సాక్షి, అమరావతి: రైతులకు వ్యవసాయ రుణాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌలు రైతులకు బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదని గుర్తించామని పేర్కొన్నారు. సున్నవడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమాను రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
4,700 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని.. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.1300 కోట్ల నాబార్డ్ రుణాన్ని తీసుకుంటున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
చదవండి:
‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment