tribal farmers
-
పెద్దపులి ఎక్కడ?
మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు. నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. మంగపేట అటవీశాఖ ఇన్చార్జ్ రేంజ్ అధికారి అశోక్ మరో 20 మంది సెక్షన్, బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. -
ఢిల్లీకి చేరిన ‘లగచర్ల’!
సాక్షి, న్యూఢిల్లీ/బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి, గిరిజన రైతుల అరెస్టుల అంశం ఢిల్లీకి చేరింది. రైతుల అరెస్టులపై తక్షణమే విచారణ జరిపించాలని... బాధితులకు వెంటనే సహాయం అందించి, రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఆన్లైన్ ద్వారా 19 ఫిర్యాదులు అందాయి. అంతేకాదు నేరుగా ఈ కమిషన్లతోపాటు మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసేందుకు కొందరు లగచర్ల బాధితులు, కుటుంబ సభ్యులు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సీలను కలసి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆందోళన వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. తాము భూములు ఇవ్వబోమంటూ అక్కడి గిరిజన రైతులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు వెళ్లగా.. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్, అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. మూడు కేసులు నమోదు చేసి, 20 మందికిపైగా అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. అయితే పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని గిరిజన కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమ భూము లు కోల్పోతామేమోనన్న భయంతోనే నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నాయి. కానీ పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి విద్యుత్ సరఫరా ఆపేసి మరీ, ఇళ్లపై దాడి చేశారని బాధిత కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు. తమ వారిని తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారని.. మహిళలను కూడా వేధించారని పేర్కొంటున్నారు. ఈ అంశంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఈ అంశాలపై ఫిర్యాదులు చేయనున్నారు. నేడు లగచర్లకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడి రాక కొడంగల్ రూరల్: లగచర్ల, ఫార్మా విలేజీ ప్రతిపాదిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు హుస్సేన్ నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పర్యటించనున్నట్లు గిరిజన మోర్చా నేతలు తెలిపారు. వారు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంతోపాటు, గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుంటారని వెల్లడించారు. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
Fact Check: గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీ రోజుకో అబద్ధాన్ని వల్లెవేస్తూ గిరిజనుల సంక్షేమానికి అగ్రపాధాన్యమిచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలులో రికార్డు సృష్టిస్తున్న గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా చెల్లిస్తున్నా కబోది రామోజీ ‘గుండెల్లో పెట్టుకుంటానని.. గుదిబండగా మారారు!’ అంటూ ఈనాడులో అబద్ధాలు అచ్చేశారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కోసం ప్రత్యేకంగా అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన జగన్ ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. ఆరోపణ: ఆదాయం చూడడమే తప్ప ఆదుకోరా? వాస్తవం: కాఫీకి అంతర్జాతీయంగా చెల్లించే ధర కంటే ఎక్కువకు జీసీసీ కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ముడి కాఫీ రూ.215, చెర్రీ ముడి కాఫీకి రూ.130 చెల్లించేవారు. ఏజెన్సీలో పండించే కిలో ముడి కాఫీకి రూ.280, చెర్రీ ముడి కాఫీకి రూ.145 ఇస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో కేంద్ర కాఫీ బోర్డు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పార్చ్మెంట్ కాఫీ 10, చెర్రీ కాఫీ 10.5 తేమతో కొనుగోలు చేసేలా నిర్ణయించారు. ప్రైవేటు వ్యాపారుల బారిన పడి గిరిజన రైతులు నష్టపోకుండా కొనుగోలు సిబ్బందికి జీసీసీ తేమ శాతం నిర్ధారణ పరికరాలు అందించింది. ఖచ్చితమైన తేమ శాతం నిర్ధారించి కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ముడి కాఫీ కొనుగోలు రిపోర్ట్‌ను జీసీసీ మేనేజర్లు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 1000 మెట్రిక్ టన్నుల ముడి కాఫీ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 340 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో కాఫీ దిగుబడి తగ్గడం వల్ల గత సీజన్ కంటే ఈ ఏడాది కొనుగోలు తగ్గింది. ఆరోపణ: మిగిలిన వాటికి ‘మద్దతు’ కరువే? వాస్తవం: మిగిలిన ఉత్పత్తులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జీసీసీ కిలో కరక్కాయలు రూ.15 నుంచి రూ.18, ఎండు ఉసిరి రూ.90, రాజ్మా రూ.90కి జీసీసీ కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల్లో పిక్క చింతపండు రూ.23 నుంచి రూ.28 మాత్రమే ఉంటే జీసీసీ పిక్క చింతపండు రూ.32 నుంచి రూ.40, పిక్క తీసిన చింతపండు రూ.63 ధర ప్రకటించి కొనుగోలు చేస్తోంది. ఆరోపణ: లాభాలే పరమావధా? వాస్తవం: ఏజెన్సీ కాఫీకి మంచి గుర్తింపు తెచ్చిన ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో జీసీసీ బ్రాండింగ్ చేస్తోంది. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ రకాలను జీసీసీ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తోంది. వీటి గరిష్ట రిటైల్ ధర నిర్ణయించే సమయంలో ముడి కాఫీ ధర, శుద్ధీకరణ, తయారీ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ మార్ట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవేమీ తెలియనట్టుగానే వీటి అమ్మకాల ద్వారా జీసీసీ అధిక లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు రోత రాతలు రాయడం దారుణం. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల అడవుల్లో గిరిజనుల నుంచి సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తోంది. కేజీ తేనెను రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తోంది. తేనెకు గరిష్ట రిటైల్ ధర నిర్ణయంలో ముడి తేనె ధర, శుద్ధీకరణ ఖర్చు, శుద్ధికరణలో తరుగుదల, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రీటైల్ మార్ట్లు, నాణ్యత ప్రమాణాల పరీక్షలకు అయ్యే ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు. అయితే తేనే విక్రయాల్లో జీసీసీ లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. అలాగే ప్రైవేటు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసేలా జీసీసీ అనేక చర్యలు చేపట్టింది. మద్దతు ధర నిర్ణయించడం వల్ల ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఆరోపణ: రుణాలిచ్చింది 160 మందికే? వాస్తవం: గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. దీనికితోడు జీసీసీ గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేస్తోంది. గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి తిరిగి రుణాలు ఇస్తున్నారు. 2016–17 నుంచి 2022–23 వరకు జీసీసీ ద్వారా 4,839 మంది గిరిజన కాఫీ రైతులకు రూ.528.28 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో ఇంకా రూ.252.86 లక్షల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో రూ.22.80 లక్షల రుణాలు మంజూరు చేశారు. -
రైతుల సంఘటితంగా కూరగాయల సాగు
-
పోడుదారులకు రైతుబంధు.. రైతులు వివరాలు అందించాలి
నర్సంపేటరూరల్/ఖానాపురం/నెక్కొండ/నల్లబెల్లి : పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట మండలాల్లో పోడు భూముల కోసం 3,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసిన అనంతరం 3,271 మంది లబ్ధిదారులు.. 7,333 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. సాంకేతిక కారణాలతో 3,262 మందికి పట్టాలను సైతం తయారీ చేయించి పంపిణీకి సిద్ధం చేశారు. హక్కుపత్రాలు పొందే రైతులకు రైతుబంధు సైతం అందించనుంది. ఇప్పటికే ఇతర రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. వీరితోపాటు గిరిజన రైతులకు సైతం అందించడానికి వివరాలు సేకరిస్తున్నారు. హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతుల వివరాలను ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు.. మండల వ్యవసాయ అధికారులకు అందించారు. వివరాల ఆధారంగా గిరిజన రైతుల వద్ద నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్ పత్రాలను స్వీకరిస్తున్నారు. ఖానాపురం మండలలో సుమారు 1,829 మంది గిరిజన రైతులు, సుమారు 700 ఎకరాల భూమిని గుర్తించారు. వీరిలో సుమారు 1200 మంది నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు వివరాలు సేకరించి వ్యవసాయ అధికారులకు చేరవేస్తున్నారు. సుమారు మరో 629 మంది రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈనెల 30 లోపు వ్యవసాయ అధికారులకు అందజేస్తే జూలై 3 లోపు ఆన్లైన్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 560 దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఇప్పటికే రైతుల వివరాలు ఆన్లైన్ చేయగా రైతు బంధు డబ్బులు సైతం ఖాతాల్లో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నల్లబెల్లి మండలంలో 1083 మంది పోడు రైతులు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో 964 మంది రైతుల దరఖాస్తులు ఆమోదించారు. ప్రభుత్వం 906 దరఖాస్తులను ఆమోదించి, 2,700 ఎకరాలకు హక్కుపత్రాలు అందించనుంది. నెక్కొండలో 220 మంది రైతులకు 355 ఎకరాలకు, నర్సంపేట మండలంలో 120 మందికి 237 ఎకరాల భూమికి సంబంధించి హక్కుపత్రాలు అందించనుంది. ఈ మండలాల్లో కూడా అధికారులు పోడు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్ చేసేందుకు గడువు పొడిగించాలి రైతుబంధు కోసం గిరిజన రైతుల నుంచి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 70దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. నమోదు సమయంలో సర్వర్ మొరాయిస్తోంది. ఉ దయం, రాత్రి వేళ నిత్యం కంప్యూటర్‌తో కుస్తీ పడి తే సుమారు 120 నుంచి 150 వరకు ఆన్లైన్ అవుతున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రైతులు వివరాలు అందించాలి హక్కుపత్రాలు కలిగిన వివరాలు పంచాయతీ కార్యదర్శులకు అందాయి. వాటి ఆధారంగా గిరిజన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతాల జిరాక్స్‌లను వ్యవసాయ విస్తరణ అధికారులకు లేదా పంచాయతీ కార్యదర్శులకు అందించాలి. సకాలంలో ఆన్లైన్ చేస్తేనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వివరాలు అందించని రైతులు రైతుబంధును కోల్పోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
పోడు రైతులకు 30 నుంచి పట్టాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పుస్తకాల పంపిణీకి సర్వం సన్నద్ధమైంది. అర్హత ఉన్న రైతులకు పట్టాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ఆ జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతులకు పట్టాలను పంపిణీ చేస్తారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంబోత్సవం అనంతరం పట్టాల పంపిణీ చేసి అక్కడ జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. వాస్తవానికి పట్టాల పంపిణీ ఈనెల 24న ప్రాథమికంగా ఖరారు చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈనెల 30కి మార్చారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. 1,50,012 మంది రైతులకు 4,50,601 ఎకరాలు.. పోడుభూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి గిరిజనులు, ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హతలను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,50,012 మంది రైతులు 4,50,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు దర ఖాస్తులు సమర్పించారు. ఈ లెక్కన ఒక్కో రైతు సగటున 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు దరఖాస్తులు సమ ర్పించారు. ఈ రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పట్టాలను అందించిన తర్వాత ఇతర జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రులు కూడా అదేరోజు పట్టాల పంపిణీ చేస్తారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి గిరిజనులు కృతజ్ఞతులై ఉంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. -
సున్నా వడ్డీ రుణాలు.. గిరిజన రైతులకు మేలు
ఏజెన్సీ ప్రాంతాలలో వ్యవసాయం చేసే గిరిజన కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకులు ఈ చిన్న, సన్న కారు రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకి వస్తుం టారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఈ వడ్డీ వ్యాపారుల నుండి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్)గా పొందడమే గాక, వాటికి వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు... ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండటంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోని కొన్ని ఆదివాసీ ప్రాంత రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వక పోవ డంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిర్చింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రివేళ ఇళ్ళు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ ‘గిరిగిరి’ వ్యాపారం వర్ణించ లేనిది. గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని, వడ్డీ వ్యాపారులు చేస్తున్న మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం–1960ను రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 5,948 షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ పొందకుండా రుణాలు ఇవ్వరాదు. అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న సాచివేత ధోరణి వల్ల ఏజెన్సీ రైతుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఏపీలో ‘వైఎస్సార్ రైతు భరోసా’, తెలంగాణలో ‘రైతుబంధు’ పథకాల ద్వారా అందే సాయం వల్ల కొంత మేలు జరుగుతోంది. రైతులందరికీ పెట్టుబడిగా ఇవ్వబోయే ముందస్తు సాయం, రుణాలు సకాలంలో అందించి ఏజెన్సీ ప్రాంత అన్నదాతలను ఆదుకోవాలి. ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈ రైతులకు మేలు జరుగుతుంది. (క్లిక్ చేయండి: యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం) – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం) -
పోడు సర్వే జాబితాలో పేర్లు లేవని ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం చేపట్టిన పోడుభూముల సర్వే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాలిలా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాలో పోడుభూముల సర్వేను సర్వే కమిటీ చైర్మన్ భూక్య శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోడుభూముల వ్యవహారంలో రాశిగుట్టతండా, భూక్యతండా మధ్య కొన్ని విభేదాలున్నాయి. జాబితాలో భూక్యతండాకు చెందిన బాదావత్ కమల(50), బాదావత్ శివరాం(30) పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004 నుంచే తాము సాగుచేసు కుంటున్నా పేర్లు ఎందుకు లేవంటూ ఆవేదనకు లోనయ్యారు. వీరు సాగు చేసుకుంటున్న భూములు రాశిగుట్ట తండా పరిధిలోకి వస్తాయని.. జాబితాలో పేర్లు లేవని చెప్పగానే శివరాం తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కమల కూడా పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరినీ ఎల్లారెడ్డి పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల 1.20 ఎకరాలు, శివరాం రెండెకరాలు సాగు చేస్తున్నారు. -
గిరిజనులనుంచి 18,665 ఎకరాలను గుంజుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించాల్సింది పోయి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 18,665 ఎకరాల భూములను వారి నుంచి లాక్కున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 1,950 మంది గిరిజనుల నుంచి ఈ భూములను లాక్కున్నారని ఆయన చెప్పారు. శనివారం టీపీసీసీ ఎస్టీ సెల్, కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన అటవీభూముల హక్కులపై రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ భూములపై హక్కుల కల్పన కోసం గిరిజనుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చా రు. అటవీభూములకు పోడు భూములనే పేరు పెట్టి వాటిపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా టీఆర్ఎస్ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశామని, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్, రాములు నాయక్, కోదండరెడ్డి, మంగీలాల్ నాయక్, చారులతా రాథోడ్ పాల్గొన్నారు. -
నిదురపో.. హాయిగా..
విశాఖపట్నం: మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గిరిజన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చంటి బిడ్డలను తమతోపాటే తల్లులు తీసుకువెళ్లి.. ఓ వైపు పనులు చేస్తూనే వారిని సాకుతూ మాతృత్వపు మమకారం చాటుతున్నారు. పంట భూముల్లోనే వారిని లాలించి.. నిద్రపుచ్చే దృశ్యాలు మన్యం అంతటా కనిపిస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమండ ప్రధాన రహదారి గడ్డిమర్రి సమీపంలో చోడినారు సేకరణలో తల్లిదండ్రులు బిజీగా ఉండగా.. దగ్గరలోనే చిన్నారులు చీర ఊయల, గొడుగు కింద నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. (క్లిక్: మన్యం అందం.. ద్విగుణీకృతం) -
సాగుకు సమయమిదే
చింతపల్లి: మన్యంలో గిరిజన రైతులు పొద్దు తిరుగుడును సాగు చేసేందుకు ఇదే సరైన సమయమని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఆరోగ్యవంతమైన నూనె పంటల్లో పొద్దుతిరుగుడు ప్రధానమైనది. వార్నిష్, సబ్బుల తయారీలో కూడా పొద్దుతిరుగుడును వినియోగిస్తారు. అన్నిరకాల భూముల్లో ఈ పంటను సాగుచేయవచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి మోర్డారు రకం అత్యంత అనుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో జూన్ రెండవ వారు నుంచి ఆగస్టు రెండవ వారం వరకు సాగుకు అనుకూల వాతావరణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడీఆర్ డాక్టర్ అనురాధ అందించిన వివరాలు.. సాగు పద్దతి పొద్దు తిరుగుడు సాగుకు ముందుగా భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తగా తయారు చేయాలి. హెక్టారుకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ఒకటిన్నర అంగుళాల లోతులో నాగలి చాళ్లలో వేసుకోవాలి. అంతకన్నా లోతులో వేసుకుంటే మొలక సరిగా రాదు. చాళ్ల మధ్య దూరము 2 అడుగులు, మొక్కల మధ్య 12 అంగుళాల దూరం వేసుకోవాలి. హెక్టారుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. పొద్దు తిరుగుడును వేరుశనగలో మిశ్రమ పంటగా 8 నుంచి 12 వరసలకు రెండేసి వరుసల చొప్పున వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలోను, నత్రజని ఎరువులో సగం విత్తుకునేటప్పుడు, మిగిలింది పంట మొగ్గ మీద ఉన్నప్పుడు వేసేకోవాలి. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగలో మిశ్రమ పంటగా వేస్తే వరుసలు తూర్పు, పడమర దిక్కున వేయాలి. లేకుంటే పొద్దుతిరుగుడు వరుసల నీడ వేరుశనగపై పడి పంటకు నష్టం జరుగుతుంది. ఈ పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిలువ ఉండకూడదు. ఈ పంట పరస్పరాగ సంపర్కము మూలంగా గింజకడుతంది. పంట పూత దశలో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పువ్వు మీద చేతితో గాని, మెత్తని గుడ్డతో గాని సున్నితంగా రుద్దినట్లయితే పరాగ సంపర్కము బాగుండి గింజ బాగా కట్టి దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా క్రిమి కీటకాలు, తెగుళ్లు ఆశించవు. పచ్చగొంగళి పురుగు ఆశించినట్లయితే దీని నివారణకు 35 ఈసీ మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట చివరి దశలో పిట్టల భారీ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. వర్షాధార పంటగా ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి పెరుగుతుంది. పొద్దుతిరుగుడు సాగుతో గిరిజనులు మంచి లాభాలు పొందవచ్చని ఏడీఆర్ తెలిపారు. -
అడ్డాకులకు అదిరే ధర
సాక్షి,పాడేరు : ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఉన్న అడ్డాకుల సేకరణతో గిరిజన రైతులు పూర్వం నుంచి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి అడ్డాకులకు డిమాండ్ నెలకొనడంతో వ్యాపారులు గిరిజనుల నుంచి పోటీపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో వారపు సంతలో కనీసం రూ.3 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. రెండు దిండ్లు అడ్డాకులు రూ.1800 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుంకరమెట్ట, అరకు, కించుమండ, హుకుంపేట, జి.మాడుగుల, వంట్లమామిడి, మద్దిగరువు, తాజంగి, అన్నవరం, చింతపల్లి, లోతుగెడ్డ వారపుసంతల్లో రెండు వారాల నుంచి అడ్డాకుల వ్యాపారం భారీగా జరుగుతోంది. మైదాన ప్రాంత వ్యాపారులు.. ఏజెన్సీలో వారపు సంతల్లో నర్సీపట్నం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, ఎస్.కోట, విజయనగరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులంతా పోటా పోటీగానే అడ్డాకులను కొనుగోలు చేస్తుండటంతో గిరిజనులకు మంచి ధర లభిస్తోంది. ఈ ఆదివారం పాడేరు మండలం వంట్లమామిడి, అరకులోయ మండలం సుంకరమెట్ట వారపుసంతల్లో అడ్డాకుల వ్యాపారం భారీగానే జరిగింది. ఈ రెండు సంతల్లోను కనీసం రూ.8లక్షల మేర విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వందలాది కుటుంబాలకు ఉపాధి ఏజెన్సీలోని గిరిజన రైతుల వద్ద సీజన్లో రూ.20 నుంచి రూ.30 వేలకు పైగా ఆదాయం సీజన్ ముగిసే లోపు ఒక్కో కుటుంబం కనీసం రూ.20వేల నుంచి 30వేల వరకు అడ్డాకుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. గతంలో గిరిజన సహకార సంస్థ అడ్డాకులను కిలోల రూపంలో కొనుగోలు చేసేది. అడ్డాకుల వినియోగం అప్పట్లో తగ్గడం, ప్రైవేటు వ్యాపారుల నుంచి ఆదరణ కరువవడంతో పదేళ్ల నుంచి అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడంతో అడ్డాకులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. గిరి రైతులకు అడ్డాకులు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెటఖ పరిస్థితులు కలిసి రావ డంతో రెండేళ్ల నుంచి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో గిరిజనులకు ఊహించని ధర లభించింది. దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుండటంతో ఆదాయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. -
గిరిజన రైతుకు ‘హక్కు’తో పాటు ‘భరోసా’
సాక్షి, అమరావతి: అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపచేయడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు గత రెండున్నరేళ్ల కాలంలో మూడు పర్యాయాల్లో రూ.750 కోట్ల మేర నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్న సంగతి తెల్సిందే. సొంత భూమి కలిగిన ఆసామికే కాకుండా అటవీ హక్కుల పట్టా (ఆర్వోఎఫ్ఆర్)లను పొందిన వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి 2021 నవంబర్ వరకు రాష్ట్రంలో 2,34,827 మంది గిరిజనులకు 4,79,105 ఎకరాలను పట్టాలుగా అందించడం జరిగింది. వాటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో 1,32,084 మంది గిరిజనులకు 2,44,827 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందించడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. దీంతోపాటు సాగుకు సాయమందిస్తూ వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం వర్తింపజేసింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను ప్రభుత్వం నాకు రెండెకరాల భూమికి హక్కు పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఇచ్చింది. దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. భూమి పట్టా ఇవ్వడంతోపాటు ‘రైతు భరోసా’ అందిస్తున్న ప్రభుత్వం నా కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. – పలాసి మోహనరావు, కోడా పుట్టు గ్రామం, విశాఖ జిల్లా. భూమి పట్టా ఇచ్చి సాగుకు ఊతం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపజేశారు. గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన భూముల్లో సాగుకు ‘రైతు భరోసా’తో ఊతమివ్వడం జరుగుతోంది. దీని వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. – పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజనులకు ఆర్థిక వికాసం
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆర్థిక వికాసానికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. వారు దళారుల చేతుల్లో మోసపోకుండా.. కష్టానికి తగిన ఫలితం లభించేలా చూస్తోంది. అటవీ ప్రాంతంలో చెట్ల నుంచి గిరిజనులు సేకరించి తెచ్చిన చింతపండుకు దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధర కిలోకు రూ.35 మించలేదు. దాన్ని పిక్కతీసి, కాస్త శుభ్రం (ప్రాసెసింగ్) చేసి దుకాణాల్లో వ్యాపారులు విక్రయించే కిలో ప్యాకెట్ ధర రూ.150 వరకు ఉంటోంది. ఇక సూపర్ మార్కెట్లలో, మాల్స్‌లో రూ.200 ఉంటోంది. ఈ వ్యత్యాసం తగ్గించడానికి, గిరిజనులే స్వయంగా గిట్టుబాటు ధర సాధించుకునేలా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. వన్‌ధన్ వికాస్ కేంద్రాల (వీడీవీకేల) ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో సుమారు 3.63 లక్షల గిరిజన కుటుంబాలున్నాయి. వీరు అటవీ ప్రాంతంలో తేనె, సీకాయ, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, కొండచీపుళ్లు తదితర అటవీ ఉత్పత్తులను సేకరించి స్థానిక సంతల్లో విక్రయిస్తుంటారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారుల ప్రమేయం వల్ల ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటంలేదు. గిరిజన రైతులు పండిస్తున్న పసుపు, రాజ్మా, బొబ్బర్లు, సజ్జలు, రాగులు, కంది, మిరప, జీడిపిక్కలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రభుత్వం మద్దతు ధర కల్పించినవి మినహా మిగతా పంటల పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో వీడీవీకేల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఏడాది రాష్ట్రంలో 75 వీడీవీకేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి పరిధిలోని 8 ఐటీడీఏలు, గిరిజన సహకారసంస్థ (జీసీసీ), ట్రైఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటిద్వారా ప్రభుత్వం వీడీవీకేలకు రూ.10.64 కోట్లు మంజూరు చేసింది. ప్రాసెసింగ్‌కు ఉపయోగపడే పరికరాలు, ఇతరత్రా సరంజామా కొనుగోలుకు ఈ నిధులను గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మరో 188 వీడీవీకేలను మంజూరు చేసింది. వాటికి అడ్వాన్స్‌గా రూ.14 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వీడీవీకేల సంఖ్య 263కు చేరింది. వీటన్నింటికీ మొత్తం రూ.38.83 కోట్ల వరకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.24.64 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉత్పత్తులకు అదనపు విలువ దాదాపుగా ఒకటి లేదా పక్కపక్కనుండే రెండు, మూడు గ్రామాల గిరిజనులే సభ్యులుగా వీడీవీకేలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది సభ్యులతో ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి 15 గ్రూపులను ఒక వీడీవీకే పరిధిలోకి చేరుస్తున్నారు. ఇలా ఒక్కో వీడీవీకేలో మొత్తం 300 మంది చొప్పున 263 వీడీవీకేల్లో 78,900 మంది సభ్యులు కానున్నారు. వీడీవీకేకి రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రాసెసింగ్, ప్యాకింగ్‌కు ఉపయోగపడే పరికరాలను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గిరిజనులు తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను, పండించిన పంటలను గ్రామాల్లోనే సొంతంగా వ్యాపార తరహాలో శుద్ధి (ప్రాసెసింగ్) చేస్తున్నారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ ఎడిషన్) సమకూరుతోంది. ఆ ఉత్పత్తులను జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీకే కాకుండా లాభం ఉంటే ఇతర వ్యాపారులకు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. సొంత వ్యాపారంతో మంచి ధర.. ఇప్పటివరకు వీడీవీకేల ద్వారా గిరిజనులు రూ.21.19 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. ఇది ప్రారంభం మాత్రమే. అన్ని అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా విలువను జోడించేలా ప్రణాళికను రూపొందించాం. దీనివల్ల ఆయా ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. ట్రైఫెడ్, జీసీసీ మార్కెట్ సపోర్టు కల్పిస్తున్నాయి. ఈ విధానం వల్ల మరికొంతమంది గిరిజనులకు ఉపాధి కలుగుతుంది. – సురేంద్రకుమార్, జనరల్ మేనేజరు (మార్కెటింగ్), జీసీసీ -
రైతులకు అండగా వాల్‌మార్ట్ ఫౌండేషన్
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది. చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే లాక్డౌన్ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్‌మార్ట్ ఫౌండేషన్ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల 2,500 మంది చిన్న,సన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు వాల్‌మార్ట్.ఆర్గ్, డైరెక్టర్ (స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్) షెర్రీ-లీ సింగ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ►రైతులు తమ పంటను అమ్ముకోవడమే కాకుండా ఈ వ్యవసాయ సీజన్లో మరో పంటను వేసుకోవడానికి వీలుగా వారి చేతికి నగదు అందుతోంది. ►ఇప్పటి వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా 15కు పైగా రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా 17,000 మంది రైతులకు ప్రయోజనం లభించింది. ► ఈ లాక్డౌన్ సమయంలో పసుపుతో పాటు, జీడిపప్పు, మిరియాలు కూడా కొనుగోలు చేసినట్లు టెక్నోసెర్వ్ ఇండియా కంట్రీ హెడ్ పునీత్ గుప్తా తెలిపారు. -
ఆ ..భూమి ఎవరికి దక్కేనో..?
త్రిపురారం (నాగార్జునసాగర్) : మండలంలోని అంజనపల్లి గ్రామ శివారు పాల్తీ తండా పరిధి సర్వే నంబర్ 335లో సుమారు 361 ఎకరాల భూమి ఎవరికి దక్కేనో అని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే నంబర్లోని డీఫారెస్ట్ భూమిని గిరిజనులు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ డీ ఫారెస్ట్ భూములకు అక్కడి ప్రాంత గిరిజనులకు అప్పటి ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్ పొంది అంజనపల్లి గ్రా మీణ వికాస్ బ్యాంక్‌లో వ్యవసాయ రుణాలు సైతం తీసుకున్నారు. పలు దఫాలు ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం సైతం పొందారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో 335 సర్వే నంబర్లో ఉన్న 361 ఎకరాల భూమి డీ ఫారెస్ట్‌కు చెందుతుందని అటవీ అధికారులు తేల్చి చెప్పడంతో గిరిజనలు తిరగబడ్డారు. దీంతో వివాదాస్పదం కావడంతో ఈ భూమిని పార్ట్ బీలోకి చేర్చారు. అప్పటి నుంచి గతంలో పట్టా పొంది డీ ఫారెస్ట్‌లో భూమి కలిగి ఉన్న రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు రాక రైతుబంధు, రైతుబీమా వర్తించకపోవడంతో గిరిజన రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతులకు భూమి వర్తించింది ఇలా.. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం జరగకముందు పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పరిధిలో పాల్తీ తండా ఉంది. అయితే సాగర్ డ్యాం నిర్మాణం చేసినప్పుడు ముంపునకు గురైంది. దీంతో అప్పటి అధికారులు నిబంధనల ప్రకారం పాల్తీ తండాను త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులోకి తరలించి శాశ్వత ఇళ్ల స్థలాలు ఇచ్చి ముంపునకు గురైన ప్రతి గిరిజన కుటుంబానికి అక్కడ ఉన్న డీ ఫారెస్ట్ భూముల్లో 5 ఎకరాల చొప్పున కేటా యించి 2 ఎకరాలు మాత్రమే ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మంజూరు చేశారు. అప్పటి నుంచి గిరిజనులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. -
32 ట్రాక్టర్లు.. 200 మంది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవాల్ పట్టణం సమీపంలోని మారుమూల గ్రామం ఉభాలో గ్రామపెద్ద మనుషులు బుధవారం విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ ‘భూమిని స్వాధీనం చేసుకోవడంలో తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి ముందుగానే నిశ్చయించుకునే, వందల సంఖ్యలో మనుషులను వెంటబెట్టుకుని గ్రామ పెద్ద యజ్ఞా దత్ వచ్చాడు. 32 ట్రాక్టర్లలో దాదాపు 200 మంది బలగాన్ని, ఆయుధాలను అతను తీసుకొచ్చాడు. 200 మంది యజ్ఞా దత్ మనుషులు వివాదంలో ఉన్న భూమి వద్దకు చేరుకున్నారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న మేమంతా అక్కడకు వెళ్లగానే, కనీసం మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా వారు తుపాకులతో మాపై కాల్పులు ప్రారంభించారు. యజ్ఞా దత్ మనుషులు తుపాకులు, ఆయుధాలతో వచ్చినట్లు మాకు ముందుగా తెలియదు. వారు కాల్పులు జరుపుతుండటంతో ప్రాణాలను కాపాడుకోవడానికి మేం తలో దిక్కుకు పరుగెత్తాం. దాదాపు అర్ధగంట పాటు వారు కాల్పులు జరిపారు. కింద పడ్డ వారిని లాఠీలతో కొట్టారు’అని వివరించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఈ భూమినే సాగు చేసుకుంటున్నామనీ, తమకు ఇదే జీవనాధారమనీ, ఇప్పుడు యజ్ఞా దత్ వచ్చి తమ భూములు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. కాగా, కాల్పుల ఘటనలో 25 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. 36 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ భూమికి సంబంధించిన వివాదం కారణంగా బుధవారం ఉభా గ్రామంలో ఆ గ్రామపెద్ద యజ్ఞా దత్ మనుషులు బుధవారం గోండు జాతి గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపగా తొమ్మిది మంది మరణించడం తెలిసిందే. ఖననానికి స్థలంపై అధికారులతో వాగ్వాదం కాల్పుల ఘటనలో చనిపోయిన వారిని ఖననం చేసే స్థలంపై ఉభా గ్రామస్తులు గురువారం అధికారులతో వాదనకు దిగారు. 10 మంది మృతదేహాలను తాము వివాదాస్పద స్థలంలోనే పూడుస్తామని గ్రామస్తులు పట్టుబట్టారు. అధికారులు మాత్రం ఆ స్థలంలో వద్దనీ, సాధారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారో వీరి మృతదేహాలను కూడా అక్కడే ఖననం చేయాలని సూచిస్తున్నారు. గురువారం సాయంత్రానికి కూడా ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర శాసనమండలి కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్ర ఎస్పీ,ఎస్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై సొంతంగా విచారణ జరపాలని నిర్ణయించింది. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆరోపించింది. ఘటనా స్థలాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ బృందం పరిశీలించి, దీనిపై సుప్రీంకోర్టు చేత జ్యుడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేసింది. -
గిరిజన రైతులకూ పంట రుణాలు!
సాక్షి, అమరావతి: అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పునరుజ్జీవింపచేసి.. వాస్తవ ప్రయోజనాలను గిరిజన రైతులకు చేరువ చేసేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భూమిపై టైటిల్ పొందిన గిరిజన రైతులకు ఇతర రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వపరమైన లబ్ధి చేకూరేలా గిరిజన సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసింది. దీనివల్ల అటవీ హక్కుల చట్టం ప్రకారం టైటిల్ పొందిన రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు మైదాన ప్రాంతాల్లోని రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందగలిగేలా వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. అపహాస్యం పాలైన అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని గత ప్రభుత్వాలు కాలరాసిన ఫలితంగా ఎస్టీ, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007) అపహాస్యమైంది. అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో ఆమోదం పొందింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అన్ని అటవీ ప్రాంతాలకు వర్తింపచేశారు. గిరిజనులను గుర్తించి వారికి భూమిపై టైటిల్ హక్కును ఇచ్చారు. అయితే, వారికి భూమి ఉన్నా దానిపై రుణం రావటం లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద గిరిజన రైతులకు లబ్ధి చేకూరటం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాదాపు 96 వేల మంది గిరిజనులు భూమి పొందినా, వారిలో ఐదు శాతం మందికి కూడా సగటు రైతులకు లభించే హక్కులను పొందలేకపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు భూమిపై అన్ని హక్కులు కల్పిస్తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అటవీ హక్కుల చట్టం అమలుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫలితంగా పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులు, ప్రభుత్వ పథకాలు లభిస్తాయి. ఇకపై బ్యాంకులు సైతం గిరిజనులకు పంట రుణాలు అందిస్తాయి. -
ఆ భూములు రైతులకు అప్పగింత
రాయ్‌పూర్ : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా చత్తీస్‌గఢ్‌లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాల మాఫీ ప్రకటించగా, ఇతర హామీల అమలుపైనా కసరత్తు సాగిస్తోంది. టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం బస్తర్‌లో గిరిజన రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వారికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం భూపేష్ బాగేల్ యోచిస్తున్నారు. భూసేకరణ జరిగిన ఐదేళ్లలోగా ప్రాజెక్టులు ప్రారంభించని చోట ఆయా భూములను తిరిగి సొంతదారులకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌గఢ్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్రాజెక్టు సైతం ముందుకు కదలకపోవడంతో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ఆయా రైతులకు అప్పగించే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి తదుపరి కేబినెట్ సమావేశంలోగా తనకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ అధికారులకు సూచించినట్టు సమాచారం. 2005లో అప్పటి బీజేపీ ప్రభుత్వం బస్తర్ జిల్లాలోని లోహన్దిగుడ ప్రాంతంలో రూ 19,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం టాటా స్టీల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రాజెక్టు కోసం గిరిజనుల నుంచి భూ సేకరణ ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. మొత్తం పదిగ్రామాల నుంచి 1764 హెక్టార్ల భూమిని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సేకరించింది. ఇక భూసేకరణపై వివాదం నెలకొనడంతో 1707 మంది రైతులకు గాను 1165 మంది రైతులు తమకు ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని అంగీకరించారు. మిగిలిన రైతుల పరిహారాన్ని రెవిన్యూ డిపాజిట్ ఫండ్ వద్ద ప్రభుత్వం జమ చేసింది. ఇక 2016లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోకముందే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. భూసేకరణలో జాప్యం, మావోయిస్టుల బెదిరింపులు వంటి పలు కారణాలు చూపుతూ ప్రాజెక్టు నుంచి విరమించుకుంటున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. కాగా సేకరించిన భూమిని తిరిగి సొంతదారులకు అప్పగించాలని అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
అరుదైన చిరుధాన్యం.. సికియా!
అరుదైన అతిచిన్న చిరుధాన్యం ‘సికియా’ మధ్యప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది. బైగా గిరిజన రైతులు సికియా విత్తనాలను భోపాల్‌లో విత్తన జీవివైవిధ్య ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాళ్లు దీన్ని సికియా అని పిలుస్తున్నారు. సంప్రదాయ విత్తద్యోమకారుడు నరేశ్ బిస్వాస్ ఈ చిరుధాన్యాన్ని వ్యాప్తిలోకి తేవడానికి శ్రమిస్తున్నారు. సికియా ధాన్యం నుంచి బియ్యం తయారు చేసుకుని సామల(లిటిల్ మిల్లెట్స్) మాదిరిగానే బైగా గిరిజనులు అన్నం వండుకుని తింటున్నారు. ఇది మన ప్రాంతాల్లో కూడా ఉండేదా? ఉంటే, మన పూర్వీకులు ఏమని పిలిచేవాళ్లు? ఇప్పటికి ఇవి జవాబుల్లేని ప్రశ్నలే. ఇది అడవి జాతి రాగి మాదిరిగా ఉందని సహజ సమృద్ధ డైరెక్టర్ (బెంగళూరు) కృష్ణప్రసాద్ తెలిపారు. ఇందులో పీచు, పిండిపదార్థాల వంటివి ఏ మోతాదులో ఉన్నాయో ప్రభుత్వ పరిశోధనా సంస్థలు అధ్యయనం చేయాలన్నారు. సికియా విత్తనాల కోసం.. Email: sahajaseeds@gmail.com -
గిరి సీమల్లో కొబ్బరి సిరులు
అమలాపురం: మైదానంలో డెల్టా ప్రాంతాలకు.. మెట్టలో సాగునీటి సౌలభ్యమున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొబ్బరి సాగు.. ఇకనుంచీ కొండకోనల్లోనూ జోరుగా సాగనుంది. గిరి సీమల్లో సిరులు కురిపించడం ద్వారా గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. మొట్టమొదటిగా తూర్పు కనుమల్లో విశాఖ మన్యంలో కొబ్బరి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీసీఆర్‌ఐ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విశాఖ మన్యంలో 100 ఎకరాలకు సరిపడే కొబ్బరి మొక్కలను గిరి రైతులకు అందించనుంది. అన్నీ సవ్యంగా సాగితే విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొబ్బరిసాగుకు సీపీసీఆర్‌ఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొండ ప్రాంతాల్లో సాగుకు చేయూత.. కొబ్బరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేరళే. అక్కడ పశ్చిమ కనుమల విస్తీర్ణం ఎక్కువైనప్పటికీ కొబ్బరి సాగు పెద్దఎత్తున సాగుతుండడం విశేషం. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లోని మైదాన, మెట్ట ప్రాంతాల్లో సుమారు 3.01 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కేరళలో వర్షపు నీటిని నిల్వ చేయడం.. బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్), ఆచ్ఛాదన(మల్చింగ్) విధానాలతో కొండ ప్రాంతాల్లో కొబ్బరిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించి.. వాటి ద్వారా నీటిని మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇదే విధానంతో రాష్ట్రంలోనూ కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కేరళలోని కాసర్ఘోడ్లోని సీపీసీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం ముందుకొచ్చింది. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాలెం చౌడప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా విశాఖ మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఎంపిక చేసిన రైతులకు వచ్చేనెలలో ఆరువేల కొబ్బరి మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున వంద ఎకరాల్లో కొబ్బరితోట సాగు చేసేలా గిరిజన రైతులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలతోపాటు కాపు వచ్చేవరకు ఎరువులు, బిందు సేద్యం పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తెస్తారు. కొబ్బరిలో కోకో, పోక, ఏజెన్సీలో సాగు జరిగే కాఫీ, డ్రాగన్ ఫ్రూట్, అనాస వంటి పంటల్నీ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఇక్కడ సాగు విజయవంతమైతే.. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తారు. నీరు నిల్వ చేస్తూ.. కొండలపై సాగు చేస్తూ... కేరళ రైతులు వర్షం రూపంలో పడిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నీటిని నిల్వ చేసుకోవడం, దానిని తోటలకు మళ్లించడం ద్వారా అక్కడి రైతులు సముద్ర తీరప్రాంతమైన ఇసుక నేలలు, కొండవాలు ప్రాంతాల్లోనూ కొబ్బరి పంటను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇళ్లు, ఇతర భవంతులపై పడే వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులకు మళ్లించి.. దీన్నుంచి డ్రిప్ ద్వారా కొబ్బరి, ఇతర మొక్కలకు నీటిని ప్రవహింపచేస్తున్నారు. ఇదే రీతిలో కొండవాలు ప్రాంతాల్లో పడే వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నీరు ట్యాంకులోకి వెళ్లేందుకు అనువుగా గట్లు వేస్తూ.. ట్యాంకులోకి నీరు వెళ్లేచోట అడుగున వెడల్పుగా బ్లాక్‌మెటల్ వేస్తారు. తొలుత ఇళ్లు, భవనాలన ఉంచి వచ్చే నీటిని, తరువాత దిగువన నిర్మించిన ట్యాంకు నీటిని కొబ్బరి సాగుకోసం వినియోగిస్తున్నారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం... ఏజెన్సీలో కొబ్బరిసాగు చేస్తే గిరి రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందుతారు. కాఫీ, మామిడి, జీడి మామిడి కన్నా కొబ్బరి ఎక్కువకాలం పంట. నెలనెలా దిగుబడి రూపంలో ఆదాయం వస్తుంది. కొబ్బరితోపాటు దీనిలో విలువైన అంతర పంటలను కూడా సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాగుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాం. కేరళ తరహాలోనే బిందు సేద్యం పద్ధతిలో ఏజెన్సీలోనూ కొబ్బరిసాగు చేయవచ్చు. –పాలెం చౌడప్ప, డైరెక్టర్ సీపీసీఆర్‌ఐ, కాసరఘోడ్, కేరళ -
అటవీ భూములకూ ‘పెట్టుబడి’ సొమ్ము
సాక్షి, హైదరాబాద్ : అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు కూడా ‘రైతుబంధు’పథకం కింద పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. వాటిని ఏళ్ల తరబడి ఆ గిరిజన రైతులే సాగు చేసుకుంటున్నారు. రెవె న్యూ శాఖ నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో ఈ భూములను వ్యవసాయ భూములుగా పరిగణించకుండా బీ కేటగిరీ వివాదాస్పద భూములుగా గుర్తించింది. ఈ భూములకు పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదని ప్రభుత్వం భావించింది. గిరిజనుల నుంచి ఒత్తిడి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విన్న పాలతో ప్రభుత్వం అటవీ యాజమాన్య హ క్కు పత్రాలున్న భూములకు కూడా పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతుల వద్ద యాజమాన్య హక్కు పత్రాలు లేకపోవడంతో వారికి పెట్టుబడి సొమ్ము అందే పరిస్థితి కనిపించడం లేదు. అటవీ యాజ మాన్య హక్కు పత్రాలున్న రైతులకు కూడా వచ్చే నెల 10 నుంచే చెక్కుల పంపిణీ ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రత్యేకంగా చెక్కుల ముద్ర ణ చేపడతామని వ్యవసాయ శాఖ తెలిపింది. -
దేవాలయ భూముల్లో లొల్లి
-
దేవుడి భూముల్లో లొల్లి
భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఉద్రిక్తత - 50 ఎకరాల్లో ఆదివాసీల పంటలు ధ్వంసం చేసిన అధికారులు - 20 ట్రాక్టర్లతో వరి, మిర్చి పంటల తొలగింపు - ఎదురుతిరిగిన ఆదివాసీలు.. విల్లంబులు, కారంతో ప్రతిఘటన అన్నపురెడ్డిపల్లి: అవి దేవాలయ భూములు.. ఆదివాసీలు అందులో పంటలు సాగు చేశారు.. అక్రమం అంటూ అధికారులు పొలాలపై పడ్డారు.. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చి సుమారు 50 ఎకరాల్లో వరి, మిర్చి పంటలను 20 ట్రాక్టర్లతో తొక్కించేశారు! విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారంతో ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికారగణం.. అన్నపురెడ్డిపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 2,308 ఎకరాల భూములు అగ్రహారంగా ఉన్నాయి. అందులో తొట్టిపంపు గ్రామానికి చెందిన ఆదివాసీలు 645 ఎకరాల్లో, గిరిజనేతరులు మరో 684 ఎకరాల్లో కౌలు సేద్యం చేస్తున్నారు. అయితే 1996–97 నుంచి ఆదివాసీలు కౌలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కొందరు ‘ఆదివాసీ సేన ఉద్యమం’పేరిట గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న దేవాలయ భూముల్లో పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో ఘర్షణలు జరగడంతో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇరువర్గాలతో చర్చించారు. ఎంజాయ్మెంట్ సర్వే జరిగే వరకు సదరు భూముల్లోకి రెండు వర్గాల వారు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివాసీలు వెంకన్నస్వామికి చెందిన అన్నదైవం ప్రాజెక్ట్ ఆయకట్టులోని సుమారు 50 ఎకరాల భూముల్లో సేద్యం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆ పంటలను ధ్వంసం చేయాలని అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెళ్లి పంటలను తొక్కించేశారు. విల్లంబులు ఎక్కుపెట్టిన ఆదివాసీలు.. తమ పంటలను ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారం తీసుకుని పొలాల్లోకి వచ్చారు. పంటల్ని నాశనం చేయొద్దంటూ అధికారులపై ఎదురుతిరిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఆదివాసీలు అధికారులపై విల్లంబులు ఎక్కుపెట్టారు. కారం చల్లుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఘర్షణ అనంతరం పోలీసులు 62 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకుని చండ్రుగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు పర్యవేక్షణలో జూలూరుపాడు, పాల్వంచ, అశ్వారావుపేట, కొత్తగూడెం సీఐలు, పది మంది ఎస్సైలు, 70 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, మరో 100 మంది పోలీసులు, 40 మంది అటవీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
రైతులపై సీఎం కక్షపూరిత ధోరణి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి కూసుమంచి: ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం ముందుకు సాగవు.. అని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కానీ, ఆయన మాత్రం రైతాంగం పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలోని ధర్మాతండా వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తిచేలను ఆయన పరిశీలించారు. గిరిజన రైతులు జర్పుల కృష్ణ, శివతో మాట్లాడారు. పత్తికి పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఏడాది పంటలు బాగాలేవు. కల్తీ విత్తనాలు, వర్షాలతో దెబ్బతిన్నాయి. పంటలు పోతుంటే ఏ మంత్రి, అధికారి కూడా వచ్చి చూడటం లేదు’ అని వాపోయారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న రైతులకు కష్టాలే మిగులుతున్నాయని ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి అన్నారు. -
ప్రజల అభీష్టం మేరకే జిల్లాల విభజన
రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సంస్థాన్ నారాయణపురం/మంచాల: జిల్లాల, మండలాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకే జరగాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా రాచకొండ అటవీ ప్రాంతంలో గిరిజనుల భూమిగోస అధ్యయన యాత్రలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు పునర్విభజన చేయూలన్నారు. రాచకొండలో గిరిజన రైతులు నాలుగు తరాలుగా ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ న్యాయపరంగా పట్టా హ క్కులు పొంది గతంలో రుణాలు కూడా పొందారని, కానీ ప్రస్తుతం ఆ రైతులకు ఆన్లైన్ పహాణీలు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో రుణాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం.. వాటిని లాక్కోవడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. -
పెరిగిపోతున్న గిరిజన రైతుల ఆత్మహత్యలు
ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాష్ట్రంలో గిరిజన రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని లంబాడా హక్కులభేరి రాష్ట్ర కార్వనిర్వాహక అధ్యక్షుడు చంద్రానాయక్ ఆరోపించారు. గుంటూరులో మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన దినోత్సవ సభలో ప్రజాప్రతినిధుల ఎదుట గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను వెళ్లగక్కారు. రాష్ట్రంలో ఎస్సీల కంటే ఎస్టీలు ఎంతో వెనుకబడిఉన్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరులోనూ ఎస్టీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ నిరాదరణ కారణంగా గిరిజనులు దీనావస్థలో మగ్గుతుండగా, ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని చెబుతున్న పథకాల ఫలాలు గిరిజనులకు చేరనీయకుండా దళారులే లబ్ధి పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన తండాల్లో తాగునీటి సదుపాయం, పిల్లలను చదివించేందుకు పాఠశాలలు లేక, కనీస సదుపాయాలకు నోచుకోని దుర్భర పరిస్థితుల్లో గిరిజనులు మగ్గుతున్నారన్నారు. రాష్ట్రంలో తమ సామాజికవర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, నామినేటెడ్ పదవుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు సముచిత స్థానం కల్పించకుండా దినోత్సవాలు నిర్వహించడం వలన ప్రయోజనం శూన్యమని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
ముంపునకు గురవుతున్న పంటలు
భారీగా నష్టపోతున్నామని రైతుల మొర బషీరాబాద్: కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో నష్టపోతున్నామని మంగళవారం గిరిజన రైతులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మండలంలోని కుప్పన్‌కోట్ గ్రామానికి చెందిన గోవిందప్ప, హీర్యానాయక్, మున్యానాయక్, శివ్యానాయక్ల తదితర రైతులు మండల కార్యాలయాల్లో ఉన్న అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రమీలకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 30లో ఉన్న 14.39 ఎకరాల పట్టా భూమిలో పండిస్తున్న పెసర, కంది పంటలు కుంటలో నిలిచిన నీటి కారణంగా ముంపునకు గురయ్యాయని అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేదని ఎంపీడీఓ రైతులకు తెలిపారు. అనంతరం రైతులు తహసీల్దార్ తులసీరాంను కలిశారు. రైతులు తమ గోడును వినిపించారు. కుంటలు చెరువులు ఉన్న చోట్ల పంటలు వేయవద్దని, చెరువుల్లో నీరు లేనప్పుడే పంటలను సాగు చేయాలని తహసీల్దార్ రైతులకు చెప్పారు. తమ పంటలను పరిహారం అందించాలని రైతులు కోరడంతో.. వర్షాకాలంలో పంటలు వేసుకోవద్దని తెలిసిన ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు. కుంటలో ఉన్న నీటిని తోడేసి పంటలను కాపాడుకుంటామని రైతులు అడిగారు. కుంటలో ఉన్న నీటిని తొలగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు చెప్పారు. -
దళారుల చేతికి కాఫీ
తోటలకు పట్టాలులేక కాఫీ ప్రాజెక్టులో సభ్యత్వానికి దూరం సగం ధరకే దళారులకు అమ్ముకుంటున్న వైనం గిట్టుబాటు లేక నష్టపోతున్న కాఫీ రైతులు హక్కు పత్రాలు లేవనే సాకుతో కొందరు గిరిజన రైతుల నుంచి కాఫీని జీసీసీ కొనుగోలు చేయడం లేదు. దీంతో వారికి దళారులే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి జీసీసీ ప్రకటించిన ధరల్లో సగం కూడా ఇవ్వడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంతకు అమ్ముకుంటూ గిరిజన రైతులు భారీగా నష్టపోతున్నారు. చింతపల్లి/గూడెంకొత్తవీధి : విశాఖ మన్యంలో గిరిజన రైతులు పండించిన కాఫీకి బయట మార్కెట్లో గిట్టుబాటు ధరలు దక్కడంలేదు. కాఫీ ప్రాజెక్టులో భాగంగా గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న కాఫీకి మంచి ధరలు ప్రకటించి నప్పటికీ కొంత మంది రైతుల తోటలకు హక్కు పత్రాలు (పట్టాలు) లేక పోవడం వలన ప్రాజెక్టులో సభ్యులుగా చేరే అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలా మంది రైతులు దళారులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 వేల టన్నుల కాఫీ ఉత్పత్తి విశాఖ ఏజెన్సీలో గిరిజన రైతులు సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 6 వేల టన్నులు కాఫీ ఉత్పత్తి అవుతుంది. కాఫీ సాగుకు ఐటీడీఏ ప్రోత్సహం అందిస్తున్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించక పోవడం వలన, రైతులు దళారులపై ఆధారపడుతూ వారు నిర్ణయించిన ధరలకే అమ్ముకునేవారు. గిరిజన రైతుల కాఫీకి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టును నెలకొల్పింది. గిరిజన రైతులు నేరుగా జాతీయ మార్కెట్లో విక్రయించుకోలేరు కాబట్టి, గిరిజన సహకార సంస్థ ద్వారా రైతుల కాఫీని సేకరిస్తోంది. నర్సీపట్నంలోని ఏపీఎఫ్డీసీ క్యూరింగ్ కేంద్రంలో నాణ్యమైన పప్పు తయారు చేసి ఆక్షన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు నిర్ణయించింది. నాణ్యమైన కాఫీ త యారి, రవాణకు అయ్యే ఖర్చులన్నీ ఐటీడీఏ భరిస్తుంది. ప్రాజెక్టులో సభ్యత్వం పొందిన రైతులు మాత్రమే జీసీసీ ద్వారా విక్రయించునే అవకాశం కల్పించారు. సభ్యత్వం పొందేందుకు కాఫీ తోటలకు సంబంధించిన పట్టాలు, బ్యాంకు ఎకౌంట్, ఆధార్ కార్డు నెంబర్లు అధికారులకు అందజేయాలి. చాలా మంది రైతులకు కాఫీ తోటల పట్టాలు లేక సభ్యత్వానికి దూరమయ్యారు. జీసీసీ కిలో చెర్రీ రూ.92, పార్చిమెంటు రూ.180 గా ధరలు ప్రకటించింది. సరకు అప్పగించిన రైతుకు ముందుగా సగం సొమ్ము అకౌంటులో జమచేస్తారు. ఆక్షన్ వేసిన తరువాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఆక్షన్‌లో ఇంతకంటే ఎక్కువ ధరలు పలికితే ఆ సొమ్ము కూడా రైతుకే చెల్లిస్తారు. తక్కువ పలికితే ఐటీడీఏ భరిస్తుంది. దళారులు కిలో చెర్రీ రూ.45, పప్పు 80కి మించి కొనుగోలు చేయడం లేదు. కళ్ల ముందే జీసీసీ మంచి ధరలకు కొనుగోలు చేస్తున్నా కాఫీ తోటలకు పట్టాలు లేక వేలాది మంది రైతులు తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. -
మూడో విడత నిరాశే !
ఆరుగాలం కష్టపడడమే తప్ప.. ఎవరికీ హాని తలపెట్టడం తెలియని గిరిజన రైతులతో సర్కార్ ఆటలాడుతోంది. ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రుణమాఫీలో ప్రభుత్వం మూడో విడతలోనూ గిరిజన రైతులకు మొండిచేయి చూపడంతో లబోదిబో మంటున్నారు. మొదటి, రెండో విడతలో ఎలాగు రుణమాఫీ జాబితాలో పేర్లు లేవు. కనీసం మూడో విడతలోనైనా పేర్లు ఉంటాయనుకుంటే అది కూడా నిరాశేమిగిలిందని గిరిపుత్రులు వాపోతున్నారు. - ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలకు మాఫీ లేదు - ఆందోళనలో గిరిజన రైతులు సీతంపేట: రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న గిరిపుత్రులు ఇటీవల వచ్చిన జాబితాను చూసి నివ్వెరపోయారు. రెండో విడతలో కేవలం 24 మంది రైతుల పేర్లు మాత్రమే రుణమాఫీలో ఉండడంతో అప్పట్లో కంగుతిన్నారు. మూడో విడత కోసం ఏదురు చూసి గిరిజన రైతులంతా ఆందోళన చెందుతున్నారు. సీతంపేట మండలంలో పదివేల మంది రైతులు ఉన్నారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రుణాలు తీసుకున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు, ఎస్వీజీబీ, ఎస్బీఐ, కుశిమి ఇండియన్ బ్యాంకులల్లో వీరంతా రుణాలు పొందారు. మొదటి విడతలో కేవలం 445 మందికి రుణమాఫీ అయ్యింది. అదికూడా ఒకొక్కరికీ రూ. 10 వేల లోపే. రెండోవిడతలో మరో 24 మందికి మాత్రమే మాఫీ వర్తించింది. తాము ఖరీఫ్ రుణం 2012లో తీసుకున్నప్పటకీ ఇప్పటి వరకు రూపాయి కూడా మాఫీ కాలేదని అక్కన్నగూడకు చెందిన సుక్కయ్య, జమ్మయ్య, లక్కమ్మ, సరస్వతి సవరబోయడు, సవర ముంజు, తిక్కమై తదితరులు వాపోతున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం. ఉద్యానవన పంటల రైతులకు మాఫీ లేనట్టేనా? గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన రైతులకు రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఏజెన్సీలో ఎక్కువగా కొండపోడు పంటలే ఆధారంగా జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు రూ.30 వేల లోపే రుణం తీసుకున్నారు. ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి చెందుతున్నారు. శంబాం, కోడిశ, కుశిమి, కడగండి, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్ల పంచాయతీల పరిధిలో రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మూడో విడతలో ఎవరి పేర్లూ రుణమాఫీ జాబితాలో లేవని స్పష్టం చేశారు. ఉద్యానవన పంటలకు మాఫీ వస్తే చాలా మందికి వర్తిస్తోందన్నారు. నిరాశే మిగిలింది గిరిజనులకు నిరాశేమిగిలింది. రెండు విడతల్లో రుణమాఫీ జరగలేదు. కనీసం మూడో విడతోనైనా జరుగుతుందని ఎదురు చూసిన రైతాంగానికి న్యాయం జరగలేదు. కొండపోడు పట్టాలకు రుణమాపీ తప్పనిసరిగా చేయాలి. - సవరగోపాలు, సర్పంచ్, సోమగండి ఖరీఫ్ సాగేలా చేయాలి రుణమాఫీ జరగకపోవడంతో ప్రస్తుతం వరిపంటను ఎలా పండించాలి. మిగతా పంటలు కూడా పండించలేని పరిస్థితి ఉంది. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి. - సవర బెన్నడు, అక్కన్నగూడ, గిరిజన రైతు -
గిరి రైతులకు మొండిచెయ్యి!
సీతంపేట:రుణమాఫీ.. ఈ మాట వింటే గిరిజన రైతులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత లేనిపోని ఆంక్షలతో రైతుల సహనాన్ని పరీక్షిస్తుండడమే దీనికి కారణం. చాలామంది రైతులకు అసలు రుణమాఫీయే వర్తించలేదు. ఇదే కోవకు చెందుతారు ఉద్యానవన పంటలను సాగుచేసే గిరిజన రైతులు. రుణమాఫీ విషయంలో వీరికి టీడీపీ సర్కార్ మొండిచెయ్యి చూపించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. మొదటి విడత జాబితాలో వీరి పేర్లు లేకపోవడంతో రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. తీరా ఈ జాబితాలో కూడా పేర్లు లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గిరిజనులు ఉద్యానవన పంటలను సాగు చేసుకొని బతుకు బండిని ఈడుస్తున్నారు. ఒక్క సీతంపేట మండలంలోనే సుమారు పది వేల మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరంతా కొండపోడు పంటలైన జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కేవలం ఖరీఫ్ వరిపై రుణాలు తీసుకున్నట్టుగా జాబితాలో ఉన్న 445 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యూరుు. వీటికి కూడా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు గిరిజన రైతులు వాపోతున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో దాదాపు 1400, ఎస్వీజీబీలో 1200, కుశిమి ఇండియన్ బ్యాంకులో రెండు వేలకు పైగా రైతులు రుణాలు తీసుకున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం. 8 పంచాయతీల్లో ఒక్కరికీ రుణమాఫీ లేదు... సీతంపేట ఏజెన్సీలో 8 పంచాయతీలున్నాయి. వీటిలో కనీసం ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. శంభాం, కోడిశ, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్లలలో ఒక్కరైతుకూ రుణమాఫీ వర్తించలేదు. సామరెల్లి, పుబ్బాడలలో అయితే పంచాయతీకి ఇద్దరికి చొప్పున రుణమాఫీ అరుుంది. ఏజెన్సీలో రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు కేవలం రూ.30 వేలు లోపే రుణాన్ని తీసుకున్నారు. అయితే ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ జరిగిందని, ఇప్పుడు అసలు మాఫీ జరగకపోవడమేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయూన్ని మండల వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కేవలం వరి పంటకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని, ఉద్యానవన పంటలకు రాలేదని స్పష్టం చేశారు. పోడు పట్టాలపై ఇచ్చిన రుణాలకు మాఫీ చేయాలి కొండపోడు పట్టాలకు రుణమాఫీ తప్పనిసరిగా చేయాలి. లేకపోతే గిరిజన రైతులు ఇబ్బంది పడతారు. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నారు. వడ్డీలు చాలా పెరిగిపోయి రుణాలు తడిపిమోపెడయ్యాయి. వీటిపై ప్రభుత్వం స్పందించాలి. - సవరగోపాల్, సర్పంచ్, సోమగండి ఆశ నిరాశ చేశారు నేను ఐదేళ్ల క్రితం బ్యాంకు నుంచి రూ.8 వేలు తీసుకున్నాను. అయితే వడ్డీతో పదివేలు దాటిపోయింది. రుణమాఫీ అంటే అందరికీ చేస్తారనుకున్నాం. గిరిజన రైతులకు అన్యాయం చేశారు. మేమంతా కేవలం కొండపోడుపైనే ఆధార పడి జీవిస్తారనేది ప్రభుత్వం గమనించాలి. - సవర తిక్కమై, గిరిజన మహిళ -
ఒలికిన కాఫీ
తగ్గిన దిగుబడులు గిట్టుబాటు ధరపైనే రైతుల ఆశలు ఏజెన్సీలో కొనుగోలు మొదలు {పారంభ ధర రూ.110లు పాడేరు : ఏజెన్సీలో గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న కాఫీ పంటను ఈ ఏడాది హుద్‌హుద్ తీవ్రంగా నష్టపరిచింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఏజెన్సీవ్యాప్తంగా 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో 96 వేల ఎకరాల్లోని పంట ఫలాశయాన్ని ఇస్తున్నది. ఏటా 6వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు సేకరించి అమ్ముతున్నారు. అయితే ఈ ఏడాది 15,066 హెక్టార్లలో పంట ధ్వంసమైనట్లు అధికారులు నిర్ధారించారు. 50 శాతం లోపు నాశనమైన కాఫీ పంట మరో 5 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ కారణంగా దిగుబడులు భారీగా తగ్గాయి. మన్యమంతటా 3వేల టన్నుల లోపే దిగుబడులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ అంతటా కాఫీ పండ్ల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పల్పింగ్ పూర్తయి బాగా ఎండాక కాఫీ గింజలు అమ్ముతారు. అప్పుడే కొందరు గింజలను వారపు సంతలకు తెస్తున్నారు. కిలో రూ.100 నుంచి రూ. 110లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గినందున రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీలకు నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు మార్కెట్లో కాఫీ ధరలు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్, వియత్నాం దేశాల్లో దిగుబడులు బాగుండటంతో విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు డిమాండ్ కూడా తక్కువగా ఉందని వి.మాడుగులకు చెందిన కాఫీ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది ప్రారంభంలో కిలో రూ.100లకు కొనుగోలు చేశారు. అప్పట్లో బెంగళూరు మార్కెట్లో డిమాండ్ మేరకు సీజన్ చివరిలో కిలో రూ.200లకు అమ్ముడుపోయాయి. ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థలు కాఫీ గింజలను గిట్టుబాటు ధరకు ఏర్పాట్లు చేయాలని, దళారుల మోసాల నుంచి కాపాడాలని గిరిజన కాఫీ రైతులు కోరుతున్నారు. -
నీళ్లు పోశామంటూ కోట్లు నొక్కేశారు
కంచే చేను మేసిందన్న సామెతను మన్యంలో ఉపాధి హామీ పథకం అధికారులు నిజం చేశారు. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎంచక్కా నొక్కేశారు. ఇందుకోసం అన్ని స్థాయిల ఉద్యోగులూ కుమ్మక్కయ్యారు. పక్కాగా రికార్డులు చూపించారు. కోట్లు దిగమింగేశారు. ఏడు నెలల కాలంలో జరిగిన ఈ అవకతవకల విలువ ఐదారు కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశీలనలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :గిరి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గత ఏడాది ఉపాధి హామీ పథకంలో జీడిమామిడి తోటల పెంపకం చేపట్టింది. దీనికింద రంపచోడవరం డివిజన్లో మొక్కల పెంపకం, పోషణ కోసం 2013 ఏప్రిల్ నుంచి గత అక్టోబర్ వరకూ రూ.18.16 కోట్లు విడుదల చేసింది. ఏజెన్సీలోని 11,302 మంది రైతులకు చెందిన 16,883 ఎకరాల్లో ఈ పథకం కింద జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున నిధులు వచ్చాయి. పంపిణీ చేసిన మొక్కల పెంపకానికి ప్రతి నెలా రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడేళ్లపాటు సొమ్ము జమ చేయాలి. ఎకరానికి 70 మొక్కలు ఇచ్చారు. వాటిలో 40 మొక్కలు బతికితే కనుక నాటడం, గోతులు తియ్యడం, చుట్టూ గూడు కట్టడంవంటి పనుల కోసం నెలకు రూ.1050 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే మొక్కలకు నీరు పోసేందుకు జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలల కాలానికి ఎకరాకు రూ.6వేలు ఇవ్వాలి. ఇందుకోసం రూ.10.12 కోట్లు వచ్చాయి. ఈ నిధులు నొక్కేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు కుమ్మక్కయ్యారు. గత ఏడాది ఇచ్చిన మొక్కలకు నీరు పోయకుండానే పోసినట్టుగా పక్కా రికార్డులు తయారుచేసి విడుదలైన నిధుల్లో అందిన కాడికి దిగమింగేశారు. నీరు పోయని జీడిమామిడి తోటలకు సైతం గిరిజనులతో అవసరమైనచోటల్లా సంతకాలు పెట్టించుకొని సొమ్ములు నొక్కేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి విడుదలయ్యే నిధులను మొదట రైతుల ఖాతాలో జమ చేశారు. ఆనక ఆ సొమ్ములు డ్రా చేసి ‘మీకింత-మాకింత’ అనే ముందస్తు ఒప్పందం మేరకు పంపకాలు జరిపించేశారు. ఎకరం తోటకు ఉపాధి సిబ్బందికి రూ.4వేలు, రైతులకు రూ.2వేలు చొప్పున పంపకాలు చేపట్టారు. కొన్నిచోట్ల రెండెకరాల తోట ఉన్న రైతులతో జరిగిన ఒప్పందం ప్రకారం యంత్రాంగానికి రూ.6వేలు, రైతుకు రూ.6వేలుగా పంచేసుకున్నారు. మొత్తంగా లెక్కేస్తే అన్ని స్థాయిల సిబ్బంది కలిపి దాదాపు రూ.5 కోట్లు పైగానే భోంచేశారు. వై.రామవరం మండలం చామగెడ్డ పంచాయతీలో 200 ఎకరాల్లో జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ 100 ఎకరాల్లో కూడా నీరు పోయలేదని చెబుతున్నారు. మిగిలిన 100 ఎకరాలకు సంబంధించి విడుదలైన రూ.10 లక్షల్లో ఉపాధి అధికారులు, సిబ్బంది రూ.6 లక్షలు దిగమింగి, మిగిలిన రూ.4 లక్షలు రైతులు, బ్రోకర్లకు ముట్టజెప్పారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఏపీఓ, ఏపీడీ వరకూ కుమ్మక్కై ఒక్కో రైతు నుంచి ఆరేడు వేల వంతున నొక్కేశారు. చామగడ్డ, బండిగెడ్డ గ్రామాల్లో రైతుల నుంచి ఒక క్షేత్రస్థాయి ఉద్యోగి రూ.5 లక్షలు జేబులో వేసుకున్నాడు. అడ్డతీగల మండలం ఎల్లవరం, రంపచోడవరం మండలం రంప గ్రామాలను పరిశీలిస్తే.. ఒక్కో గ్రామంలో 10 మంది లబ్ధిదారులున్నారు. తమలో ఒక్కరికి కూడా సొమ్ములు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు కోసం అన్నట్టుగా కొందరి ఖాతాల్లో సొమ్ము వేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన సొమ్ములో యంత్రాంగం చేతివాటం చూపించింది. పెదగెద్దాడలో 66 మంది రైతులకు 74 ఎకరాల్లో 5,180 జీడిమామిడి మొక్కలు ఇచ్చారు. వీటికి నీరు పోసేందుకు చిల్లిగవ్వ కూడా అందలేదని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, అరా గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వారికి డబ్బులు తిరిగి ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఓ స్థాయిలో ఐదుగురు కీలకపాత్ర పోషించారని తెలియవచ్చింది. ఇదే విషయాన్ని వారు అంగీకరించి, రైతులకు తిరిగి సొమ్ములు ఇచ్చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఉపాధి హామీ నుంచి విడుదలయ్యే సొమ్ము కొన్ని పంచాయతీల్లో విలేజ్ ఆర్గనైజేషన్, కొన్ని గ్రామాల్లో రైతుల ఖాతాలకే జమ అయ్యేవి. ఆర్గనైజేషన్‌లో ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళా ప్రతినిధుల చేతికి ఆ సొమ్మంతా చేరేది. అలా వారు డ్రా చేసి రైతులందరికీ అందజేసే పరిస్థితులను చాకచక్యంగా వినియోగించుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు కాజేశారు. నిబంధనల ప్రకారం నీరు పోసి ఉంటే ఏ ప్రతి నెలా సొమ్ము విడుదల చేయాలి. రైతులు ఎప్పటికప్పుడు కూలీలకు సొమ్ములివ్వాలి. ఇవ్వకపోతే రెండో రోజే వారు పనిలోకి రారు. ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్(ఎఫ్టఓ)లో ఏ రైతుకు ఎంత అనే వివరాలుంటాయి. దాని ప్రకారం పే స్లిప్పులు ఇచ్చి, వాటి ద్వారానే సొమ్ము అందజేసే క్రమంలోనే ఈ అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారు. -
గిరిజనేతర రైతులకూ మాఫీ
* ఎస్టీ ఎమ్మెల్యేల డిమాండ్‌పై సీఎం సానుకూల స్పందన * నాలుగు జిల్లాల శాసన సభ్యులు, కలెక్టర్లతో సమీక్ష * మాఫీకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు కావాలని అంచనా సాక్షి, హైదరాబాద్: గిరిజనేతర రైతులకూ పంట రుణ మాఫీ వర్తింపజేయాలన్న డిమాండ్‌పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పం దించారు. మంగళవారం అసెంబ్లీలో గిరిజన ఎమ్మెల్యేలు, నాలుగుజిల్లాల కలెక్టర్లు, సంబంధి త ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులు కూడా ఉన్నారు. అయితే వీరి పేర పట్టాలు కానీ, ఇతర రికార్డులు కానీ ఉండవు. 1/70 యాక్టు మేరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల పేరు న అధికారికంగా ఎలాంటి పంట భూములు ఉండవు. దీంతో వీరంతా రుణ మాఫీ పరిధిలోకి రాకుండా పోయారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సమస్యను గుర్తించి, ఆయా జిల్లాల కలెక్టర్లను భేటీకి పిలి పించారు. ఆ నాలుగు జిల్లాలకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పంటరుణాలిచ్చిన బ్యాంకులు.. అదే తరహాలో మాఫీ చేయాల్సిందేనని, దీనిపై బ్యాంకర్లను పిలిపించి మాట్లాడాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే ఆర్బీఐ అధికారులతో తాను మాట్లాడుతానని పేర్కొన్నట్లు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల ద్వారా తెలిసింది. మాఫీకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 2009-11 మధ్య కరువు వల్ల బ్యాంకుల్లో రీషెడ్యూలు చేసిన రుణాలను రద్దు చేయాలని, పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలివ్వాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ సమస్య, రైతుల సమస్యను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఖమ్మం కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అటవీ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. -
‘కాఫీ’ని కొల్లగొట్టిన హుద్‌హుద్
పాడేరు: హుద్‌హుద్ తుఫాన్ కాఫీ పంటను సైతం తీవ్రంగా దెబ్బతీసింది. రెండేళ్లుగా ఏజెన్సీలో కాఫీ దిగుబడులు అధికంగా ఉండటంతో గిరిజన రైతులు మంచి లాభాలను పొందారు. గత ఏడాది కాఫీ గింజల కొనుగోలు సీజన్లో కిలో రూ.120 ధరతో ప్రారంభంకాగా చివరిలో వ్యాపారులంతా పోటాపోటీగా రూ.200 ధరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనులకు కాసుల వర్షం కురిసినట్టైంది. ఏజెన్సీ వ్యాప్తంగా లక్ష 60 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలను సాగు చేస్తుండగా 96 వేల ఎకరాల్లో కాఫీ పంట ప్రతి ఏడాది ఫలసాయాన్నిస్తుంది. తద్వారా ప్రతి ఏడాది 6 వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఏజెన్సీలోని కాఫీ తోటల్లో కాపు విరగ్గాసింది. సుమారు 7 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని గిరిజన రైతులు ఆశపడ్డారు. ఈ తరుణంలో తుఫాన్ భారీగా దెబ్బతీసింది. దిగుబడులు సంగతి పక్కన పెడితే పూర్తిగా కాఫీ తోటల్లోని నిడనిచ్చే వృక్షాలు నేలకొరిగి కాఫీ మొక్కలన్నీ ధ్వంసమయ్యాయి. నీడ కరువవ్వడంతో పండ్ల దశలో ఉన్న కాఫీ గింజలు కూడా నేలరాలాయి. కొన్ని చోట్ల వాడిపోవడంతో కాఫీ పంటకు నష్టం వాటిల్లింది. వచ్చే నెలాఖరు నుంచి సీజన్ డిసెంబరు నెలాఖరు నుంచి కాఫీ గింజల కొనుగోలు సీజన్ ప్రారంభం కానుంది. కొంత మంది వ్యాపారులు ఇప్పటికే బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు అధికంగా ఉన్నాయని, ఏజెన్సీ కాఫీ గింజల ధరలు పతనం అవుతాయని ప్రచారాన్ని చేపడుతున్నారు. కిలో రూ.100కు కాఫీ గింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులను దోచుకునేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏజెన్సీలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఐటీడీఏ మాత్రం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. ఈ ఏడాదైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు. -
అండగా ఉంటాం..
దేవరకొండ/చందంపేట : ‘‘అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..’’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన గిరిజన రైతు కుటుంబానికి సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భరోసా ఇచ్చారు. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామపంచాయతీ కొర్రోనితండాకు చెందిన కౌలురైతు కొర్ర రూప్లానాయక్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా అతని కుటుంబాన్ని మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి పరామర్శించారు. రూప్లానాయక్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అతని భార్య లచ్చిని ఓదార్చారు. ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాగుకు వ్యవసాయ భూమి లేక, బతకడానికి దారిలేక అప్పులబాధ ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు లచ్చి నాయకులతో తెలిపింది. స్పందిం చిన నాయకులు తక్షణ సాయంగా ఆమెకు రూ.50వేలు అందించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిర కుటుంబానికి అందించే లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకున్నప్పటికీ అధికారులతో ఈ విషయం మాట్లాడతానని జానారెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు. రోడ్డుకు రూ.10 లక్షల జెడ్పీ నిధులు.. తండాకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోగా జానారెడ్డి పర్యటన ఖరారు కాగానే కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణం కోసం ప్రస్తావించిన జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జిల్లాపరిషత్ నిధుల నుంచి రూ. 10లక్షల వరకు కేటాయించాలని చైర్మన్ నేనావత్ బాలునాయక్‌ను కోరారు. దీనికి స్పం దించిన ఆయన అక్కడికక్కడే రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అదే విధంగా తండాలో తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని, ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరారు. వెంటనే బోరును రిపేర్ చేయించి జెడ్పీ నిధుల కింద చేతిపంపు మంజూరు చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందు యాదవ్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాన్, దేవరకొండ నగర పంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురేష్‌రెడ్డి, ముక్కమల్ల వెంకటయ్య, రవి, ఎంపీటీసీ వెంకటయ్య, బెరైడ్డి కొండల్‌రెడ్డి, లక్ష్మానాయక్, సర్పంచ్ కొత్తపల్లి కృష్ణ, ఎంపీటీసీ గిరి యాదగిరి, బిక్కునాయక్, నేనావత్ భరత్‌కుమార్, మహాలక్ష్మయ్య, కొర్ర రాంసింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ
జూలూరుపాడు : అటవీ భూముల్లో పోడు నరికి సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోగస్ పట్టాలు జారీ చేసిన వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‘డూప్లికేటుగాళ్లు’ అనే శీర్షికన ఈనెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలపై విచారణ చేపట్టాలంటూ కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ బుధారం విచారణ చేపట్టారు. బోగస్ పట్టాతో మోసపోయిన వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా సురేష్, అతని భార్య ఉమ ఆర్డీఓను కలిశారు. తాము మోసపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుగులోతు సరోజ, బాదావత్ విజయ, గుగులోతు సుజాత, భూక్యా జ్యోతి పేరు మీద ఉన్న బోగస్ పట్టాలను ఆర్డీఓ పరిశీలించారు. పట్టాపాస్ పుస్తకాలపై ఉన్నవి కలెక్టర్, భద్రాచలం ఐటీడీఓ పీఓ సంతకాలు కావని, ఇవి ఫోర్జరీ అని గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వ ముద్ర కూడా కాదని తేల్చారు. పట్టాపాస్ పుస్తకాలపై పోడు రైతు భార్యాభర్తల ఫొటోలు ఉండాలి కానీ, ఒకరిది మాత్రమే ఉందన్నారు. వీటిపై అప్పటి జూలూరుపాడు తహశీల్దారు డి.నాగుబాయి పేరుతో సంతకం చేసి ఉందని చెప్పారు. ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎవరిచ్చారని బాధిత రైతులను ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా అనిల్ ఎకరానికి రూ.10 వేలు చొప్పున తీసుకుని చేయించాడని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తుంటే మీరేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై వారు సమాధానం ఇస్తూ తమకు ఏమీ తెలియదని, అనిల్ చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామని తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, పట్టాలు తిరిగి ఇవ్వాలని కోరారు. గుగులోతు సరోజ భర్త గుగులోతు నరసింహారావు మూడెకరాలకు రూ.30 వేలు, మల్లయ్య అనే రైతు తమ పెద్ద కూతురు బాదావత్ విజయ పేరు మీద పట్టా చేసినందుకు ఐదెకరాలకు రూ.50 వేలు, చిన్న కూతురు గుగులోతు సుజాత పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇచ్చినందుకు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు, భూక్యా జ్యోతి భర్త రాంబాబు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు పట్టా పాస్ పుస్తకాల కోసం భూక్యా అనిల్‌కు ఇచ్చినట్లు వివరించారు. తమతోపాటు వినోభానగర్, ఏన్కూరు మండలంలోని అక్కినాపురంతండా, కేసుపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పట్టాలు చేయిస్తానని అనిల్ డబ్బులు తీసుకున్నాడని తెలిపా రు. దీంతో ఆర్డీఓ వీరి నుంచి స్టేట్ మెంట్‌ను రికార్డు చేయాలని తహశీల్దారు తోట విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో ఆర్ఐలు బాధిత పోడు రైతుల నుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్థానిక ఎస్సై ఎన్.గౌతమ్‌ను పిలిపించి ఈ కేసు విషయాన్ని ఆర్డీఓ చర్చించారు. కఠిన చర్యలు తప్పవు బోగస్ పాస్ పుస్తకాలు ఇప్పించిన భూక్యా అనిల్ అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆర్డీఆఓ దేశించారు. దీనికి భూక్యా అనిల్ తనపై కావాలనే తమ గ్రామానికి చెందిన ఓ పోడు రైతు వీరందరితో ఫిర్యాదు చేయించాడని చెప్పడంతో ఆర్డీఓ స్పందించారు. వీరిద్దరిని అదుపులోకి విచారించాలని, నిజ నిజాలు తెలుస్తాయని ఎస్సైతో అన్నారు. విచారణ అనంతరం ఆర్డీఓ విలేకరులతో మాట్లాడారు. పట్టా పాస్‌పుస్తకాలు బోగస్విగా గుర్తించామని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 1,090 మందికి పోడు పట్టాలు ఇచ్చామని, వీరికి 3301.73 ఎకరాలు భూమి కేటాయించామని అన్నారు. వినోభానగర్ గ్రామంలో 32.46 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ అయ్యాయని తెలిపారు. ఏనిగ్జిర్-6లో నమోదు చేసి, స్కానింగ్ కూడా జరిగిందని, అయితే ఇంకా 30 నుంచి 40 మాత్రమే నమోదు కాలేదని అన్నారు. బోగస్ పట్టా పాస్ పుస్తకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చెందిన సంతకాలు మాత్రం కావని అన్నారు. అదేవిధంగా డీఎఫ్ఓ సంతకం అవునో కాదో తనకు తెలియదని, అప్పటి తహశీల్దారు డి.నాగుబాయి సంతకం చేశారని తెలిపారు. ఖాళీ పాస్ పుస్తకాలు ఎలా బయటకు పోయాయని అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి బోగస్ పట్టా పాస్ పుస్తకాలు చాలా ఉండే అవకాశం లేకపోలేదని, పూర్తి స్థాయిలో విచారణ జరగిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. -
డూప్లికేటుగాళ్లు
సాక్షి, ఖమ్మం: అటవీ భూముల్లో పోడు నరికి వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం హక్కులు కల్పించింది. 2006 డిసెంబర్ నాటికి గిరిజనుల ఆధీనంలో ఉన్న అటవీ భూములకు సంబంధించిన అర్హులను గుర్తించారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకునే సుమారు 30 వేల మంది గిరిజన రైతులకు దాదాపు 2.10 లక్షల ఎకరాల అటవీ భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఇంకా వేలాది మంది తమకు హక్కు కల్పించాలంటూ ఆయా మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు 2010 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకున్న ఓ ముఠా అక్రమ సంపాదనే ధ్యేయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామంటూ గిరిజనులను నమ్మించింది. ఏజెన్సీ మండలాల్లో ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.10 వేలు వసూలు చేసింది. ‘ఈ పాస్ పుస్తకాలుంటే బ్యాంకుల్లో రుణాలు వస్తాయి.. ప్రభుత్వం విద్యుత్, బోర్లకు రుణాలిస్తుంది..’ అని మాయమాటలు చెప్పింది. పట్టాలు వస్తాయని గిరిజన గూడేల్లో ఒకరిని చూసి మరొకరు ఇలా వందలాది మంది గిరిజన రైతులు ఈ ముఠాకు డబ్బులు ముట్ట జెప్పారు. చాలా మంది రైతులు రూ.2, నుంచి రూ.5కు వడ్డీకి తెచ్చి మరీ ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన ముఠా రైతుల నుంచి అందినకాడికి దండుకుంది. రూ.లక్షల్లో కూడబెట్టుకుంది. జూలూరుపాడు, ఏన్కూరు, ఇల్లెందు, టేకులపల్లి, మండలాల్లో ఈ ముఠా సభ్యులు చాలా మంది రైతులను మోసం చేశారు. బయట పడిందిలా.. గత ఏడాది ఏన్కూరు మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకం బయట పడింది. అయితే అక్కడ ఉన్న అధికారులు.. ఆ ముఠా సభ్యులు కుమ్మక్కై ఈ వ్యవహారం బయటపడకుండా సదరు రైతుకు డబ్బులు ఇప్పించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ముఠా మరోసారి జూలువిదిల్చింది. జూలూరుపాడు మండలం వినోభానగర్, ఏన్కూరు మండలం అక్కినాపురంతండా, నాచారం, కేశుపల్లి, ఇమామ్‌నగర్ గ్రామాల్లోని గిరిజన రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టింది. వినోభానగర్‌కు చెందిన భూక్యా ఉమ పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు విషయం బయట పడింది. ‘ఇది నకిలీపాస్ పుస్తకం.. రుణం ఇవ్వటం కుదరదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో మోసపోయినట్లు వారు గ్రహించారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా తాము ఈ పట్టాదారు పుస్తకాలు ఇవ్వలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె ఆశలు అడియాశలయ్యాయి. గిరిజనులకు సదరు ముఠా సభ్యులు ఇస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు ఒరిజనల్ వాటిని పోలి ఉండటం గమనార్హం. తహశీల్దార కార్యాలయాల్లోని ఉద్యోగుల సహకారం లేనిదే ఇంత పకడ్బందీగా పుస్తకాలు తయారు చేయటం కుదరదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ముఠా సభ్యులు వారు వసూలు చేసిన డబ్బులో కొంత తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందికి అప్పజెప్పి ఖాళీ పాసు పుస్తకాలను తీసుకుంటున్నట్లు సమాచారం. వీటిపై తహశీల్దార్, ఐటీడీఏ అధికారుల పోర్జరీ సంతకాలు చేసి యథేచ్ఛగా గిరిజనులకు అసలువే అంటూ ఇస్తున్నారు. ఉమకు 2013లో జారీ అయినట్లుగా ఉన్న నకిలీ పట్టాదారు పాసు పుస్తకంలోనూ తహశీల్దార్, ఐటీడీఏ ఫారెస్టు అధికారుల నకిలీ సంతకాలు, ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈ ముఠాకు తహశీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందే సహకరిస్తున్నారని తెలుస్తోంది. -
కలసి పనిచేద్దాం రండి !: నాయిని నర్సింహారెడ్డి
* మావోయిస్టులకు ప్రభుత్వం ఆహ్వానం * మన ఎజెండా ఒకటే: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి * అభివృద్ధి, సంక్షేమాలతో అసమానతలు దూరం చేస్తాం * ప్రజా పోలీస్ వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడి సాక్షి,హైదరాబాద్: ‘అభివృద్ధి, సంక్షేమాలను పక్కాగా అమలు చేస్తూ కుల, మత, పేద, పెద్ద అంతరాల్లేని సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అందరి భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలోని తొలి ప్రభుత్వం వివక్ష, దాపరికం, అవినీతి లేని స్వచ్ఛమైన పాలన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సర్కార్ నిర్ణయాల్లో ప్రతివారి మనోభావాలు ప్రతిబింబిస్తాయి. అందుకే సమాజానికి దూరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థకు భిన్నంగా వ్యవహరిస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఏకం కావాలి. అందులో భాగంగానే నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలసి రావాలి’ అని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ లక్ష్యాలు ప్రాధమ్యాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదుల ఉనికి లేదని అయినా ఈ భావజాలంతో ఉన్న మేధావులు, సానుభూతిపరులు సైతం తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకుంటే వాటిని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భూమి, నీరు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వివక్ష లేకుండా ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేస్తుందని నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. దళితుల వ్యవసాయభారం సర్కారుదే దళితుల వ్యవసాయ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి చెప్పారు. మూడు ఎకరాల వరకు భూమి కలిగిన దళిత రైతుల క్షేత్రాలను సేద్యయోగ్యంగా తీర్చిదిద్ది బోరు, మోటారు ప్రభుత్వమే ఇప్పించి, సంవత్సరం పాటు నిర్వహించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వారికి తిరిగి అప్పగిస్తుందని నాయిని వెల్లడించారు. అదే విధంగా కుల, మత బేధాలు లేని పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు విద్య, ఉపాధి రంగాల్లో ముం దుండేలా చూస్తుందన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌లో ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏర్పాటు, సింగరేణిలో కొత్త గనుల తవ్వకం తదితర పనులతో భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, విద్యావంతులు ఉద్యోగం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదన్నారు. సచార్ అమలుతో.. ఇస్లామిక్ టైజానికి చెక్ విద్య, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యామన్న ఆందోళనలతో అడ్డదారి పడుతున్న మైనారిటీ యువజనాన్ని వారి కుటుంబాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని నాయిని చెప్పారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన సచార్ కమిటీ సూచనల అమలుకు రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీపడబోమని, అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రజాపోలీస్ వ్యవస్థ ఏర్పాటు పోలీసులంటే.. ప్రజామిత్రులనే నినాదాన్ని ప్రచారం చేస్తామన్నారు. పోలీసుల్లో అంకితభావం, చిత్తశుద్ధిని నింపుతూ, వారాంతపు సెలవు, కుటుంబసభ్యులతో గడిపే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నాయిని చెప్పారు. ట్రాఫిక్ సిబ్బందికి స్పెషల్ మెడికల్ అలవెన్స్ అందజేస్తామన్నారు. పోలీస్ స్టేషన్లపై ప్రస్తుతం ఉన్న అభిప్రాయాన్ని సరిదిద్దుతామన్నారు. త్వరలో 24 జిల్లాల పునర్విభజనతోపాటు పోలీస్ డివిజన్లు, స్టేషన్ల పునర్విభజన జరుగుతుందని, తగినంత సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. సీమాంధ్ర జిల్లాల నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వాన్ని వారు ఆదరించాలని నాయిని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంక్రాంతి పండుగకు సీమాంధ్రకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వమే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడినవారిలో కొందరు ఇక్కడ ఒక ఓటు, తిరిగి సీమాంధ్రలో ఒక ఓటు వేసి ఓ పార్టీ గెలుపునకు కారణమయ్యారన్న సమాచారం తమవద్ద ఉందని, అలాంటి వారు ఏదో ఒకచోట మాత్రమే ఓటును నమోదు చేసుకుంటే మంచిదని నాయిని హితవు చెప్పారు. -
వెలుగు చూస్తున్న వాస్తవాలు
రంపచోడవరం, న్యూస్‌లైన్ : గిరిజన రైతుల అమాయకత్వాని ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది, దళారులు వ్యవసాయ రుణాల పేరిట లక్షలాది రూపాయలు నొక్కేశారు. అడ్డతీగలలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ అక్రమాలకు అడ్డాగా మారింది. 2010-12 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఐఓబీ రీజనల్ ఆఫీసర్ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు వాస్తవాలు వెలుగు చూశాయి. రూ. 13.70 లక్షల మేరకు రుణాల పేరిట నిధులు పక్కదారి పట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 24న అప్పటి బ్యాంకు మేనేజర్ భాస్కరాచారి సహా మరో 19 మంది ( సిబ్బందితో పాటు దళారులు) పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఏఎస్పీ విజయారావు విచారణ నిర్వహిస్తున్నారు. బ్యాంకు అధికారులతో ఒప్పందానికి వచ్చిన దళారులు రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామని పాసు పుస్తకాలు తెచ్చి బ్యాంకులో కుదువ పెట్టారు. రూ. 50 వేలు రుణం తీసుకుంటే రైతుకు రూ. 20 వేలు ఇచ్చి, మిగిలిన సొమ్మంతా బ్యాంకు సిబ్బంది, దళారులు దిగమింగినట్టు విచారణలో రుజువైంది. రుణాలు పొందిన రైతుల పేరిట రికవరీ లేకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటిని అందుకున్న రైతులు నమోదైన అసలు రుణాలను చూసి కంగుతిన్నారు. అడ్డతీగల, వై.రామవరం మండలాల్లో ఈ విధంగా ఎక్కువ మొత్తాలు చేతులు మారినట్టు స్పష్టమైంది. నేరుగా దళారులు నకిలీ పాసు పుస్తకాలను తయారు చేసి బ్యాంకులో కుదువపెట్టి సుమారు రూ. కోటి వరకు జేబులో వేసుకున్నట్టు తెలుస్తోంది. మొల్లేరు ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత ఒక్కరే రూ.5 లక్షలు రుణాల పేరిట నొక్కేసినట్టు చెబుతున్నారు. ఆ ఒక్క ప్రాంతంలోనే 32 మంది నకిలీ పాసు పుస్తకాలు బ్యాంకులో ఉంచినట్టు తెలుస్తోంది. తవ్విన కొద్దీ అక్రమాల చిట్టా బయటపడుతుండడంతో రూ. కోట్లలోనే రుణాలు పక్కదారి పట్టినట్టు ఓ నిర్ణయానికి వచ్చిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాల్లోని ఆదర్శరైతులు, కొందరు దళారులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంలో వేటమామిడికి చెందిన ఓ ఉపాధ్యాయుడు దళారీగా మారి కీలకపాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రుణాల కోసం జామీను సంతకాలు పెట్టిన వారితో పాటు దళారులుగా వ్యవహరించిన వారిని కూడా విచారిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం : ఏఎస్పీ విజయారావు గంగవరం, న్యూస్‌లైన్ : అడ్డతీగల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్నట్టు రంపచోడవరం ఏఎస్పీ విజయరావు తెలిపారు. విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన గంగవరం పోలీస్ స్టేషన్‌కు సందర్శించారు. స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అడ్డతీగల ఐఓబీ నుంచి 16 మంది నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్టు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. రుణాల రికవరీ లక్ష్యంగా కాకుండా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందన్నారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టగా కొన్ని చిరునామాలు తెలియడం లేదని, వారి బ్యాంకు అకౌంట్ ప్రారంభం కోసం సంతకం చేసిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. విలేకర్ల సమావేశంలో అడ్డతీగల సీఐ హనుమంతరావు పాల్గొన్నారు. -
రాజ్మా చిక్కుడు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వ్యాపారులు కొనుగోలు చేయరు.. జీసీసీ పట్టించుకోదు.. దాంతో ఏజెన్సీలో రాజ్మా రైతు బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏదో ఒక ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తేనే బాగుండేదని అనుకునేటంత విషమ స్థితికి వారి సమస్య చేరుకుంది. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాజ్మా చిక్కు డు వ్యాపారం స్తంభించిపోయింది. దీంతో గిరిజన రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో గిరిజనులు రాజ్మా చిక్కుడును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సుమారు రూ. 60 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో పండించిన రాజ్మాను నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి వీటిని ఢిల్లీ, పుణె, ముంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర వంటి నగరాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది రాజ్మా పంట అంతంత మాత్రంగానే ఉంది. గిట్టుబాటు ధర మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం కిలో రాజ్మాను వ్యాపారులు రూ.48 ధరకు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారు కొనుగోళ్లను నిలిపేశారు. నర్సీపట్నం వ్యాపారులే కాక, స్థానిక వర్తకులు కూడా లావాదేవీలు ఆపేశారు. అసలు కారణం.. రాజ్మా కొనుగోలు చేసే వ్యాపారులు గిరిజనులకు భారీ ఎత్తున బకాయి పడ్డారు. గత ఏడాది చాలా మందికి పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు రంగంలోకి దిగారు. జీకే వీధికి చెందిన ఓ వ్యాపారిని మావోయిస్టులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని చెల్లిస్తానని వ్యాపారి భార్య హామీ ఇవ్వడంతో ఆమెను నిర్బంధించారు. దీంతో నర్సీపట్నం వ్యాపారులు ఈ ప్రాంతంతో కాలు మోపడానికే వెనుకాడుతుండగా స్థానిక వ్యాపారులు సైతం మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. జీసీసీ నిర్లక్ష్యం గత ఏడాది కూడా రాజ్మాను కొనుగోలు చేసిన జీసీసీ, ఈసారి మాత్రం అసలు ఆ జోలికే పోలేదు. సరకు నిల్వ ఉండిపోతోందన్న కారణం చూపి కొనుగోలు చేపట్టలేదు. దాంతో పెదపాడు, మర్రిపాకలు, అగ్రహారం, లక్కవరం, ఈతరబ్బలు, సాగులు వంటి ప్రాంతాల్లో రాజ్మా నిల్వలు పేరుకుపోయాయి. రైతులు కావళ్లతో వారపు సంతలకు మోసుకువచ్చి విక్రయించలేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో రాజ్మా చిక్కుడు వ్యాపా రం నిలిచిపోయింది. మావోయిస్టుల ఉత్సాహం గిరిజనులకు సమస్యలు తెచ్చిపెట్టింది. -
మళ్లీ కంటి తుడుపేనా?
=2011 కరువు సాయం ఎట్టకేలకు విడుదల =తాజాగా రూ.2.78కోట్లు =పెండింగ్‌లో మరో రూ.1.26కోట్లు =గిరిజన రైతులకు అందని నీలం పరిహారం =28 వేల మంది ఎదురుచూపు సాక్షి, విశాఖపట్నం: రైతన్నలను సర్కార్ ఊరిస్తోంది. నష్టపోయిన పంటకు పరిహారాన్ని కంటి తుడుపుగా విడుదల చేసింది. అది కూడా ఏళ్లు గడిచాక విదిల్చింది. ఈలోపు చేసిన అప్పులు, వడ్డీ లు పేరుకుపోయి నిలువునా అన్నదాతలు మునిగిపోయారు. 2011లో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది రైతులు పంటలను కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్‌ఫుట్ సబ్సిడీగా రూ.17.5కోట్లు విడుదల చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో సర్కార్ వెంటనే స్పందించలేదు. గతేడాది చివరిలో 96,219మంది రైతులకు రూ.13.46కోట్లు విడుదల చేసింది. తాజాగా మళ్లీ 20,364మంది రైతులకు సంబంధించి రూ.2.78 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.1.26కోట్లు మేర పెండిం గ్లో ఉంచింది. ఇక గతేడాది నీలం తుఫాన్ కారణంగానూ జిల్లా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రూ.30.24కోట్లు మేర ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఈ ఏడాది ఆరంభం, ఖరీఫ్ సీజన్‌కు ముందు రెండు విడతలుగా రూ.23కోట్లు విడుదలయ్యాయి. కానీ ఏజెన్సీలో పంట నష్టపోయిన 28వేల మంది రైతులకు సంబంధించి పైసా కూడా విదల్చలేదు. వాస్తవానికి వీరికి రూ.4.61కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ చెక్కుల రూపంలోనే పంపిణీ చేయాల్సి ఉంది. పరిహారం కోసం గిరిజనులంతా ఎదురు చూస్తున్నారు. -
అంతర పంటలతో అద్భుత లాభాలు
హుకుంపేట, న్యూస్‌లైన్: అంతర పంటలతో అద్భుత లాభాలు సాధిస్తున్నారు మాలీ తెగ గిరిజన రైతులు. అరకు నియోజక వర్గంలోని దోడిపుట్టు, మాలీవలస, పనసవలస, కండ్రుం, సోవ్వా తదితర గ్రామాల్లోని ప్రతి రైతు తమకున్న భూమిలో వివిధ రకాల అంతర పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించని కూరగాయలంటూ ఏమీ ఉండవు.పండిన అన్ని ఉత్పత్తులను ఏజెన్సీలోని వసతి గృహాలకు, వారపు సంతలకు, విశాఖలోని రైతుబజార్లకు తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నందున ఎంతో రుచికరంగా ఉంటాయి. విశాఖ రైతుబజార్లలో విక్రయించే కూరగాయల్లో సగానికిపైగా ఇక్కడ నుంచి సరఫరా చేసినవే కావడం విశేషం. ప్రతి రైతు తమకున్న భూమిలో క్యాబేజీ, కాలీఫ్లవర్, వంగ, బెండ, బీర, చిక్కుడు, ఉల్లి, బంగాళదుంపలు, ఆవాలు, కొత్తిమీర, టమాట వంటి పంటలన్నీ పండిస్తున్నారు. మన్యంలోని మిగిలిన రైతులకు భిన్నంగా పూర్తి ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఒక వరుసలో క్యాబేజీ, రెండో వరుసలో వంగ, మూడో వరుసలో ఉల్లి ఇలా రకరకాల పంటలు వేయడం వల్ల వ్యాధుల ఉధృతి తక్కువగా ఉంటుందని గిరిజన రైతులు చెబుతున్నారు. పొల ం గ ట్లపై సాగు చేసే ఆవాల ద్వారా కూడా వారు మంచి ఆదాయం రాబట్టగలుగుతున్నారు. పల్లపు ప్రాంతా ల్లో కాకుండా ఏటవాలుగా ఉన్న కొండలను వారు కూరగాయల సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ గ్రామాల్లోని ప్రతి రైతు వారానికి రూ.5 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందుతూ ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు.