ఉల్లిపాయలను రకరకాలుగా వాడుతుంటాము. ఉల్లి మేలేమోగానీ దాని ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారడం ఖాయం. ఉల్లిపాయలు కోయాలన్నా, ఆ ఆలోచన మనసులో రాగానే∙వెంటనే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఉల్లిని ఒక్కచుక్క కన్నీళ్లు రానియకుండా కోయవచ్చు అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మ్యాక్స్ మెక్‌కెన్ అనే వ్యక్తి ఇక ఉల్లిపాయలను ఏడవకుండా ఇలా కోయండి అని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశాడు.
వీడియోలో.. తడిగా ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకుని దానిని కూరగాయలు కట్‌చేసే చాపింగ్ బోర్డు మీద ఉంచాలి. తరువాత మీరు ఎన్ని ఉల్లిపాయలు కోయాలనుకుంటున్నారో వాటన్నింటిని ముక్కలుగా తరగండి. అయితే మనం ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా.. వాటి నుంచి కొన్ని రకాల ఆమ్లాలు బయటకు వెదజల్లి మన కళ్లని నేరుగా తాకుతాయి. దీంతో కళ్లు మండి నీరు వస్తుంది. అయితే చాపింగ్ బోర్డు మీద తడిగా ఉన్న వస్త్రం ఉంచడం వల్ల ఉల్లి నుంచి వచ్చే ఆమ్లాలను అది పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్లు మండవు.’’ అని మ్యాక్స్ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవడమేగాక వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి.
చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు..
చాలామంది నెటిజన్లు నిజంగా ఇది పనిచేస్తుందా? అయితే మేము ఒకసారి ట్రె చేస్తాం అని కొందరు అంటే.. మరికొందరు ఇప్పటికే ఈ ట్రిక్కును మేము ట్రై చేశాము బాగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. మీరూ ప్రయత్నం చేసి చూడండి ఇది ఎంతవరకు పనిచేస్తుదో తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment