సిరా బదులు మార్కర్ పెన్! | Election commission likely to use parker pen instead of ink | Sakshi
Sakshi News home page

సిరా బదులు మార్కర్ పెన్!

Published Mon, Nov 23 2015 11:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

Election commission likely to use parker pen instead of ink

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటేశాక చూపుడు వేలుపై ఇప్పటిదాకా అద్దుతున్న సిరా గుర్తుకు బదులుగా మార్కర్ పెన్‌తో గుర్తుపెట్టే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్రష్‌తో మార్కింగ్ విధానం సరిగా లేదని ఓటర్లు నుంచి ముఖ్యంగా యువ ఓటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంక్ బాటిల్, బ్రష్ కంటే మార్కర్ పెన్నులను భద్రపరచడం, పంపిణీ చేయడం సులభం. ఈ మార్కర్ పెన్నుతో ఒకసారి గుర్తు వేస్తే నాలుగు నెలల పాటు చెరిగిపోదని మైసూర్ పెయింట్స్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement