కిచెన్‌లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి! | Kitchen Tips Having Trouble Storing These Items In The Kitchen But Do This | Sakshi
Sakshi News home page

Kitchen Tips: కిచెన్‌లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!

Published Thu, May 16 2024 11:17 AM | Last Updated on Thu, May 16 2024 11:17 AM

Kitchen Tips Having Trouble Storing These Items In The Kitchen But Do This

ఇంట్లో ఉ‍న్నటువంటి వస్తువులుగానీ, తిను పదార్థాలు గానీ చాలారోజులు నిలువలేకుండా పాడవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్నిరకాల టిప్స్‌తో చాలాకాలం మన్నికగా ఉండేట్లు చేయవచ్చు. మరవేంటో చూద్దాం!

ఇలా చేయండి..

  • అరకిలో వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు సూజీ రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి దించే యాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. దీనిని పిండి జల్లెడతో జల్లించుకుని మెత్తని పొడిని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇది ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.

  • అన్నం కొద్దిగా మాడినా, అడుగున మొత్తం మాడిపోయినా మిగతా అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఆ వాసనకు అన్నం తినబుద్ది కాదు. ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసనపోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.

  • ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్క తీసి కొద్దిగా నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్‌ ట్రేలో వేసుకుని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్‌ ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.

  • స్ప్రే బాటిల్‌లో టేబుల్‌ స్పూను బేకింగ్‌ సోడా, టేబుల్‌ స్పూను వెనిగర్, టీస్పూను డిష్‌వాష్‌ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లుపోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్‌ ΄్లాట్‌ఫాం, స్టవ్‌ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములు దరిచేరవు.

  • సాల్ట్‌ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్‌ వేయాలి. సాల్ట్‌లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్‌ను పొడిగా ఉంచుతుంది.

  • ప్లాస్టిక్‌ రోల్‌ అతుక్కుని త్వరగా ఊడి రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్‌ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తరువాత ఓపెన్‌ చేస్తే అతుక్కోకుండా సులభంగా వచ్చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement