Kitchen career
-
ఇటువంటి వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మంచూరియా రోల్స్..కావలసినవి..చపాతీలు – 5 లేదా 6,మంచూరియా – అర కప్పు (నచ్చిన ఫ్లేవర్‌లో తయారుచేసుకోవచ్చు),ఉల్లికాడ ముక్కలు,కొత్తిమీర తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పునటొమాటో సాస్,పుదీనా చట్నీ – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి)నూనె – సరిపడాతయారీ..ముందుగా నచ్చిన విధంగా మంచూరియా చేసి పెట్టుకోవాలి.అదే సమయంలో చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.అనంతరం చపాతీలు చేసుకుని.. వాటిని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి.ఒక్కో చపాతీపైన టొమాటో సాస్, పుదీనా చట్నీ రాసుకుని.. కొన్ని మంచూరియాలను అందులో పెట్టుకుని.. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు జల్లుకుని.. రోల్స్‌లా చుట్టుకోవాలి.వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయి.అల్లం స్వీట్..కావలసినవి..అల్లం – 2 కప్పులు (శుభ్రం చేసుకుని.. తొక్క తీసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి)పంచదార – 4 కప్పులు,ఏలకుల పొడి – కొద్దిగా,ఉప్పు – తగినంతనీరు – 2 కప్పులు,నెయ్యి – 4 టేబుల్ స్పూన్లుతయారీ..ముందుగా కళాయి వేడి చేసుకుని అందులో బెల్లం, పంచదార వేసి.. నీళ్లు పోయాలి. పంచదార, బెల్లం కరిగి.. సిరప్‌లా తయారవుతున్న సమయంలో అల్లం పేస్ట్, ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని.. చిక్కబడే వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.కాస్త దగ్గరపడే సమయంలో నెయ్యి వేసుకుని కాసేపు స్టవ్ మీద ఉంచి.. మరోసారి కలుపుకోవాలి.ఆ మిశ్రమం మొత్తం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఏదైనా బౌల్‌కి లేదా ప్లేట్‌కి ఆయిల్ రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి.సమాంతరంగా పరచి.. సుమారు 30 నిమిషాల పాటు చల్లారబెట్టి.. నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్.. జలుబు, దగ్గును దూరం చేస్తుంది.బ్రెడ్ – పిస్తా లడ్డూ..కావలసినవి..పిస్తా పేస్ట్ – 1 కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)పిస్తా – పావు కప్పు (దోరగా వేయించి, పొడిలా మిక్సీ పట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఓట్స్ పౌడర్ – పావు కప్పు (ఓట్స్‌ని వేయించి పౌడర్ చేసుకోవాలి)పల్లీలు – పావు కప్పు (దోరగా వేయించి.. తొక్క తీసి.. కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)కొబ్బరి పాలు – సరిపడాబాదం పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకుబెల్లం లేదా పంచదార పాకం – కొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో బ్రెడ్ పౌడర్, బాదం పౌడర్, ఓట్స్ పౌడర్, కచ్చాబిచ్చాగా చేసిన పల్లీలు, పిస్తా పేస్ట్ వేసుకుని.. కొద్దికొద్దిగా కొబ్బరి పాలు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని.. ఆ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. పక్కన పెట్టుకోవాలి.ప్రతి లడ్డూకి.. బెల్లం లేదా పంచదార పాకంలో ముంచి.. పిస్తా పొడి పట్టించాలి. కాసేపు గాలికి ఆరనిచ్చి.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ఫాస్టింగ్ని.. ఇలా బ్రేక్ చేద్దాం!
రేపు ఉదయం దోసెలు కావాలంటే... ఈ రోజు ఉదయమే పప్పు నానబెట్టాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే... ఇదిగో... ఇవి ప్రయత్నించండి. దినుసుల కోసం బజారుకెళ్లక్కర్లేదు. పోపుల పెట్టె ముందు పెట్టుకోండి. ఫ్రిజ్ తెరిచి అరలన్నీ వెతకండి. ఇక బాణలి పెట్టి స్టవ్ వెలిగించండి..బ్రెడ్ ఉప్మా..కావలసినవి..బ్రెడ్ ముక్కలు – 3 కప్పులు;నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు;అల్లం తురుము – టీ స్పూన్;వెల్లుల్లి తురుము – టీ స్పూన్;పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;టొమాటో ముక్కలు – కప్పు;పసుపు – అర టీ స్పూన్;మిరప్పొడి – టీ స్పూన్;టొమాటో కెచప్ – టేబుల్ స్పూన్;నిమ్మరసం– 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;ఆవాలు – 2 టీ స్పూన్లు;కరివేపాకు– 1 రెమ్మ;తరిగిన కొత్తిమీర– టేబుల్ స్పూన్;నీరు– 2 టేబుల్ స్పూన్లు.తయారీ..వెడల్పుగా ఉన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి.ఆవాలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, మిరప్పొడి, నీరు వేసి కలిపి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి.ఇప్పుడు టొమాటో కెచప్, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి.చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేటట్లు కలుపుతూ ఓ నిమిషం పాటు వేయించి దించేయాలి. గమనిక: బ్రెడ్ ఉప్మా చేయడానికి తాజా బ్రెడ్ మాత్రమే కాదు గట్టిపడిపోయిన బ్రెడ్‌తో కూడా ఉప్మా చేసుకోవచ్చు.వీట్ వెజిటబుల్ చీలా..కావలసినవి..గోధుమపిండి – 2 కప్పులు;టొమాటో ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);క్యారట్ తురుము – పావు కప్పు;తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నీరు – 2 కప్పులు (చిక్కదనం చూసుకుని అవసరమైతే పెంచుకోవచ్చు);నూనె – టేబుల్ స్పూన్;తయారీ..గోధుమ పిండిలో ఉప్పు వేసి నీరు పోసి పెరుగు చిలికే బీటర్‌తో చిలకాలి.ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.పెనం వేడి చేసి పెనాన్ని పచ్చి ఉల్లిపాయతో రుద్దాలి.ఇప్పుడు గోధుమపిండి మిశ్రమం ఒక గరిటె వేసి జాగ్రత్తగా రుద్దాలి.దోశెలాగ పలుచగా రుద్దకూడదు. ఊతప్పంలాగ మందంగా ఉంచాలి.ఈ గోధుమపిండి అట్టు చుట్టూ అర టీ స్పూన్ నూనె వేయాలి.మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాలనివ్వాలి.ఇలాగే పిండినంతటినీ అట్లు వేసుకోవాలి. ఈ వీట్– వెజిటబుల్ చీలాని చట్నీ లేదా సాంబార్‌తో తింటే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా..కావలసినవి..గోధుమపిండి – కప్పు;జొన్న పిండి – అర కప్పు;రాగి పిండి – అర కప్పు;సజ్జ పిండి– అర కప్పు;మెంతి ఆకులు – అర కప్పు (తరగాలి);నువ్వులు – టేబుల్ స్పూన్;అల్లం – పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్;నూనె – టీ స్పూన్;అవిశె గింజలు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– 3 టేబుల్ స్పూన్లు.తయారీ..పైన చెప్పుకున్న పదార్థాల్లో నూనె మినహా మిలిగినవన్నీ ఒక వెడల్పు పాత్రలో వేసి గరిటెతో కలపాలి.తర్వాత నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి.పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని చపాతీలా వత్తి పెనం మీద వేసి, కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా చపాతీ కాల్చినట్లే దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా రెడీ.వీటిని ఇక వేరే కాంబినేషన్ అవసరం లేకుండా నేరుగా తినవచ్చు.పప్పు లేదా కూరలతో కూడా తినవచ్చు. లంచ్‌కి ప్యాక్ చేసుకుని వెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. -
ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
క్యాలెండర్ పేజీ తిప్పమంటోంది. జూన్‌కి స్వాగతం పలకాల్సిందే. కొత్త టైమ్‌టేబుల్‌నీ స్వాగతించాల్సిందే. లంచ్ బాక్సు... స్కూల్‌కి రెడీ అయిపోతుంది. పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇవిగో వీటిని మన వంటింట్లో ట్రై చేయండి..బ్రెడ్ పొటాటో రోల్..కావలసినవి..బంగాళదుంపలు– 3 (మీడియం సైజువి);క్యారట్ తురుము లేదా పచ్చి బఠాణీలు – అర కప్పు ;మిరప్పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పసుపు – చిటికెడు;నిమ్మరసం –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బ్రెడ్ స్లయిస్‌లు – 10;వెన్న – టేబుల్ స్పూన్ – 2 టేబుల్ స్పూన్లు;పాలు– అర కప్పు; మొక్కజొన్న పిండి లేదా మైదా లేదా శనగపిండి– 2 టేబుల్ స్పూన్లు (బ్రెడ్ స్లయిస్‌లను రోల్ చేసి అతికించడానికి).తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత తొక్క తీసి చిదిమి ఒకపాత్రలో వేసుకోవాలి.క్యారట్ లేదా బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి.ఇప్పుడు చిదిమిన బంగాళదుంప గుజ్జులో మిరప్పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, ఉడికించిన క్యారట్ లేదా బఠాణీలను వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో చిదమాలి.ఉప్పు, కారం సరి చూసుకుని అవసరమైతే మరికొంత చేర్చుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని పది సమభాగాలుగా చేయాలి. ఒక్కో భాగాన్ని ఓవల్ షేప్ (దొండకాయ ఆకారం)లో చేయాలి.బ్రెడ్ అంచులు కట్ చేసి తీసేసిన తర్వాత బ్రెడ్ స్లయిస్‌ని పూరీల పీట మీద పెట్టి రోలర్‌తో వత్తాలి.ఇలా చేయడం వల్ల గుల్లబారి ఉన్న బ్రెడ్ చపాతీలాగ పలుచగా వస్తుంది.పాలలో బ్రష్ ముంచి ఈ స్లయిస్ల మీద చల్లాలి లేదాపాలలో వేళ్లు ముంచి బ్రెడ్ స్లయిస్ మీద చల్లి తడిపొడిగా ఉండేటట్లు మునివేళ్లతో అద్దాలి.బ్రెడ్ చివర్లు అతికించడం కోసం తీసుకున్న పిండిలో నీరుపోసి గరిట జారుడుగా కలుపుకోవాలి.ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులకు పిండి ద్రవాన్ని అద్దుతూ అతికిస్తే బ్రెడ్‌రోల్ రెడీ.వీటిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. బయటే ఉంచినప్పుడు ఒకవేళ కాల్చడం ఆలస్యం అయితే బ్రెడ్ అంచులు ఎండిపోయి రోల్ ఊడిపోతుంది.పెనం వేడి చేసి వెన్న రాసి బ్రెడ్ రోల్స్‌ను ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి. దోరగా కాలేకొద్దీ మరొక వైపుకు తిప్పుతూ అన్ని వైపులా కాలేటట్లు చూడాలి.పెనం మీద కాల్చినప్పుడు నూనెలో రోస్ట్ చేసినట్లు రోల్ అంతా సమంగా ఒకే రంగులో ఉండదు. కానీ లోపల మిశ్రమం ఉడికిపోతుంది. రోల్ పై భాగం కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.మొత్తంగా ఒకేరంగులో ఉండాలంటే బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి మరిగించి అందులో నాలుగు రోల్స్ వేసి అవి కాలిన తర్వాత మరికొన్ని వేస్తూ కాల్చుకోవచ్చు.ఇలా చేసినప్పుడు నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది.ఒవెన్‌లో అయితే... 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేసి బేకింగ్ ట్రేలో రోల్స్‌ను అమర్చి పది నుంచి పన్నెండు నిమిషాల సేపు బేక్ చేయాలి.చీజ్ బాల్స్..కావలసినవి..బంగాళదుంపలు –పావు కేజీ;వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్;ఉప్పు –పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి – అర టీ స్పూన్;మిరియాల పొడి –పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;బ్రెడ్ క్రంబ్స్ – 6 టేబుల్ స్పూన్లు;నూనె – వేయించడానికి తగినంత.స్టఫింగ్ కోసం.. చీజ్ – 100 గ్రాములు;ఎండిన పుదీన – అర టీ స్పూన్ (ఆకులను అరచేతిలో వేసి వేళ్లతో నలిపి పొడి చేయాలి);రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి తరుగు లేదా మిరప్పొడి –పావు టీ స్పూన్;మిరియాల పొడి–పావు టీ స్పూన్, గరం మసాలా పొడి– చిటికెడు.కోటింగ్ కోసం.. కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు;ఎగ్ – ఒకటి (ఎగ్ వేయనట్లయితే మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి);బ్రెడ్ క్రంబ్స్– అర కప్పు.తయారీ..బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, వేడి తగ్గిన తర్వాత తొక్క తీసి చిదమాలి.అందులో వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్రెడ్ క్రంబ్స్ వేసి సమంగా కలిసేటట్లు చిదిమి ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, కారం కలుపుకుని మిశ్రమం మొత్తాన్ని బాల్స్ చేసి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి.స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిలో చీజ్ తప్ప మిగిలిన అన్నింటినీ ఒకపాత్రలో వేసి కలపాలి. అందులో చీజ్ ని అర అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసిపాత్రను కొద్దిగా కదిలిస్తూ మసాలా పొడులు చీజ్ ముక్కలకు పట్టేలా చేసి వేడి తగలకుండా స్టవ్‌కు దూరంగా ఉంచాలి.ఇప్పుడు బంగాళదుంప బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో చిన్న పూరీలా వత్తి అందులో మసాలా పట్టించిన చీజ్ ఒక ముక్క పెట్టి బంగాళాదుంప మిశ్రమం పూరీ అంచులను మూసేస్తూ బాల్ చేయాలి.ఇలా అన్నింటినీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో ఒక్కో బాల్ని వేస్తూ మెల్లగా వేళ్లతో కదిలిస్తూ పిండి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.మరొక ప్లేట్లో బ్రెండ్ క్రంబ్స్ వేసుకుని కార్న్‌ఫ్లోర్ పట్టించిన బాల్స్‌ని వేసి అన్ని వైపులా సమంగా పట్టేటట్లు చేయాలి.కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో వేసి గిలక్కొట్టాలి.ఎగ్ వాడనట్లయితే రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను తగినంత నీటితో గరిటజారుడుగా కలుపుకోవాలి.పొడి కార్న్‌ఫ్లోర్ పట్టించిన బంగాళాదుంప– చీజ్ బాల్స్‌ని కార్న్‌ఫ్లోర్ ద్రవం లేదా కోడిగుడ్డు సొనలో ముంచి తీసి పదినిమిషాల సేపు ఆరనివ్వాలి.ఈ లోపు బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో బాల్‌ను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం మంట మీద బాల్ అన్ని వైపులా సమంగా కాలిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.బాల్స్ మీద టిష్యూ పేపర్ని కప్పి ఉంచితే అదనపు ఆయిల్ వదులుతుంది.బంగాళాదుంప– చీజ్ బాల్స్‌ని టొమాటో సాస్ లేదా కెచప్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: చూపులను కట్టడి చేసేలా! -
ఇంటిప్స్: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?
రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం. పరిష్కార మార్గాలు.. కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మూలల్లో బోరిక్ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇవి చదవండి: హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో? -
కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..!
'సాధారణంగా మనం కిచెన్‌లో ఉన్న కొన్ని వస్తువులు పాడవకుండా కాపాడడంకోసం నానా తంటాలు పడుతూంటాం. వాటిలో మనకిష్టమైన పదార్థాలంటే.. ఇంకెంతో జాగ్రత్తలను పాటిస్తాం. ఏం చేయాలో తెలియక, చిన్న చిన్న ఉపాయాలు తోచక విసుగు చెందుతుంటాం. ఇకపై అలా జరగకుండా ఈ కొన్ని ట్రిక్స్ మీకోసమే..' ఇలా చేయండి.. తోడు వేయడానికి తగిన మజ్జిగ లేక పెరుగు అందుబాటులో లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. ఆరేడు గంటలపాటు కదపకుండా పక్కన పెడితే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. సాధారణంగా అల్లం పేస్ట్‌ను ఎప్పటికప్పుడు తాజాగా చేయడంతో పాటు కొంత స్టోర్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇది పాడవకుండా ఉండేందుకు అందులో చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది. ఇవి చదవండి: 'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు! -
వంటల సైంటిస్ట్
పన్నెండేళ్ల వయసులో ఈ కుర్రవాడు వంటగదిలోకి ప్రవేశించాడు. అక్కడి పదార్థాలతో కొత్త కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాడు. నాలుగేళ్లు తిరిగేలోపు ఆరు లక్షల మంది ఆహారప్రియుల చవులను ఊరించాడు. అతడి పేరు యమన్ అగర్వాల్. హైదరాబాద్‌లో ఉంటున్న యమన్ ఇంత చిన్న వయసులోనే గరిటె ఎందుకు పట్టుకున్నట్లు? ‘‘నేను ల్యాప్‌టాప్‌లో నిరంతరం వంటల కార్యక్రమాలు చూస్తూ గంటలకొద్దీ సమయం గడిపేసేవాడిని. అలా నా కిచెన్ కెరియర్ ప్రారంభమైంది.. ఒక్క వంటల కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడేవాడిని కాదు. రోడ్డు పక్కన ఉన్న స్టాల్ దగ్గర నుంచి సెవెన్ స్టార్ రెస్టారెంట్ వరకూ వాళ్లు ఎలా వండుతున్నారో శ్రద్ధగా టీవీ ప్రోగ్రామ్స్‌ని పరిశీలించేవాడిని. అలా నేను అస్తమానం ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం చూసిన మా చుట్టాలు, ఇంట్లో వాళ్లు ‘‘ఎక్కువసేపు గేమ్స్ అడకు. మంచిది కాదు’’ అని చెప్పేవారు. నేను వంటల్ని చూస్తున్నానని వారికేం తెలుసు. అలా ఎప్పడూ ఇతరుల వంట కార్యక్రమాలు చూస్తూ గడిపేసిన నేను, ఇప్పటికైనా ఒక సొంత వంటకం తయారుచేయాలనుకున్నాను. వెంటనే బటర్ పనీర్ మసాలా (నా మొదటి వంటకం) తయారుచేశాను. నా వంటకం రుచి చూసిన మా వాళ్లు ‘ఇది ఫైవ్ స్టార్ డిష్’ అని నన్ను ప్రశంసించారు. మా బంధువులు కూడా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ తరవాత కొంత కాలానికి నా శాకాప్రావీణ్యానికి యూ ట్యూబ్‌ని వేదికగా చేసుకున్నాను. అలా నా కెరీర్ ఒక గాడిలో పడింది. అయితే అందరూ చేసినట్టే నేను కూడా చేస్తే ప్రయోజనం లేదనుకున్నాను. అందుకే కేవలం శాకాహార వంటలకు మాత్రమే పరిమితమయ్యాను. సక్సెస్ సాధించాను’’ అంటాడు యమన్ అగర్వాల్. ఇప్పటి వరకు అతడు 150 వరకు తన వంటకాలను యూ ట్యూబ్‌లో ఉంచాడు. కుకింగ్షుకింగ్ (ఛిౌౌజుజీజటజిౌౌజుజీజ) చానల్ ద్వారా ఈ వంటకాలను అప్లోడ్ చేస్తున్నాడు. యమన్‌కు ఇప్పటికే 20,000 మంది సబ్స్క్రైబర్లు, మూడు మిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారు. ఎవరైనా తమ రెసిపీలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి, సక్సెస్ సాధించడానికి కావలసిన వస్తువులు, తయారీ గురించి అడిగితే చాలా ఆసక్తి కరంగా చెప్తాడు యమన్. మీరే చూడండి. - సంభాషణ: డా. వైజయంతి