Kulfi
-
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి. థండయ్ కుల్ఫీ కావలసినవివెన్న తీయని పాలు- 2 కప్పులు కోవా-100 గ్రాములు ; కండెన్స్డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే. -
యమ్మీ..యమ్మీ.. 'కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!
రకరకాల ఐస్‌క్రీం ప్లేవర్స్ ఉన్నా కూడా కుల్ఫీ చూడగానే దాన్ని తినేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. అది అంతలా మధురంగా యమ్మీ..యమ్మీగా ఉంటుంది. దీనికి తీసుపోనిదీ ఏదీ లేదన్నట్లుగా.. ఇష్టంగా తినే చల్లటి పదార్థాలలో దీనిదే అగ్రస్థానం. అంతలా తనదైన రుచితో ప్రజల మనసును దోచుకుంది. అలాంటి కుల్ఫీ ఎలా తయారవుతుందో, ఏవిధంగా ప్యాక్ చేస్తారో చూద్దాం మంచి ఎండల్లోనూ లేదా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి కుల్ఫీ తింటే.. ఆ ఫీల్ వేరు. అబ్బా తలుచుకుంటేనే నోట్లోకి నీళ్లూరతాయి. పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ దీని రుచికి ఫిదా అవుతారు. అలాంటి కుల్ఫీ ఎలా తయరవుతుందో తెలుసుకుందామనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. ఐతే ఘజియాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీ ఆ కుల్ఫీ ఎలా తయారువుతుందో విపులంగా వెల్లడించింది. సుమారు 120 లీటర్ల పాలనను మిషన్‌లో వేసి బాగా మరిగించి అందులో పాలపొడి, పంచదార తదితరాలను వేసి చిక్కగా మార్చుతుంది. ఆ తర్వాత 14 డిగ్రీల సెల్సియస్ చేరుకునేలా చల్లబరుస్తుంది. ఆ తర్వాత చక్కగా ప్యాక్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే) -
కుల్ఫీ తిన్న 65 మంది చిన్నారులు ఆసుపత్రిపాలు
ఆనందంగా గంతులేసుకుంటూ కుల్ఫీ తిన్న ఆ 65 మంది పిల్లలు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. కుల్ఫీ తిన్న వెంటనే వారు కడుపునొప్పితో తల్లడిల్లి పోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో కుల్ఫీ తిన్న 65మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో తల్లడిల్లిపోతున్న ఆ చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పిల్లలు ఏ వెండర్ దగ్గర నుంచి కుల్ఫీలు కొనుగోలు చేశారో, వాటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించి, పరిశీలన కోసం పంపించారు. ఆరోగ్యశాఖ అధికారి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఈ ఘటన రాజగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకున్నదన్నారు. చిన్నారులు ఒక వెండర్ దగ్గర కుల్ఫీలు కొనుగోలు చేశారు. వాటిని తిన్నవెంటనే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఒక్కక్కరుగా పిల్లలంతా అనారోగ్యం బారినపడ్డారు. వెంటనే స్థానికులు వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరికొందరు చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ బాధిత చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 50 మంది చిన్నారులు కోలుకోగా, వారిని వారి ఇళ్లకు పంపించామన్నారు. మరో 15 మంది చిన్నారులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. వీరు తిన్న కుల్ఫీ శాంపిల్‌ను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. చదవండి: రైతు ప్రాణాలు కాపాడిన ఆవు -
వైరల్: ‘పాపం కుల్ఫీలు అమ్ముతున్న ట్రంప్’
ఇస్లామాబాద్: సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటున్నారు. సామాన్యులను పోలిన వారు కనిపిస్తే.. పెద్దగా పట్టించుకోం కానీ సెలబ్రిటీలను పోలిన వారు కనిపిస్తే.. అదో పెద్ద విశేషంగా భావిస్తాం. వారికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో చేసి షేర్ చేసి వైరల్ చేస్తాం. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెటిజనులను అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అగ్రరాజ్యధ్యక్షుడిగా కంటే కూడా ఆయన ట్రెపంరితనం వల్ల ఎక్కువ ప్రసిద్ధి చెందారు. ఇక ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పెద్దగా కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా పాకిస్తాన్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముతూ జనాల కంట పడ్డారు. ట్రంప్ ఏంటి.. కుల్ఫీలు అమ్మడం ఏంటి అనుకుని కాస్త పరిశీలనగా చూసి అవక్కయ్యారు జనాలు. ఎందుకంటే ఆ వ్యక్తి అచ్చు ట్రంప్‌లానే ఉన్నాడు. ఇంకేముంది అతగాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని పాకిస్తానీ సింగర్, గేయ రచయిత షెహజాద్ రాయ్ అతని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'వా... కుల్ఫీ వాలా భాయ్... అద్భుతం..' అనే క్యాఫ్షన్‌తో వీడియోని షేర్ చేశారు. అంతేకాదు, ఎవరికైనా అతని గురించి తెలిస్తే తనకు చెప్పాలని కోరారు. షెహజాద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలోని వ్యక్తి కుల్ఫీ అమ్ముతూ ఉర్ధూ పాటలు అద్భుతంగా పాడుతున్నాడు. రూపంతోనే కాక గాత్రంతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ వీడియోపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అతను మాకు తెలుసని... అతని వద్ద చాలాసార్లు కుల్ఫీ తిన్నామని కొంతమంది చెబుతుంటే... బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక... ట్రంప్ ఇలా పాకిస్తాన్ వీధుల్లో కుల్ఫీ అమ్ముకుంటున్నాడేమో.. అంటూ మరికొందరు సెటైర్లేస్తున్నారు. ఈ వీడియోలోని వ్యక్తి పంజాబ్‌లోని సహివల్ ప్రాంతానికి చెందినవారని... ఆయన చిరునామా తాము చెబుతామంటూ మరికొందరు సింగర్ షెహజాద్ రాయ్ ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చారు. చదవండి: చైనా వైరస్: ట్రంప్‌పై దావా.. ఒక్కొక్కరి మీద 1 డాలర్ -
పిస్తా బాదం కుల్ఫీ
క్విక్ ఫుడ్ కావలసినవి పాలు – 2 కప్పు, పంచదార – 4 టీస్పూన్లు ఏలకులపొడి – చిటికెడు పిస్తా పప్పులు – 1 టీస్పూను తయారి : మందంగా వున్న పాన్‌లో పాలుపోసి ఎక్కువ మంటమీద మరిగిస్తూ కలుపుతుండాలి. పాలు ఒక కప్పు గా మరిగాక స్టౌ మంట తగ్గించాలి. ఈ మిశ్రమానికి పంచదార, ఏలకులపొడి బాదం, పిస్తా కలిపి దించేయాలి. కుల్ఫీట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు వుంచితే కుల్ఫీ రెడి. -
టచ్ ఫోన్ కోసం...
ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. కానీ అతని జీవితాన్ని ఓ టచ్ ఫోన్ మార్చి పారేసింది. టచ్ ఫోన్ కొనేందుకు సిద్ధమైన అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయనే ఆసక్తికరమైన కథాంశంతో ‘కుల్ఫీ’ చిత్రం రూపొందింది. జై, కలర్స్ స్వాతి ఇందులో హీరో హీరోయిన్లు. శరవణ రాజన్ దర్శకుడు. నరసింహారెడ్డి సామల నిర్మాత. ఈ నెల 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘అన్ని వర్గాలకూ నచ్చే కథ ఇది. యువన్ శంకర్‌రాజా స్వరాలందించిన పాటలు ఇటీవలే విడుదలై శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇందులో ఒక ప్రత్యేక గీతం చేశారు. వెంకట్ ప్రభు, కస్తూరి చిత్రానికి ఆయువు పట్టులాంటి పాత్రలు చేశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, కెమెరా: ఎస్. వెంకటేశ్, నిర్మాణ నిర్వహణ: ఎ.ఎన్. బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల. -
కుల్ఫీ మూవీ ఆడియో లాంచ్
-
ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది
‘‘చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ‘కుల్ఫీ’ అనే మంచి టైటిల్ కుదిరింది. కచ్చితంగా ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది’’ అని నటి ‘కలర్స్’ స్వాతి చెప్పారు. జై, ‘కలర్స్’ స్వాతి నటించిన తమిళ చిత్రం ‘వడకర్రి’ని తెలుగులో సామల నరసింహారెడ్డి అనువదించారు. శరవణ రాజన్ దర్శకుడు. ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, బిగ్ సీడీని దర్శకుడు సముద్ర, నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామల నరసింహారెడ్డి మాట్లాడుతూ -‘‘మాకిది తొలి సినిమా. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీస్తాం. పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఓ పాటలో నర్తించడం విశేషం’’ అని చెప్పారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర సమర్పకుడు సామల శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువన్ శంకర్‌రాజా ఓ పాటకు సంగీతం అందించారని నిర్మాణ నిర్వాహకుడు బాలాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు వివేక్, మర్విన్ సాల్మన్, దర్శకుడు శరవణ రాజన్, రచయిత కృష్ణతేజ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. -
సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ
ఓ కుర్రాడికి సెల్‌ఫోన్ కొనుక్కోవాలనే ఆశ. ఆ ఆశను నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వడకర్రి’. జై, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శరవణరాజన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ‘కుల్ఫీ’ పేరుతో నరసింహారెడ్డి సామల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు, కస్తూరి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శృంగారతార సన్నీ లియోన్ ప్రత్యేక నృత్య గీతంలో నర్తించారు. ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా తొలి ప్రయత్నమిది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ‘వడకర్రి’ తెలుగు అనువాదంతో నా కెరీర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత శృంగారతార సన్నీ లియోన్ ఈ చిత్రంలో ప్రత్యేక నృత్య గీతంలో నర్తించడం మరో విశేషం. యువన్ శంకర్‌రాజా ఆరు భిన్నమైన గీతాలను ఈ సినిమా కోసం స్వరపరిచారు. జూన్ 2న పాటల్ని, అదే నెలలో తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కథ, కథనంతో పాటు పాటల చిత్రీకరణ కూడా భిన్నంగా ఉంటుందని మాటల రచయిత కృష్ణతేజ అన్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా ఇదని నిర్మాణ నిర్వాహకుడు ఎ.ఎన్.బాలాజీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేశ్, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాణం: ఎస్.ఎన్.ఆర్ సినిమాస్. -
కుల్ఫీ మూవీ స్టిల్స్