సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సంబంధిత అంశాలను అధ్యయనం చేసేందుకు ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఎండీ ఎం.సురేందర్, జనరల్ మేనేజర్ చంద్రరాజమోహన్‌లతో కూడిన బృందం పంజాబ్‌లో పర్యటిస్తోంది. ఈ మేరకు ఆగ్రోస్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడో రోజు సందర్శనలో భాగంగా వీరు లూథియానా జిల్లాలో ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆగ్రోస్ పెట్రోల్ పంప్ పనితీరును, పంజాబ్ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని ప్యాకింగ్ హౌస్ పనితీరును పరిశీలించారు.
పంజాబ్ ఆగ్రోస్‌కు చెందిన మెగా ఫుడ్ పార్కును సందర్శించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో గోద్రెజ్, బజాజ్, మెగా మీట్, గోదాము లు, కోల్డ్ స్టోరేజీలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా చైర్మన్ కిషన్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని, రైతుకు లాభం చేకూరేలా రైతు ఉత్పత్తి చేసిన సరుకులను ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment