
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది. చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే లాక్‌డౌన్ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్‌మార్ట్ ఫౌండేషన్ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల 2,500 మంది చిన్న,సన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు వాల్‌మార్ట్.ఆర్గ్, డైరెక్టర్ (స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్) షెర్రీ-లీ సింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.
►రైతులు తమ పంటను అమ్ముకోవడమే కాకుండా ఈ వ్యవసాయ సీజన్‌లో మరో పంటను వేసుకోవడానికి వీలుగా వారి చేతికి నగదు అందుతోంది.
►ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా 15కు పైగా రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా 17,000 మంది రైతులకు ప్రయోజనం లభించింది.
► ఈ లాక్‌డౌన్ సమయంలో పసుపుతో పాటు, జీడిపప్పు, మిరియాలు కూడా కొనుగోలు చేసినట్లు టెక్నోసెర్వ్ ఇండియా కంట్రీ హెడ్ పునీత్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment