పెరుగు, నిమ్మరసం, అల్లం పేస్ట్
కిచెన్ టిప్స్
Kitchen Tips
'సాధారణంగా మనం కిచెన్‌లో ఉన్న కొన్ని వస్తువులు పాడవకుండా కాపాడడంకోసం నానా తంటాలు పడుతూంటాం. వాటిలో మనకిష్టమైన పదార్థాలంటే.. ఇంకెంతో జాగ్రత్తలను పాటిస్తాం. ఏం చేయాలో తెలియక, చిన్న చిన్న ఉపాయాలు తోచక విసుగు చెందుతుంటాం. ఇకపై అలా జరగకుండా ఈ కొన్ని ట్రిక్స్ మీకోసమే..'
ఇలా చేయండి..
- తోడు వేయడానికి తగిన మజ్జిగ లేక పెరుగు అందుబాటులో లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. ఆరేడు గంటలపాటు కదపకుండా పక్కన పెడితే పెరుగు గట్టిగా తోడుకుంటుంది.
- నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా
- అందుతాయి.
- సాధారణంగా అల్లం పేస్ట్‌ను ఎప్పటికప్పుడు తాజాగా చేయడంతో పాటు కొంత స్టోర్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇది పాడవకుండా ఉండేందుకు అందులో చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది.
ఇవి చదవండి: 'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
Comments
Please login to add a commentAdd a comment