ముంబై: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తల సిరా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం లాతూర్లోని మత్వాడా ప్రాంతంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిపై శివసేన కార్యకర్తలు దాడి చేసి అతని మొహంపై ఇంకు చల్లారు. మల్లికార్జున్ భాయ్కట్టి అనే ఆర్టీఐ ఉద్యమకారుడు లాతూర్-నాందేడ్ రహదారిపై చేపట్టిన అక్రమ కట్టడానికి సంబంధించిన వివరాలను గురువారం బహిర్గతపరిచాడు.
భాయ్కట్టి చర్యతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో చితకబాదారు. అనంతరం సిరాతో ముఖాన్ని నల్లగా మార్చేశారు. మల్లిఖార్జున్ బ్లాక్ మేయిల్కు పాల్పడుతున్నాడని శివసేన కార్యకర్తలు ఆరోపించారు. గతంలో శివసేన కార్యకర్తలు 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్' చైర్మన్ సుధీంద్ర కులకర్నిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.