సాక్షి, హైదరాబాద్ : అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు కూడా ‘రైతుబంధు’పథకం కింద పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. వాటిని ఏళ్ల తరబడి ఆ గిరిజన రైతులే సాగు చేసుకుంటున్నారు. రెవె న్యూ శాఖ నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో ఈ భూములను వ్యవసాయ భూములుగా పరిగణించకుండా బీ కేటగిరీ వివాదాస్పద భూములుగా గుర్తించింది.
ఈ భూములకు పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదని ప్రభుత్వం భావించింది. గిరిజనుల నుంచి ఒత్తిడి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విన్న పాలతో ప్రభుత్వం అటవీ యాజమాన్య హ క్కు పత్రాలున్న భూములకు కూడా పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతుల వద్ద యాజమాన్య హక్కు పత్రాలు లేకపోవడంతో వారికి పెట్టుబడి సొమ్ము అందే పరిస్థితి కనిపించడం లేదు. అటవీ యాజ మాన్య హక్కు పత్రాలున్న రైతులకు కూడా వచ్చే నెల 10 నుంచే చెక్కుల పంపిణీ ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రత్యేకంగా చెక్కుల ముద్ర ణ చేపడతామని వ్యవసాయ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment