చూపులను ఇట్టే చుట్టేసుకునే పాదరక్షల్లో బోలెడన్ని డిజైన్లు ఇప్పుడు మన మదిని పట్టేస్తున్నాయి. పాము కుబుసంలాంటి స్ట్రాప్స్‌తో పువ్వులు, సీతాకోకచిలుకలు అల్లుకునే తీరుతో లెదర్, ఫైబర్, ఫ్యాబ్రిక్ మెటీరియల్ లెక్కింపు లేకుండా క్రిస్టల్స్, స్వరోస్కి, కుందన్స్, మువ్వలు.. పాదం నుంచి మోకాలి వరకు డ్రెస్ డిజైన్‌ను మరింత పెంచేలా నడకలో రాజసం కదిలేలా పార్టీవేర్ ఫుట్‌వేర్ కొత్తగా మెరిసిపోతుంది.
నడకలోనే కాదు కాలికి ధరించే పాదరక్షల్లోనూ అందం ఉండాలనుకుంటారు. స్టైలిష్‌గా కనిపించడంతో పాటు నడక కూడా అంతే దీటుగా ఉండాలనుకునేవారికి సరైన సమాధానంలా ఉంటున్నాయి ఈ ఈవెనింగ్ శాండల్స్.
స్ప్రింగ్‌లా ఉండే స్ట్రాప్స్ కాలిని చుట్టుకుపోతూ, చివరి భాగం పాము తలను పోలిన డిజైన్‌తో ఉంటుంది. ఈవెనింగ్ శాండల్స్ అని పేరున్న ఇవి పార్టీవేర్‌గా వెలిగిపోతున్నాయి.
లాంగ్ ఫ్రాక్స్ లేదా జీన్స్ ధరించినప్పుడు ప్లెయిన్ స్పైరల్ స్ట్రాప్స్ శాండల్స్ క్యాజువల్ వేర్‌గా నప్పుతాయి. రిసెప్షన్ వంటి సాయంకాలపు వేడుకలలో ధరించే డ్రెస్సులకు షాండ్లియర్ రోప్ స్ట్రాప్ ఫుట్‌వేర్ స్టైలిష్ లుక్‌ని పెంచుతుంది. వీటిలో స్టోన్స్‌తో తీర్చిన పువ్వులు, లతలు ఉన్న డిజైన్స్‌ని ఎంచుకోవచ్చు.
చదవండి: Fashion: ఈ హీరోయిన్ ధరించిన చీర ధరెంతో తెలుసా?
Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment