tooth paste
-
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్‌ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్‌తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే
టీవీ చూస్తూ చాలా పనులు చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది దర్జాగా రిమోట్ తిప్పుతూ టీవీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏ సిరీయల్లో చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అలాగే కూరగాయలు కట్ చేస్తూనో, పిల్లలకు అన్నం తినిపిస్తూనో టీవీ షోలను చూస్తూ ఉంటారు. పరధ్యానంగా టీలో పంచదారకు బదులు ఉప్పు వేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదేమో కానీ ఒక్కోసారి ఊహించని సమస్యకి దారి తీస్తుంది. మహిళ టీవీ చూస్తూ ఒకటి చేయబోయి.. ఇంకోటి చేసి ఆ తరువాత ఇబ్బందులు పడింది. పరధ్యానానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన తరువాత ఇపుడు మనమంతా కాస్త జాగ్రత్త పడాల్సిన వార్త ఇది. అసలు విషయం ఏమిటంటే..డైలీ స్టార్ కథనం ప్రకారం మియా కిట్టిల్సన్ అనే మహిళకి బెక్ హమ్(Beckham) డాక్యు సిరీస్ అంటే పిచ్చి. దీనిపై బాయ్ ఫ్రెండ్‌తో చర్చిస్తుంది కూడా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా పెయిన్ కిల్లర్ క్రీమ్ డీప్ హీట్ క్రీమ్ వాడేసింది. ఇంకేముందు నోటిలో చురుక్కున మండడంతో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. ఘాటైన వాసనతో ఇబ్బంది పడింది. దీంత విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు. తన షాకింగ్ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. అది కోల్గేట్ టూత్పేస్ట్లానే ఉంది అంటూ నొప్పి నివారణ క్రీమును వాడిన వైనాన్ని వివరించింది. దీంతో నెటిజను కమెంట్ల వర్షం కురిపించారు. టిక్‌టాక్‌లో కిట్టెల్సన్ వీడియోకు వచ్చిన వ్యూస్ 10 లక్షలకు పై మాటే అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏమేరకు వైరల్ అయిందో. ఇది ఇలా ఉంటే గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ కోల్డ్ సోర్ క్రీం బదులుగా పెదాలకు సూపర్‌గ్లూను రాసేసుకుంది. తెలుసుగా గ్లూ రాసుకుంటే ఏమవుతుందో.. పెదాలకు అతుక్కుపోయి నానా బాధలు పడింది. విపరీతమైన జలుబుతో బాధపడింది. చివరికి వైద్యులు పారాఫిన్ ఆయిల్‌తో ఆమె పెదవుల సీల్‌ను విప్పారు. సో.. తస్మాత్ జాగ్రత్త! -
దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!
దంతాలకు ఈ పేస్టు/టూత్ పౌడర్ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్‌ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. దంత సమస్యలకు కారణం.. ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. డీ, బీ, సీ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి. దంతాలు పైన ఉండే ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పేస్ట్ బెటర్! మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్‌లు, పౌడర్లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి. ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు. ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఆయా టూత్ పేస్ట్‌లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు. దంత సమస్యలకు నివారణ.. ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్‌గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్ తోపాటు కాట్రోల్ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు. ---ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
లైవ్‌లో ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం చేస్తూ..ఓ యూట్యూబర్..
ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆన్లైన్ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్ కూడా అలానే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది. కొన్ని లైవ్ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్లు ముందుగా ట్రయల్స్ వేసిగానీ రిస్క్ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం. జంబో రేంజ్లో టూత్ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ యూట్యూబర్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్ని అందిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం ఏంటంటే.. ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్ టూత్‌పేస్ట్ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్ జాగ్రత్త..! (చదవండి: అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!) -
Viral Video: టూత్ బ్రెష్ తో బుల్లి తాబేలుకు స్నానం
-
సెన్సోడైన్ టూత్‌పేస్ట్‌కు భారీ జరిమానా.. ఆ యాడ్ వెంటనే తొలగించండి!
న్యూఢిల్లీ: ప్రముఖ టూత్‌పేస్ట్ ఉత్పత్తుల సంస్థ సెన్సోడైన్'పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) అసహనం వ్యక్తం చేసింది. కొద్ది రోజులగా టీవిలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సంస్థపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో.. 'ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్‌పేస్ట్ సెన్సోడైన్', 'ప్రపంచ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్' అని వచ్చిన వ్యాఖ్యలపై సీసీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశీ దంతవైద్యుల ఎండార్స్ మెంట్లను చూపించే ప్రకటనలను సీసీపీఏ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిలిపివేయాలని ఆదేశించారు. నిధి ఖరే నేతృత్వంలోని సీసీపీఏ ఇటీవల సెన్సోడైన్ ఉత్పత్తుల తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్‌తో సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సెన్సోడైన్ ఉత్పత్తుల ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా చర్యలు తీసుకుంది. ఈ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా సర్వే జరిపినట్లు సంస్థ ఎలాంటి వివరాలను తమకు సమర్పించలేదని పేర్కొంది. కేవలం మన దేశంలోని భారతదేశంలోని దంతవైద్యులను సర్వే చేసి రూపొందించిన ప్రకటనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దంతవైద్యులు సిఫార్సు చేస్తున్నట్లు చూపించడం సబబు కాదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది. అందుకే, ఈ ప్రకటనలను 7 రోజుల్లోగా తొలగించాలని పేర్కొంది. (చదవండి: వాహనదారులకు గూడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!) -
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
ఈ టోపీ పళ్లు తోముతుంది!
లండన్: ఓ పక్క టూత్‌పేస్టు, మరో పక్క బ్రష్ అమర్చి ఉన్న ఈ టోపీ నిజంగానే పళ్లు తోముతుందట! పొద్దున లేవగానే దీన్ని తలపై పెట్టుకుని పళ్లు తోముకుంటూనే ఎంచక్కా ఇంకో పని చేసుకోవచ్చట. బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీలో సంగీతం నేర్చుకుంటున్న శ్యాం హంటర్ బాక్స్టర్ అనే విద్యార్థి దీనిని రూపొందించాడు. రోజూ పళ్లు తోముకోవడానికి సమయం వ్యర్థం అయిపోతోందని భావించిన ఈ 19 ఏళ్ల గడుగ్గాయి.. జీవితకాలంలో దంతధావనానికి ఎన్ని రోజుల సమయం వ్యర్థం అవుతుందోనని ఓ రోజు లెక్కలేసుకున్నాడు. మొత్తమ్మీద 75 రోజులని తేలింది. ఇంకేం.. చేతులతో పనిలేకుండానే దంతధావనం చేసుకునేందుకు ఉపయోగపడేలా ఈ టోపీని తయారు చేశాడు. అన్నట్టు.. ‘విచిత్ర ఆవిష్కరణల పోటీ’లో ఈ టోపీకి రూ.10 లక్షల బహుమతి కూడా దక్కింది! ఇంటితాళాలు దాచుకునే హీల్స్, బ్రెడ్ ఆకారంలోని రేజర్, మినీట్రెడ్మిల్స్లా పనిచేసే రోలర్స్ బూట్లు, పాదాల వరకూ విస్తరించే గొడుగు వంటి మొత్తం 300 విచిత్ర ఆవిష్కరణలను పోటీలో వెనక్కు నెట్టి మరీ ఈ టోపీ ప్రైజ్‌ను కొట్టేసింది. దీనిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారట. -
మొదట పళ్లు తోమింది ఎవరు? ఎప్పుడు?!
ఆవిష్కరణం టూత్‌పౌడర్, టూత్ పేస్ట్‌ల వాడకాన్ని మానవ నాగరికత అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు.అలాంటి టూత్‌పేస్ట్, టూత్పౌడర్లకు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం ఎన్నో నాగరికతలు ఎన్నో ఫ్లేవర్స్‌లో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ప్రాచీన ఈజిప్షియన్లు తొలిసారి పళ్లను తోముకోవడానికి ఒక పౌడర్‌ను ఉపయోగించారు. భారత్ వంటి దేశాల్లో కూడా తొలి నుంచి నోటిని శుభ్రం చేసుకోవడానికి వేర్లను, ఎండిన వేప కొమ్మల నుంచి తీసిన పౌడర్‌ను వాడిన దాఖలాలున్నాయి. రోమన్, గ్రీకు నాగరికతల్లో కూడా టూత్‌పౌడర్ ప్రస్తావన ఉంది. నాణ్యమైన మట్టిని కూడా టూత్పౌడర్లుగా ఉపయోగించారు. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో టూత్‌పౌడర్, పేస్ట్‌లు తయారు చేసే బాధ్యత తీసుకొన్నారు వైద్యులు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫార్ములాలతో, ఫ్లేవర్లలో దంతధావనానికి పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేల సంవత్సరాలు గడిచిపోయినా టూత్‌పేస్ట్‌ల ఉత్పాదన అనేది వ్యాపారంగా మారకపోవడం! క్రీస్తుపూర్వం ఐదు వేల సంవత్సరాల కిందట నుంచి టూత్‌పౌడర్, పేస్ట్‌లు వినియోగంలోనే ఉన్నప్పటికీ క్రీస్తు శకం 1873 వరకూ టూత్పేస్ట్లు పరిశ్రమలుగా అభివృద్ధి చెందలేదు. తొలిసారి టూత్‌పేస్ట్‌ను మాస్ ప్రొడక్షన్ గా మార్చింది కోల్గేట్! పెద్దపెద్ద జార్స్‌లో కోల్గేట్ టూత్‌పేస్ట్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది. 1892నాటికి ట్యూబ్‌ల రూపంలో పేస్ట్‌ను మార్కెట్ చేయసాగారు. అక్కడి నుంచి అనేక కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి.