సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌బీకేల పరిధిలో వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ సహా మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 2021 మార్చిలో ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌బీకేలు, ఫుడ్ ప్రాసెసింగ్, అమూల్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జెడ్‌బిఎన్‌ఎఫ్ అడ్వైజర్ అండ్ వైస్ ఛైర్మన్ టి విజయకుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, ఏపీ డెయిరీ డవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఏ, ఏపీ ఆగ్రోస్ ఎండీ ఎల్ శ్రీకేష్ బాలాజీరావు, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ ఏ.సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
‘‘ఫుడ్ ప్రాససింగ్ సహా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లకోసం మొత్తంగా రూ. 10,235 కోట్లు అవుతుందని అంచనా. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో గొడౌన్లు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, కలెక్షన్ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, అసైయింగ్ ఎక్విప్‌మెంట్ పుడ్ ప్రాససింగ్ ఇన్‌ఫ్రా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆక్వా ఇన్‌ఫ్రా, పశుసంవర్ధక ఇన్‌ఫ్రా, ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు, జనతాబజార్లు, ఇ– మార్కెటింగ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలని’’ సీఎం ఆదేశించారు..
సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...:
►నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను ఇవ్వడమే కాదు, సకాలానికే వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడమన్నది చాలా ముఖ్యం
►రైతు ఆర్డర్ చేయగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని ఎప్పటిలోగా అందిస్తామనే విషయాలను చెప్పాలి
►ఎప్పటిలోగా వాటిని ఇస్తామన్న విషయాన్ని చెప్తూ ఆర్‌బీకేలో డిస్‌ప్లే చేయాలి
►ఆర్డర్‌చేసినా నాకు టైంకు అందలేదనే మాట ఎక్కడా రాకూడదు
►ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుని, అధికారులను నియమించుకోవాలి
►నాణ్యమైన ఆక్వాఫీడ్, ఆక్వా సీడ్ ఆర్బీకేల ద్వారా అందించాలి
►వీటి నాణ్యతను నిర్ధారించేందుకు నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసే ల్యాబులను ఆర్‌బీకేలతో అనుసంధానం చేయాలి
►సేంద్రియ, సహజ పద్ధతులకు పెద్దపీట వేసేలా సంబంధిత ఉత్పత్తులను ఆర్‌బీకేలపరిధిలోకి తీసుకురావాలి
►వీటికి పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించాలి
►ఏలూరు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి
►ఆర్గానిక్ వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రచారం, ప్రోత్సాహం ఇవ్వాలి
►బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసే యూనిట్లను గ్రామాల స్థాయిలో ప్రోత్సహించాలి
►ఆర్బీకేల భాగస్వామ్యంతో కనీసం ప్రతి గ్రామానికీ 3 యూనిట్లు ఉండేలా చూడాలి
►దీనివల్ల కల్లీ లేకుండా, నాణ్యమైన సేంద్రీయ ఎరువులు అందుబాటులోకి వస్తాయి
విత్తనం నుంచి విక్రయం వరకూ..
►విత్తనం నుంచి విక్రయం వరకూ.. అనే నినాదం ఆర్‌బీకేల విధులు కావాలి:
►విత్తనం నుంచి విక్రయం వరకూ మధ్యనున్న కార్యకలాపాల్లో రైతులకు చేదోడు, వాదోడుగా ఆర్బీకేలు నిలబడతాయి:
►ఆర్‌బీకేల కార్యకలాపాలు, వాటిని మరింత సమర్థవంతంగా నడిచేలా వ్యవసాయ వర్శిటీ తన కార్యాచరణ రూపొందించుకోవాలి:
►ఆర్‌బీకే కార్యకలాపాలను కేటగిరీలుగా విభజించాలి:
►మార్కెటింగ్, పంటలకు ముందు, పంటల తర్వాత తదితర అంశాలపైన అగ్రి వర్శిటీ పాఠ్యప్రణాళిక రూపొందించాలి
►తర్వాత వారు అప్రెంటిస్‌లో భాగంగా వీటిపై పట్టు సాధించాలి. దీనివల్ల వారికి ఈ అంశాల్లో సమర్థత పెరుగుతుంది:
►రైతు బజార్ల నిర్మాణంకూడా నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేసేలా దృష్టిపెట్టాలన్న సీఎం
మార్కెట్ యార్డుల్లో నాడు –నేడు
►ఇప్పుడున్న మార్కెట్ యార్డుల్లో నాడు –నేడుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం
►దాదాపు రూ.212 కోట్లతో నాడు – నేడు కింద పనులు చేపట్టాలని ప్రతిపాదనలు
►రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ఆధునీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశం
►ఈ సందర్భంగా ఆర్‌బీకేల పై సీఎంకు వివరించిన అధికారులు
►రాష్ట్రంలో 10,641 ఆర్‌బీకేలతోపాటు కొత్తగా 125 అదనపు అర్బన్ ఆర్‌బీకేలు ఏర్పాటు
►మొత్తంగా రాష్ట్రంలో 10,766 ఆర్బీకేలు
►ఆర్‌బీకే హబ్‌లలో వాహనాల సంఖ్య 65 నుంచి 154కు పెంపు
►ప్రతి ఆర్‌బీకేల్లోనూ కంప్యూటర్, ప్రింటర్లు, యూపీఎస్, బయోమెట్రిక్ డివైజ్‌లు
►మార్చి 31 నుంచి 147 నియోజకవర్గాల స్థాయి ల్యాబులు పని ప్రారంభిస్తాయని వెల్లడించిన అధికారులు
►13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబులు జూన్ 30 కల్లా ఏర్పాటవుతాయన్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment