ప్రతిఫలిస్తుంది. ‘‘ఇంకొద్ది రోజుల్లో సమస్యలు ఎదుర్కోబోతున్నాను’’ అనే ముందస్తు భయాల నుంచి కూడా ఇలాంటి కలలు పుడుతుంటాయి. ఒక మాట శాస్త్రీయ విశ్లేషణ మాట ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలలో ‘చెప్పులు లేకుండా నడవడం’ అనే కలకు ‘కోల్పోవడం’ ‘దివాళా తీయడం’ లాంటి సంప్రదాయ అర్థాలు ఉన్నాయి. ఉదా: అరబ్ దేశాలలో చెప్పులు లేకుండా నడవడం అనే కలకు... సంప్రదాయ అర్థం: అనారోగ్యం, నష్టపోవడం. -
కిరణ్‌కు మిగిలేవి చెప్పులేనా?
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ గుర్తును ఏ ముహూర్తంలో నిర్ణయించుకున్నారో గానీ.. ఆయనకు మిగిలేది ఆ చెప్పుల జత ఒక్కటే అనిపిస్తోంది. నాయకులు అందరూ ఒక్కొక్కళ్లుగా జై సమైక్యాంధ్ర పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి పార్టీ పెట్టించిన వాళ్లంతా క్రమంగా జారుకుంటున్నారు. నమ్మిన బంటులా ఉన్న పితాని సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. అనుంగు అనుచరుడిగా భావించిన రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ తాను రాజంపేట నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కూడా చెప్పేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆశీస్సులు తీసుకుని మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు. (చదవండి: కిరణ్‌కు సాయిప్రతాప్ షాక్) దీంతో తాను నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఎన్నికల గుర్తుగా పెట్టుకున్న చెప్పుల జత వేసుకుని కిరణ్ వెళ్లిపోవాల్సి ఉంటుందని అంటున్నారు.