సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ | Sunny Leone Item Song Stills From Vadacurry Kulfi In Telugu | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ

Published Mon, May 26 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ

సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ

 ఓ కుర్రాడికి సెల్‌ఫోన్ కొనుక్కోవాలనే ఆశ. ఆ ఆశను నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వడకర్రి’. జై, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శరవణరాజన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ‘కుల్ఫీ’ పేరుతో నరసింహారెడ్డి సామల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు, కస్తూరి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శృంగారతార సన్నీ లియోన్ ప్రత్యేక నృత్య గీతంలో నర్తించారు. ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా తొలి ప్రయత్నమిది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ‘వడకర్రి’ తెలుగు అనువాదంతో నా కెరీర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది.
 
  ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత శృంగారతార సన్నీ లియోన్ ఈ చిత్రంలో ప్రత్యేక నృత్య గీతంలో నర్తించడం మరో విశేషం. యువన్ శంకర్‌రాజా ఆరు భిన్నమైన గీతాలను ఈ సినిమా కోసం స్వరపరిచారు. జూన్ 2న పాటల్ని, అదే నెలలో తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కథ, కథనంతో పాటు పాటల చిత్రీకరణ కూడా భిన్నంగా ఉంటుందని మాటల రచయిత కృష్ణతేజ అన్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా ఇదని నిర్మాణ నిర్వాహకుడు ఎ.ఎన్.బాలాజీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేశ్, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాణం: ఎస్.ఎన్.ఆర్ సినిమాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement