ink
-
ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
ఇంట్లోని ఇలాంటి చిన్న చిన్న వస్తువులను మన్నికగా, శుభ్రంగా ఉంచడంలో ఇబ్బంది పడుతున్నరా!? అయితే ఈ సూపర్ కిచెన్ టిప్స్ మీకోసమే.బట్టల మీద పడిన ఇంక్ మరకలు పోవాలంటే.. ఇంక్ మరకలపై కొద్దిగా నీళ్లు చల్లాలి. ఇప్పుడు టూత్ పేస్టును అప్లై చేసి బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే ఇంక్ మరకలు ఇట్టే పోతాయి.మినరల్ వాటర్ క్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, టీస్పూను బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసం, కొద్ది గోరువెచ్చని నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తరువాత క్యాన్‌ను పైకీ కిందకు బాగా గిలకొట్టాలి. పది నిమిషాలపాటు ఇలా గిలకొట్టి రెండుమూడుసార్లు నీటితో కడగాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్‌తో వాటర్ క్యాన్ బయటవైపు తోముకుంటే క్యాన్ మురికి వదిలి కొత్తదానిలా మెరుస్తుంది.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీ స్పూను డిష్ వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములూ దరిచేరవు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.ఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
ఓటు వేసిన వెంటనే చూపుడు వేలిపై సిరాచుక్క ఎందుకు వేస్తారు?
ఎన్నికల్లో చాలా ప్రధానమైన అంశం సిరాచుక్క. మనం ఓటేశామని చెప్పడానికి సిరాచుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు, దొంగ ఓట్లను చెక్ పెట్టే ఆయుధంలానూ పనిచేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సిరా ఎక్కడ తయారవుతుంది? దీని వెనకున్న చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. తెలంగాణలో ఓట్ల పండగకి సర్వం సిద్ధమైంది. రేపే(నవంబర్30) తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఓటు వేశాక చూపుడు వేలిపై ఇంక్ మార్క్ వేస్తారన్న విషయం తెలిసిందే. ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తారు. ఈ సిరా వెనుక పెద్ద చరిత్రే ఉంది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదట. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అదే “బ్లూ ఇంక్” పద్ధతి. భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. R&D ఆర్గనైజేషన్ ఈ ఇంక్‌ను తయారు చేసేది. ఆ తర్వాత దీనిని మైసూర్‌కు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. అప్పట్నుంచి భారత్‌లో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే ఇంక్‌ను తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇంక్‌ను సరఫరా చేస్తుంది. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంక్ సరఫరా అవుతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడా తయారీ చేస్తుంది ఈ సంస్థ. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు.కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు.ఈ ఇంక్ వేలిపై వేయగానే కొన్ని గంటల్లోనే పోదు. ఒకప్పుడు అయితే కొన్ని నెలల పాటు ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంక్ సరఫరా చేసేముందు ఆ ఇంక్‌ను పలుమార్లు టెస్ట్ చేస్తారు. ఇండెలబుల్ ఇంక్‌లో సుమారు 15 నుంచి 18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది.ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. దొంగఓట్లు నమోదు కాకుండా ఉండేందుకు గాను ఈ సిరాను చూపుడు వేలికి వేస్తారు. ఒకవేళ వేలికి గాయమైనా, చూపుడు వేలు లేకపోయినా మరో వేలికి వేస్తారు. ఇక ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు ఇందులో ఏం వాడారన్నది తెలియదు. -
సిరా చుక్క..దానికో లెక్క
ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపించడం మామూలే. ఈ సిరా వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. ఓటు వేసిన వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా ఇలా సిరా గుర్తు పెట్టే పద్ధతి 1962 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది. దొంగఓట్లు వేయకుండా కట్టడి చేసేందుకు సిరా గుర్తు పద్ధతి సత్ఫలితాలనిస్తోందనే చెప్పాలి. సాక్షి, హైదరాబాద్: సిరా చుక్క.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా అదే. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా (ఇండెలబుల్ ఇంక్) అంటారు. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమచేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. ఎన్నికలు.. పోలియో డ్రాప్స్.. ఎన్నికల వేళ కీలకంగా మారిన సిరాను భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు లే»ొరేటరీస్ మరొకటి. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని దాదాపు వందదేశాలకు దేశాలకు రాయుడు లేబొరేటరీస్ తయారు చేస్తోన్న సిరా సరఫరా అవుతోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల ఇంకు గుర్తు 3–4 రోజుల వరకు చెరిగిపోదు. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో చుక్కలు వేసే సమయంలోనూ గుర్తుపెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. -
ప్రింటేసి.. తుడిచేసి.. ఒకే పేపర్‌పై మళ్లీ మళ్లీ ప్రింటింగ్!
సాధారణంగా ప్రింటర్లో ఏమైనా ప్రింట్ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే!? ఈ ఐడియా చాలా బాగుంది కదా.. అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ ఉంటుంది, ఇటు ఖర్చూ తగ్గుతుంది. పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి వాటిని పడేయడం దా కా ఎంతో శ్రమ కూడా తప్పుతుంది. ఈ క్రమంలోనే రీప్ సంస్థ.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్’ను రూపొందించింది. అంటే ప్రింటర్ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్ సర్క్యులర్ ప్రింట్ (ఆర్సీపీ)’ అని పేరు పెట్టారు. ప్రత్యేకమైన పేపర్.. లేజర్ క్లీనర్‌తో.. డీప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది. -
రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్‌పై ఇంక్ దాడి
-
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
మార్కులు తక్కువ వచ్చాయని చిన్నారిని హింసించిన టీచర్
-
పెన్నుల్లో రాజా..‘రత్నం’!
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్’, ఫౌంటెన్ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు. రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు.. స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్‌జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. గాంధీ మెచ్చిన పెన్ను అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. విదేశాల నుంచి యంత్రాల దిగుమతి 1930లో ఇంగ్లాండ్ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్ ఆపరేటర్ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్ గుజరాత్ నుంచి, ఇరిడియమ్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ సర్ ఆల్డ్బాల్క్ పెన్నుకు ఆర్డర్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్‌కు ప్రధాని అందజేశారు. ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం 3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్‌లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్‌లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు. రూ.300లు నుంచి రూ.35వేల వరకూ.. స్టీల్ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే బాల్ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. జర్మనీ చాన్సలర్‌కు మోదీ కానుక ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ యాంజిలా మార్కల్‌కు ప్రధాని మోదీ.. రత్నం సన్స్ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం. పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్ ప్రోత్సాహం కావాలి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్సైటు. – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు -
చూపుడు వేలు లేకుంటే.!
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడువేలుకు సిరా చుక్క పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే ఎలా,.. దీనికి ఎన్నికల సంఘం ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. ఎడమచేతికి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క వేసే అవకాశం కల్పించింది. ఎడమ చేతికి అసలు వేళ్లు లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు అదీ లేకుంటే ఈ తర్వాత ఏది ఉంటే ఆ వేలుకు చుక్క పెడతారు. రెండు చేతులకూ వేళ్లు లేకుంటే వేళ్ల మొదళ్ల మధ్య భాగంలో లేకుంటే చేయిపై రాస్తారు. -
మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!
ఇస్లామాబాద్: పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ముఖంపై స్థానికుడు ఒకరు సిరా పోశారు. పంజాబ్ ప్రావిన్సులో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్ పరిణామానికి స్పందించిన అక్కడి పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. సిరా పోసిన వ్యక్తిని ఫయాజ్ రసూల్‌గా గుర్తించారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గుర్తించారు. నవాజ్ షరీఫ్‌పై చెప్పుతో దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్హీ సాహూలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షరీఫ్‌పై ఓ యువకుడు షూతో దాడి చేశాడు. షరీఫ్ తన ప్రసంగం ప్రారంభించే కంటే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. షూతో దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
పాకిస్తాన్ విదేశాంగమంత్రికి చేదు అనుభవం
-
కాలుష్యం మారింది..‘కాలింక్’గా!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కాలుష్య సమస్యకు బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు పరిష్కారాన్ని కొనుగొన్నారు. కాలుష్యాన్ని ఎలాగూ అరికట్టలేకపోతున్నాం.. అలాంటప్పుడు దానిని రోజూ ఉపయోగించే వస్తువుగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న వారి ఆలోచన నుంచి పుట్టిందే ‘కాలింక్’.. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును ఇది సరికొత్త ఆవిష్కరణే.. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కధ్యాన్లు ‘చిక్కనైన నల్లటి సిరా’గా మార్చివేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాక్టరీల చిమ్నీలు, జనరేటర్లు, కార్ల ఎగ్జాస్ట్ పైపుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని, మసిని సేకరించి అనంతరం శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఇంక్ రూపంలోకి మారుస్తున్నారు. ఈ చిక్కటి ఇంక్ ప్రింటర్ల కాట్రిడ్జ్‌లు, స్క్రీన్ ప్రింటింగ్, చిత్రకళకు కాలిగ్రాఫి పెన్లు, వైట్‌బోర్డు మార్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 2016 జూన్‌లో బెంగళూరులో నెలకొల్పిన ‘గ్రావికీ లాబ్స్’ ద్వారా ఈ ఇంక్ తయారీని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక, ఇతర కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి వర్ణ ద్రవ్యాలుగా, సిరాగా మార్చడంతో పాటు వివిధదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని రోడ్లకు ఈ ఇంక్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు.ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు రీసైకిల్ చేయడం విశేషం. విదేశాల్లోను ఎయిర్ ఇంక్‌కు ప్రాచుర్యం ప్రస్తుతానికి వీధులు, కూడళ్లలో గోడలపై చిత్రాలు గీసే కళాకారులు, డిజైనర్లకు ఈ ఎయిర్ ఇంక్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. విదేశాలతో సహా మన దేశంలోనూ గోడ, వీధి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఇంక్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అనిరుధ్ అండ్ కో ప్రయత్నిస్తోంది. కళారంగం ద్వారానే ఈ ఇంక్‌కు మరింత ప్రచారం తీసుకురావాలని భావిస్తున్నారు. 45 నిమిషాల కాలుష్యంతో 30 మి.లీ. ఇంక్ ఎయిర్ ఇంక్‌కు 2013లో అనిరు«ధ్శర్మ పెట్టినపేరు కాలింక్. వాతావరణంలోకి కాలుష్యం చేరకముందే దాన్ని ఎలా బంధించాలన్న అన్న ఆలోచన నుంచి వచ్చిందే కాలింక్ ప్రయోగం.తర్వాత అనిరుధ్, కౌషిక్‌లు కలిసి ‘సిలిండ్రికల్ మెటల్ కాంట్రాప్షన్’ను రూపొందించారు. వాటిని కార్ల పొగ గొట్టాలకు, పారిశ్రామిక చిమ్నీలకు ఏర్పాటుచేసి కాలుష్య రూపంలో ఉన్న ముడిపదార్థాన్ని సేకరించారు. 45 నిమిషాలు వెలువడే కాలుష్యంతో ఒక ఎయిర్ ఇంక్‌లో పట్టే 30 మిల్లీలీటర్ల ఇంక్‌ను తయారు చేయవచ్చని గుర్తించారు. కిక్ స్టార్టర్ అనే వెబ్సైట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి ఎయిర్ ఇంక్ ఉత్పత్తికోసం పదిరోజుల్లో 14 వేల డాలర్ల(రూ.9 లక్షలు)కు పైగా సేకరించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో సహా, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలకు పెద్దమొత్తంలో కాలింక్ను సరఫరా చేసే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు కౌషిక్ చెప్పారు. పలువురు భారతీయ చిత్రకారులతో కూడా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. గ్రావికీ ఆన్లైన్ స్టోర్స్ ద్వారా త్వరలో ఇంక్‌ను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాటి కంటే ఎయిర్ ఇంక్ మార్కర్ల మన్నిక ఎక్కువని, ఇందులో వేరే రంగుల్ని జతచేసుకోవచ్చని కౌషిక్ చెప్పారు. -
నగదు మార్పిడికి సిరా గుర్తు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు మార్పిడికి పోస్టాఫీసుల్లో సిరా గుర్తును అమలు చేశారు. ఈ విధానం వల్ల ఒకే వ్యక్తి రెండోసారి నోట్ల మార్పిడికి పాల్పడే అవకాశం లేకుండా పోయింది. నోట్ల మార్పిడికి క్యూలలో రీసైక్లింగ్ విధానం కొనసాగుతున్నట్లు బుధవారం సాక్షి దినపత్రిక 'నోటుకు రెండో వైపు' శీర్షికతో కథనం ప్రచురించింది. బుధవారం పోలీసు బందోబస్తు మధ్య పురుషులు, మహిళలు బారులుదీరి పాత డబ్బును కొత్త నోట్లలోకి మార్చుకున్నారు. కౌంటర్లో డబ్బు మార్పిడి చేసుకున్న మరుక్షణమే వేలిపై ఇంకు గుర్తు వేశారు. ఈ పద్ధతి వల్ల రీసైక్లింగ్ విధానానికి అడ్డుకట్ట వేసినట్లయింది. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో బుధవారం ఒకేరోజున డివిజన్ పరిధిలో రూ. 1.72 కోట్ల నోట్ల మార్పిడి జరిగిందని, రూ. 6.30 కోట్ల డిపాజిట్లు సేకరించామని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆరు రోజుల్లో రూ. 48 కోట్ల డిపాజిట్లు జమ అయినట్లు వివరించారు. ఒక అంధురాలు తమ వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదంటూ ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. నోటు మార్పిడికి అవకాశం లేదని పోస్టల్ సిబ్బంది వెనక్కి పంపారు. -
వేలిపై సిరా పడితేనే మార్పిడి
పాత నోట్ల మార్పిడికి కొత్త నిబంధన ► నల్లధనం మార్పిడి, భారీ క్యూలు అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం ► కొందరు వ్యక్తులు పదేపదే నోట్లు మారుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: కొందరు పదే పదే నగదు మార్చుకుంటున్నారన్న నివేదికల నేపథ్యంలో వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నల్లధనం మార్చేందుకు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేయడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలు లేకుండా చేయవచ్చని భావిస్తోంది. అలాగే జన్‌ధన్ యోజన ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లపై నిఘా పెట్టాలని సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 10 నుంచి 14 వరకూ బ్యాంకుల్లో రూ.3 లక్షల కోట్ల మేర ప్రజలు డిపాజిట్ చేశారని ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘కొందరు పదే పదే బ్యాంకుల్లో నగదు మార్చుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అవినీతి శక్తులు నల్లధనాన్ని సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నివేదికలు అందాయి. అమాయక ప్రజల్ని బృందాలుగా ఏర్పాటు చేసి నగదు మార్చేందుకు వారిని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతున్నారు’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మంగళవారం చెప్పారు. దీనివల్ల నగదు మార్పిడి కొందరికే పరిమితమవుతోందని, ఆ పరిస్థితి నివారించేందుకు... నగదు మార్చుకునే వ్యక్తి వేలిపై ఇంకు గుర్తు పెడతారని తెలిపారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీచేశామని, మెట్రో నగరాల్లోని కొన్ని బ్యాంకుల్లో మంగళవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఎన్నికల్లో వాడుతున్న సిరా(ఓటు వేశాక వేలిపై పెట్టే సిరా) స్టాక్‌ను సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్రం.. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థను కోరింది. డీసీసీబీలు, 1.3 లక్షల పోస్టాఫీసుల్లో పెంపు ‘పల్లెల్లో ప్రజల నగదు అవసరాలు తీర్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), 1.3 లక్షల పోస్టాఫీసుల్లో నగదు నిల్వల్ని పెంచాం. హుండీల్లో చేరే చిన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని మత సంస్థలు, ఆలయ ట్రస్టుల్ని ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల మార్కెట్లో చిన్న నోట్ల కొరత కొంతవరకూ తీరుతుంది’ అని దాస్ అన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశాం, ఈ-వాలెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇక ఉప్పు కొరత, బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారన్న వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వం తగినంత నగదు అందుబాటులో ఉంచుతుంది. నిత్యావసరాల సరఫరాకు కొరత లేకుండా చూస్తుందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని, కొన్ని చోట్ల మంగళవారం నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు. నిత్యావసరాల సరఫరాపై నిరంతర నిఘా నగదు కొరత నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణకు కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరా, డిమాండ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. బ్యాంకులకు చెందిన సీనియర్ ప్రతినిధులతో కూడిన సమన్వయ బృందానికి కూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. నగదు లభ్యతపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ఆ బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కూడా నియమించారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే నల్లధనంపై కూడా ఈ బృందం నిఘా పెడుతుంది. ఇంకెన్నాళ్లీ పడిగాపులు.. ఏడో రోజు పాత నోట్ల మార్పిడి. నగదు విత్‌డ్రా కోసం దేశ వ్యాప్తంగా జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడ్డారు. ఏటీఎంల్లో నగదు కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతుండడంతో మంగళవారం తెల్లవారుజామునుంచే జనం బారులు తీరారు. బ్యాంకుల ముందు గంటల కొద్దీ పడిగాపులు పడ్డా... నగదు అయిపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. సోమవారం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రాష్ట్రాల్లో జనం భారీగా క్యూ కట్టారు. క్యూలైన్లో నిలబడి గుండెపోటుతో హైదరాబాద్‌లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు తక్కువ మొత్తం చేరడంతో నగదు దొరక్క జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రజల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేలకు మించొద్దు ్డజన్ధన్ ఖాతాల్లో నల్లధనం చేరుతోందని, వాటిపై నిరంతర నిఘా పెట్టామని ఆర్థిక కార్యదర్శి దాస్ చెప్పారు. ‘ ఈ ఖాతాలో చట్టబద్ధంగా డిపాజిట్ చేస్తే ఇబ్బంది కలిగించం. అక్రమార్కులు మీ ఖాతాల్లో నల్లధనం వేసేందుకు అనుమతించవద్దు. ఖాతాల్లో కొద్ది రోజులుగా ఒక్కసారిగా రూ. 49 వేలు జమైనట్లు మా దృష్టికి వచ్చింది. జన్‌ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్ పరిధి రూ. 50 వేలు మించకూడదని ఆదేశాలు జారీచేశాం’ అని వెల్లడించారు. -
డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం
-
డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయనపై ఇంకు దాడి జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం బయట ఈ దాడి జరగడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో చికెన్‌గున్యా వ్యాధి తీవ్రంగా ప్రభలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంను వెంటనే ఢిల్లీకి తిరిగిరావాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. దీంతో ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో బ్రజేష్ శుక్లా అనే వ్యక్తి మనీష్ సిసోడియాపై ఇంకు చల్లాడు. 'ఢిల్లీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో.. ప్రజల సొమ్ముతో సిసోడియా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు' అంటూ ఇంకు దాడి చేసిన శుక్లా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
మార్కులు ఇవ్వలేదని.. టీచర్ పై ఇంకు దాడి
కట్ని: పరీక్షల్లో మంచి మార్కులు వేయలేదని టీచర్ పై కోపం పెంచుకున్న ముగ్గురు అమ్మాయిలు ఆమె ముఖంపై నల్ల ఇంకును చల్లిన ఘటన మధ్యప్రదేశ్ లోని కట్నిలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పూర్ణిమ ప్యాసి (18), శివాని ప్యాసి (18), పల్లవి అగర్వాల్ (18) ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో సీనియర్ ఇంటర్ (12వ తరగతి) చదువుతున్నారు. ఫిజిక్స్ సబ్జక్ట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా వాటిలో ముగ్గురికి తక్కవ మార్కులు వచ్చాయి. అవమానంగా భావించిన ముగ్గురు మార్కులు తక్కువగా వేసిన టీచర్ పై కోపం పెంచుకున్నారు. మంగళవారం ఫిజిక్స్ లెక్చరర్ రేఖా గుప్తా (35) తరగతి గదికి రావడంతోనే ఆమె ముఖంపై నల్ల ఇంకు చల్లి అవమానించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సిరా బదులు మార్కర్ పెన్!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటేశాక చూపుడు వేలుపై ఇప్పటిదాకా అద్దుతున్న సిరా గుర్తుకు బదులుగా మార్కర్ పెన్‌తో గుర్తుపెట్టే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్రష్‌తో మార్కింగ్ విధానం సరిగా లేదని ఓటర్లు నుంచి ముఖ్యంగా యువ ఓటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్ బాటిల్, బ్రష్ కంటే మార్కర్ పెన్నులను భద్రపరచడం, పంపిణీ చేయడం సులభం. ఈ మార్కర్ పెన్నుతో ఒకసారి గుర్తు వేస్తే నాలుగు నెలల పాటు చెరిగిపోదని మైసూర్ పెయింట్స్ పేర్కొంది. -
కొనసాగుతున్న సేన సిరా దాడులు
ముంబై: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల సిరా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం లాతూర్‌లోని మత్వాడా ప్రాంతంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిపై శివసేన కార్యకర్తలు దాడి చేసి అతని మొహంపై ఇంకు చల్లారు. మల్లికార్జున్ భాయ్కట్టి అనే ఆర్టీఐ ఉద్యమకారుడు లాతూర్-నాందేడ్ రహదారిపై చేపట్టిన అక్రమ కట్టడానికి సంబంధించిన వివరాలను గురువారం బహిర్గతపరిచాడు. భాయ్కట్టి చర్యతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో చితకబాదారు. అనంతరం సిరాతో ముఖాన్ని నల్లగా మార్చేశారు. మల్లిఖార్జున్ బ్లాక్ మేయిల్‌కు పాల్పడుతున్నాడని శివసేన కార్యకర్తలు ఆరోపించారు. గతంలో శివసేన కార్యకర్తలు 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్' చైర్మన్ సుధీంద్ర కులకర్నిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
మంత్రి కంట్లో నల్లసిరా
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ధన్‌గర్‌ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్గర్లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కంట్లో ఓ ఆందోళనకారుడు నల్లసిరా పోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పుణే జిల్లా, ఇంద్రాపూర్‌లోని భిగవణ్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళ్తే... తమను షెడ్యూల్డ్ ట్రైబల్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ కొన్నిరోజులుగా ధన్గర్లు రకరకాల రూపాల్లో తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఇంద్రాపూర్ తాలూకా, భిగవణ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ధన్గర్ సామాజికవర్గానికి చెందిన కొందరు అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసేంతవరకు వేచి చూసి, తిరిగి వస్తుండగా ఆయన కారును చుట్టుముట్టారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు. వారితో మంత్రి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి మంత్రి ముఖంపై నల్లసిరా పోశాడు. ఒక్కసారిగా సిరా గుమ్మరించడంతో అది మంత్రి కంట్లో పడింది. దీంతో మంత్రి కంటికి గాయమైంది. సిరాలో యాసిడ్ ఉంటుందని, ఫలితంగానే ఇబ్బంది కలిగి ఉండవచ్చని స్థానిక వైద్యుడొకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అక్కడ నుంచి పంపేశారు. ఇరువర్గాల వాగ్వాదం.. తమ పార్టీకి చెందిన మంత్రిపై సిరా పోయడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. భిగవణ్ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు... మంత్రి కంట్లో సిరా పోయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రాపూర్, భిగ్వణ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం పుణే-ఇంద్రాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే భైటాయించి నినాదాలు చేశారు. దీంతో ఈ ర హదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తెలుగు తమ్ముళ్ల అతి
వైఎస్సార్ సీపీపై తప్పుడు ప్రచారంతో వివాదం అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీ కేంద్రంలో ఘటన బ్యాలెట్‌పై సిరా అంటుకోవడంతో దుమారం లాఠీచార్జి చేసిన పోలీసులు గాయపడిన పదేళ్లబాలుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త అనకాపల్లి, న్యూస్‌లైన్ నెట్వర్క్ : అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సందర్భంగా ఆదివారం వివాదం నెలకొంది. పోలింగ్ అధికారులు చేసిన తప్పిదం వల్ల బ్యాలెట్ పత్రంపై సిరా అంటుకోగా, ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారానికి దిగడంతో రాజకీయ పార్టీల మధ్య వివాదానికి కారణమై పోలీసుల లాఠీచార్జికి దారితీసింది. ఓటమి భయంతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లు చిన్న విషయంపైనా రాద్ధాంతం చేసేశారు. చివరికి అసలు విషయం కాస్తా వెల్లడి కావడంతో బిక్కమొహం వేశారు. ఈలోగా జరగాల్సిన రాద్ధాంతం, పోలీసుల లాఠీచార్జి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు రంగంలోకి దిగడం జరిగిపోయాయి. వివాదాస్పద బ్యాలెట్ పత్రాలను ప్రత్యేక ప్రాతిపదికన పరిశీలించాలని ఎన్నికల అధికారి నిర్ణయించడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే...బీఆర్టీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఆ సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరు ఓటు వేసేందుకు వెళ్లారు. అతనికి పోలింగ్ సిబ్బంది ఇచ్చిన బ్యాలెట్‌కు సిరా అంటుకోవడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. పోలింగ్ స్టేషన్ నంబర్ ముద్ర వేసేటప్పుడు పొరపాటున సిరా అంటుకుందని సర్దిచెప్పి ఆ బుక్‌ను నిలిపివేసి మరో బుక్ నుంచి అతనికి బ్యాలెట్ ఇవ్వగా ఓటేసి వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన అతను వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందంటూ ప్రచారం చేయడంతో దానికి తెలుగు తమ్ముళ్లు గొంతుకలిపి గొందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. పోలింగ్ సిబ్బంది అనుకోకుండా చేసిన పొరపాటును తమకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడ వేశారు. స్థానికులను రెచ్చగొట్టడంతో గొడవ ప్రారంభమైంది. టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలింగ్ నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు కాండ్రేగుల బన్నీకి, వైఎస్సార్ సీపీ కార్యకర్త మొల్లేటి శ్రీనుకు లాఠీ దెబ్బలు తగిలాయి. దీంతో ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు, మహిళలు దెబ్బలు తిన్న బాలుడితో పాటు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈలోగా పాడేరు ఏఎస్పీ పకీరప్ప ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు టి.కృష్ణబాబు పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. మరక అంటుకున్న బ్యాలెట్ పేపర్లను ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించరాదని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ చేసేటప్పుడు సిరా అంటుకున్న బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా లెక్కించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసాద్‌కు సూచించారు. -
ఒక్క ఐడియా అమెరికానే మార్చేస్తుంది
మీ టూత్ పేస్ట్ అమ్మకాలు వెయ్యి రెట్లు పెరిగే అయిడియా నా దగ్గరుంది. ఒక మిలియన్ డాలర్లు ఇస్తే చెబుతాను అన్నాడట వెనకటికి ఒక తెలివైన కుర్రాడు. అదేమిటో చెప్పమని టూత్ పేస్ట్ కంపెనీ యజమాని అడిగాడట. ఐడియా నచ్చితే రెండు మిలియన్ల డాలర్లు ఇస్తానన్నాడట. మీ టూత్ పేస్ట్ మూత వెడల్పును ఒక మిల్లీ మీటర్ పెంచమన్నాడట కుర్రాడు. దీని వల్ల ఎక్కువ పేస్టు బయటికి వస్తుంది. ఈ అయిడియా వినగానే అక్షర లక్షల డాలర్లు ఇచ్చేశాడట యజమాని. ఇలాంటి పెద్ద మార్పు తెచ్చే చిన్న సలహానే అమెరికా ప్రభుత్వానికి ఇచ్చాడు ఒక భారతీయ బాలుడు. పధ్నాలుగేళ్ల సువీర్ మీర్ చందానీ అనే ఎన్నారై విద్యార్థికి వచ్చిన ఒక చిన్న ఐడియా అమెరికా ప్రభుత్వానికి ఏకంగా 400 మిలియన్ల డాలర్ల ఖర్చును తగ్గిస్తోంది. అయిడియా ఎంత సింపుల్ అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వాడే టైమ్స్ న్యూ రోమన్ అనే లెటర్ టైప్ (ఫాంట్) కి బదులుగా గారామోండ్ అనే ఫాంట్ ను వాడితే ఏడాదికి 400 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందన్నాడు సువీర్. అదెలాగంటే ఇంగ్లీష్ భాషలో చాలా విరివిగా వాడే అక్షరాలు ఏఈఐఓయూ అనే వొవెల్స్ (అచ్చులు). టైమ్స్ న్యూరోమన్ ఫాంట్ లో ఆ అక్షరాలు చాలా లావుగా ఉంటాయి. ఎక్కువ ఇంక్ వీటికి అవసరమౌతుంది. గారామోండ్ ఫాండ్ చాలా సన్నని ఫాంట్. దానికి చాలా తక్కువ ఇంక్ అవసరమౌతుంది. టైమ్స్ న్యూరోమన్ ఫాంట్ తో ఒక పేజీ రాస్తే ఖర్చయ్యే ఇంకు కంటే గారామోండ్ కి 25 శాతం తక్కువ ఇంకు అవసరమౌతుంది. ఇప్పుడీ సలహాను అమెరికన్ ప్రభుత్వమే కాదు, మొత్తం అమెరికన్ సమాజమే 'భలే భలే' అంటూ మెచ్చుకుంటోంది. -
ఎన్నికల వేళ ''వేలు'' లొల్లి