2023లో మగువలు మెచ్చిన చెప్పులు.. ‘బ్లాక్‌ కలర్‌ వావ్‌’ | Trending Footwear Fashion 2023 | Sakshi
Sakshi News home page

Footwear Fashion 2023: మగువలు మెచ్చిన చెప్పులు..

Dec 23 2023 10:23 AM | Updated on Dec 23 2023 11:10 AM

Trending Footwear Fashion 2023 - Sakshi

మగువలు అందంగా, స్టైలిష్‌గా కనిపించేందుకు తాము ధరించే దుస్తులతో పాటు పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. మనం ధరించే పాదరక్షలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెబుతుంటారు. మరి 2023లో మగువలు మెచ్చిన పాదరక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

బ్లాక్ హీల్స్ 
ఈ సంవత్సరం బ్లాక్ హీల్స్ .. పాదరక్షల ఫ్యాషన్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. బ్లాక్ హీల్స్ ప్రత్యేకత ఏమిటంటే  ఇవి తేలికగా ఉంటూ, అస్సలు ఇబ్బంది కలిగించవు. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ సంవత్సరం బ్లాక్‌ కలర్‌ హీల్స్‌ను చూసిన మగువలు ‘బ్లాక్‌ కలర్‌ వావ్‌’ అంటూ తెగ మురిసిపోయారు.

బూట్లు 
మగువల కోసం రూపొందించిన బూట్లు ట్రెండ్‌లో ఉన్నాయి. పాదాలు మొదలుకొని మోకాలి వరకు లేదా  తొడల వరకూ ఉండే ఈ బూట్లు ఫ్యాషన్‌ మార్క్‌గా నిలిచాయి. శీతాకాలంలో ఈ బూట్లు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. చలి నుంచి రక్షణ కల్పిస్తాయి. డ్రెస్‌లు, జీన్స్, స్కర్ట్‌లపై బూట్లు చక్కగా అమరిపోతాయి.ఈ ఏడాది షైనీ బూట్స్ ట్రెండ్‌లో ఉన్నాయి.

లోఫర్స్‌ 
లోఫర్స్‌ అన్ని సీజన్‌లలోనూ సూటవుతాయి. ఈ ఏడాది లోఫర్స్‌ ఎంతో ఆదరణ పొందాయి. లోఫర్స్‌.. జీన్స్, డ్రెస్‌లపై స్మార్ట్ లుక్‌ను ఇస్తాయి. లోఫర్స్‌తో  పొడవు సాక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. చాలామంది మగువల షూ రాక్‌లో తప్పనిసరిగా ఒక జత లోఫర్స్‌ కనిపిస్తాయి. 

కిటన్‌ 
హైహీల్స్ ధరించకుండా స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే అందుకు కిటన్‌ హీల్ మంచి ఎంపిక అని చెబుతుంటారు. కిటన్‌ హీల్స్ ఈ సంవత్సరం మగువలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా  ఉంటాయని చాలామంది చెబుతుంటారు.

గ్లాస్ హీల్స్
పారదర్శక పాదరక్షలు అంటే గ్లాస్‌ హీల్స్ ఈ సంవత్సరం ఫ్యాషన్‌లో నిలిచాయి. పైన పారదర్శక బెల్టులు కలిగిన ఈ పాదరక్షలు ఈ సంవత్సరం హై హీల్స్‌లో  ఉత్తమమైనవిగా పేరొందాయి. ఇవి ధరించినవారు స్టైలిష్‌గా కనిపిస్తారని చాలామంది చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement