న్యూఢిల్లీ: ప్రముఖ టూత్‌పేస్ట్ ఉత్పత్తుల సంస్థ సెన్సోడైన్'పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) అసహనం వ్యక్తం చేసింది. కొద్ది రోజులగా టీవిలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సంస్థపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో.. 'ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్‌పేస్ట్ సెన్సోడైన్', 'ప్రపంచ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్' అని వచ్చిన వ్యాఖ్యలపై సీసీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.
విదేశీ దంతవైద్యుల ఎండార్స్ మెంట్లను చూపించే ప్రకటనలను సీసీపీఏ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిలిపివేయాలని ఆదేశించారు. నిధి ఖరే నేతృత్వంలోని సీసీపీఏ ఇటీవల సెన్సోడైన్ ఉత్పత్తుల తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. టెలివిజన్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సెన్సోడైన్ ఉత్పత్తుల ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా చర్యలు తీసుకుంది. ఈ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా సర్వే జరిపినట్లు సంస్థ ఎలాంటి వివరాలను తమకు సమర్పించలేదని పేర్కొంది. కేవలం మన దేశంలోని భారతదేశంలోని దంతవైద్యులను సర్వే చేసి రూపొందించిన ప్రకటనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దంతవైద్యులు సిఫార్సు చేస్తున్నట్లు చూపించడం సబబు కాదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది. అందుకే, ఈ ప్రకటనలను 7 రోజుల్లోగా తొలగించాలని పేర్కొంది.
(చదవండి: వాహనదారులకు గూడ్‌న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్!)
Comments
Please login to add a commentAdd a comment